సబ్ ఫీచర్

లేడీ సింగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లేడీ సింగం’ ‘రివాల్వర్ రాణి’ ‘మహిళా సర్పంచ్’ ‘సర్పంచ్ దీదీ’
ఇవన్నీ ఉప శీర్షికలు కాదు.. అభాదేవికి ఉన్న ముద్దుపేర్లు.. ఇంకో విషయం ఏమిటంటే.. వీటిలో ఏ పేరు చెప్పినా రౌడీలకు హడల్.. వివరాల్లోకి వెళితే.. అది బిహార్‌లోని పట్నాజిల్లాలోని గోన్‌పుర గ్రామ పంచాయితీ కార్యాలయం.. అక్కడ సర్పంచ్ కుర్చీలో అభాదేవి చెమటలను కక్కుతూ ప్రజల సమస్యలను తీరుస్తున్నారు. ఆ కార్యాలయం నిండా జనమే.. ఒకరి తరువాత ఒకరి మాటలను ఆమె వింటూనే ఉన్నారు. ఇంతలో ఫోను మోగింది. అంతే.. ఆమె టేబుల్‌పై ఉన్న తన తుపాకీని తీసుకుని బయలుదేరింది. వెంటనే సమస్యను పరిష్కరించడానికి.. అలంపూర్ గోన్‌పుర గ్రామ పంచాయితీ కింద మొత్తం 13 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలందరికీ పెద్ద దిక్కు ఆమే. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆమె దగ్గరికే పరిగెడతారు ప్రజలందరూ.. మహిళల హక్కులకు ఎటువంటి భంగం కలిగించినా ఊరుకోరు అభాదేవి. కాలేజీకి వెళ్లే ఆడపిల్లలను ఎవరు ఏడిపించినా, ఈవ్‌టీజింగ్ చేసినా అస్సలు ఊరుకోరు అభాదేవి. అందుకే పోలీసులు కూడా తమ వద్దకు వచ్చిన ఈవ్‌టీజింగ్ కేసులను ఆమె దగ్గరికే పంపిస్తారు. ఎవరైనా అమ్మాయిని ఏడిపిస్తున్నారని తెలిసి ఆమె అక్కడికి చేరుకుందని తెలిసినా, ఆమె రాకను గమనించినా ఎవ్వరూ అక్కడ ఉండకుండా పారిపోతారు. ఒక్క ఈవ్‌టీజింగే కాదు.. మహిళలకు సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా తీర్చడంలో ముందుంటారు అభాదేవి.
2011, 2016 సంవత్సరాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అభాదేవి సర్పంచ్‌గా ఎన్నికయ్యింది. అలంపూర్ గోన్‌పుర గ్రామ పంచాయితీ కింద ఉన్న 13 గ్రామాల్లోని ఆకతాయిలు, రౌడీలు, గూండాలు ఆమె పేరు చెబితేనే హడలిపోతారు. ఈమెను చంపాలనుకుని కొందరు రౌడీలు 2015లో ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. కానీ అభాదేవి ఆ ప్రమాదం నుంచి ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకుంది. ఈ సంఘటన తరువాత అభాదేవి తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. 2016లో ఉన్నతాధికారులు ఆమెకు తుపాకీ లైసెన్స్‌ను మంజూరు చేశారు. దాంతో ఒక రివాల్వర్‌ను కొనుక్కొని ప్రాణ రక్షణగా ఉంచుకుంది. ఆమెకు తుపాకీ శిక్షణను భర్త దగ్గర నేర్చుకుంది. 2017లో పంచాయితీ పరిధిలోని ఓ గ్రామంలో మత ఘర్షణలు చెలరేగాయి. ఇరువర్గాలవారు దాడులకు దిగారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అభాదేవి ఒక కర్ర తీసుకుని ఇరువర్గాలవారినీ చెదరగొట్టారు. ఇలా రౌడీ మూకలు పనిపట్టడంలోనే కాదు.. అభివృద్ధి, స్వచ్ఛత విషయంలో కూడా ముందుంటారు ఈ మహిళా సర్పంచ్.. అభాదేవి సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పంచాయితీ కార్యాలయానికి నూతన భవనాన్ని నిర్మించారు. పిల్లల చదువులకు మెరుగైన పాఠశాల భవనాలను నిర్మిస్తున్నారు. గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. ఎప్పుడూ తుపాకీని చేతబుచ్చుకుని తిరగడంతో ఆమెను అందరూ ‘లేడీ సింగం’, ‘రివాల్వర్ రాణి’గా పిలుస్తుంటారు. ఏది ఏమైనా మహిళల హక్కులను కాపాడుతూ, టీనేజీ అమ్మాయిలను వేధించినవారి పనిపడుతూ, రౌడీల పాలిట సింహస్వప్నంగా మారిన అభాదేవి ‘లేడీ సింగం’కాక మరేమిటి?

- సన్నిధి