Others

గరిక ప్రియుడు.. గజాననుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా పూజలో ముఖ్యమైనవి గడ్డి(గరిక) పోచలే. ఇవి లేని పూజవల్ల ప్రయోజనం ఉండదు అందువల్ల ఒకటి-లేదా ఇరవైఒక్క గడ్డిపోచలతో పూజ చేస్తే నేను సంతుష్టుణ్ణవుతాను. దీని ఫలితం నూరు యజ్ఞానవల్ల గానీ, ఉగ్రతపోనిష్ఠవల్ల గానీ సంపాదించే పుణ్యంకన్నా ఎన్నోరెట్లు అధికం’అని వినాయకుడే సూచించినట్టు గణేశ పురాణం చెబుతోంది.ఇలా గణేశుడే చెప్పడానికి కారణం ఓ పురాణ కథ.
పురాణ గాథ: అనలాసురుడు అగ్నిసంచితమైన తేజస్సుతో జన్మించడంవలన అనలాసురుని దేహం నుంచి వెలువడే ఆవిరులు భూలోక, దేవలోక వాసులను బాధించసాగాయి. అప్పుడు దేవేంద్రుడు గణపతిని ప్రార్థించగా, ఆయన అనలాసురుడ్ని బొటనవేలుతో నలిపి ఉంచి చుట్టి మింగివేశాడట. అతడు అగ్నిమయుడు కావటంవల్ల గణపతి ఉదరంలో విపరీతమైన ఉష్ణం జనించి, అమిత తాపాన్ని పుట్టించింది. దేవతలు ఆయన బాధ చూడలేక అమృతంతో అభిషేకించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇదంతా గమనిస్తున్న సాంబశివుడు జంట గరికపోచలతో గణపతిని పూజించమని దేవతలకు సలహా ఇచ్చాడు. వారు పరమేశ్వరుని ఆన అంటూ గరికను వినాయకునికి కప్పా రట. అంతే ఆ ఉష్ణతాపం అయిదారు క్షణాల్లోనే అణగారిపోయిందట. అప్పట్నుంచి గరికను వినాయకపూజలో ప్రథమంగా చేరుస్తారు. ఇప్పుడూ గజాననుడిని మెప్పించాలంటే జంట గరికపోచలతో పూజచేస్తే చాలు. ఆయన అనుగ్రహం వెంటనే లభ్యమవుతుంది.
ఆయుర్వేదం ప్రకారం : గరికలోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయనే ఆయుర్వేదం గరిక బలవర్థకంగాను , సంతాన నిరోధకంగాను కూడా పనిచేస్తుందని చెప్తుంది. మనదగ్గర జానపదుల కథల్లో గరిక పచ్చడి చేసినట్లుగా ఉంటే కొన్ని చోట్ల గరికతో రొట్టెను కూడా చేస్తారని కథనాలు వినిపిస్తాయ. వీటిని పరిశోధిస్తే ఎన్నో మేలైన విషయాలు వెల్లడి అవ్వొచ్చు. -

లక్ష్మీ ప్రియాంక