సబ్ ఫీచర్

మట్టి దేవునకు మండల పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిరిరాజసుతా తనయుడు, లంబోదరుడు, గణపతి, గజాననుడు, మూషిక వాహనుడు, షణ్ముఖ సోదరుడు, ఏకదంతుడు, విద్యాధిదేవత- పరబ్రహ్మ స్వరూపుడైన ఆదిదేవునకు అనంతనామాలు. ఆయనే పరమాత్మ.‘‘గణభ్యో గణపతిభ్యశే్చ వో నమః... రుద్ర నమక మంత్రాలు రుద్రుడే గణపతి అని చెబుతున్నాయ.
‘‘యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతేషు ప్రతిష్ఠితః’’ ఓంకార ప్రణవనాద స్వరూపుడు- మహాగణపతి.
గాణాపత్యంలో ‘గణము’ అంటే త్రిగుణాలైన సత్త్వ తమో గుణాల సమ్మేళనం. వరదునిగా, అభయహస్తునిగా, సిద్ధిబుద్ధి ప్రదాతగా జనావళిలో బహుళ ప్రాచుర్యం పొందినవాడు విఘ్నరాజు.
నిరాకారపూజకు సకార పూజకు ఆజ్యుడు గణనాథుడే. నిర్గుణుడు, నిరాకారుడు, అవ్యయుడు, సర్వవ్యాపి, జగత్కారణ కారణుడు అగు పరబ్రహ్మ గణపతి ఆకారం ధరించాడు. అతడే ఆద్యావిర్భవుడు, ఆది పూజ్యుడున్ను, తర్వాత ఎన్నో అవతారాలు, ఎన్నో ఆకారాలు, ఎనె్నన్నో పేర్లు. గణపతి యొక్క నిరాకారత్వ సూచనయే మనం కార్యారంభమందు చేసే ‘పసుపు’ విఘ్నేశ్వరుని పూజలోని అంతరార్ధము.
విఘ్నాలను పారద్రోలే విఘ్నేశ్వరునికి మండల దీక్షలు చేసి కోరిన కోర్కెలు తీర్చుకునేవారు ఉన్నారు. మండల దీక్షలు చేసే వారిలో కొందరు శ్రావణ శుద్ద చవితినాడు మొదలు పెడితే మరికొందరు భాద్రపద శుక్ల చవితినాడు ప్రారంభిస్తారు. మండలదీక్ష ఆరంభం రోజు ఆలయానికి వెళ్లో లేక ఇంట్లోనో మాలధారణ చేస్తారు. ఇలా మాలధారణ చేసే స్వాములు గణపతి ప్రతిరూపాలుగా సంభావిస్తారు. మాలధారణ చేసినవారు వారి వర్తమాన నామధేయాలను పక్కన పెడ్తారు. ఎదుటి వారిని సైతం గణపతి నామధేయంతోనే పిలుస్తుంటారు. మాలధారణ చేసినవారు సంకల్పసిద్ధికోసం పదకొండుమార్లు ఓ గం గణపతయే నమః అంటూ జపిస్తారు. ఈ మాలధారణ చేసినవారు శే్వత వస్త్రాలను ధరిస్తారు. పూజామందిరంలో గణపతి విగ్రహాన్ని పెట్టుకుని అలంకరించి దానిముందు పసుపు గణపతిని చేసి విఘ్ననాశనాన్ని చేయుమని ప్రతిరోజూ వేడుకొంటారు. వినాయకుడికి ఇష్టమైన లడ్లు, కుడుములు, పాలకాయలు, కజ్జికాయలు, ఉండ్రాళ్లు, పూర్ణ కుడుములు లాంటి పిండి వంటలను నివేదన చేసి తాము సేవించి ఇతర భక్తులకు పంచి పెడ్తారు. ఇలా చేయడం వల్ల గణేశుడు ఆనందిస్తాడని భక్తుల నమ్మకం. త్రికాలాలలోనూ గణపతి ఆరాధిస్తూ ఎవరినీ నొప్పించకుండా వారు నొవ్వకుండా ఉంటారు.
ఆ మృణ్మయ వినాయకుణ్ణి నియమ నిష్ఠలతో పూజిస్తూ మండలంరోజులు సమస్తవిశ్వాన్ని విశ్వనాయకుని రూపంగా భావిస్తూ దీక్షనుపూర్తిచేస్తారు. మండలం చివరిరోజు వినాయకుడి ఆలయానికి వెళ్లి దీక్షను విరమిస్తారు. అనంతరం జపహోమాదులతో పాటుగా అన్నదానాన్ని చేసి వినాయకుడిని సంతృప్తి పరుస్తారు. దీక్షాకాలంలో సాయంసంధ్యలలో గణేశ భజన కూడా చేస్తారు. ఇలా చేసిన వారిని అఖండ ఐశ్వర్యాదులు కలుగుతాయని అనుకొన్న పనులకు విఘ్నాలు ఏర్పడకుండా వినాయకుడు అనుగ్రహిస్తాడని ప్రతీతి.

- చోడిశెట్టి శ్రీనివాసరావు