సబ్ ఫీచర్

వైద్య స్ఫూర్తికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈసురోమని మనుష్యులుంటే దేశమేగతి బాగుపడునోయ్, తిండి కలిగితే కండ కలుగును కండకలవాడే మనిషోయ్’ అంటూ గురజాడ అప్పారావు ప్రబోధం జాతి జనులకు స్ఫూర్తినివ్వాలి. పేదరికం, అనారోగ్యం, అవిద్య, తదితర అసమానతలు లేని నవభారత నిర్మాణానికి దేశ నాయకత్వానికి స్వతంత్ర భారత తొలి రాష్టప్రతి బాబురాజేంద్రప్రసాద్ పిలుపిచ్చారు. ప్రజల ఆరోగ్య అవసరాలు, ప్రాధాన్యాలకు అనుగుణంగా నాణ్యమైన వైద్యం అందించే దిశగా జాతీయ ఆరోగ్య విధానం 2017లో ప్రవేశపెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సంపూర్ణ ఆరోగ్య ఫలాలను అందించడమే ఈ విధాన లక్ష్యం. పేద, బడుగు బలహీన, మధ్యతరగతి, నిరుపేద ప్రజలకు ఎలాంటి వైద్యఖర్చులు లేకుండా అత్యాధునిక వైద్య సేవలందించి స్వాంతన కలిగించడమే జాతీయ ఆరోగ్య విధాన ప్రథమ సంకల్పం.
జబ్బురాకముందే ముందస్తు నివారణ చర్యలు
వైద్య చికిత్సలో మూలసూత్రం
ఈ ఆరోగ్య వైద్యవిధానంతో దేశవ్యాప్తంగా వ్యాధి నిరోధక చర్యలు, అంటురోగాలు ప్రబలకుండా చూడడానికి తాజా వైద్య విధానం ప్రాధాన్యమిస్తోంది. ఉచిత వైద్యసేవలు, మందులు, పరీక్షలు, అత్యవసర చికిత్స వంటి వాటికి ఈ వైద్య విధానంలో అగ్ర ప్రాధాన్యం దక్కబోతుంది. అయితే ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా అమలుపరిచే తీరుపై ఈ విధానం రోగులకు చేరువవుతుందనే నగ్నసత్యాన్ని గుర్తించాలి.
ఏటా భారత ప్రజలు తమ ఆరోగ్యం కోసం తమ సంపాదనలో 67 శాతం వెచ్చించడం బాధాకరమైన విషయం. జబ్బులకే ఇంతమేర వెచ్చిస్తే కుటుంబ పోషణ అతలాకుతలమై అర్ధాకలితోను, ఇతర వెచ్చాలకు డబ్బులేని పరిస్థితిలో సతమతమవడం నికర దుస్థితి. ఆరోగ్య బీమా ద్వారా ఆ ఖర్చులను పూడ్చుకొనే వెసులుబాటు ఉన్నా ఆరోగ్య బీమా గురించి ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించకపోవడం వలన నేటికి గ్రామీణ ప్రాంతాల్లో 86 శాతం, పట్టణ ప్రాంతాల్లో 82 శాతం బీమా లేకపోవడం ప్రభుత్వాల చిత్తశుద్ధికి నిదర్శనం. దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యానికి ప్రజలు వెచ్చించిన సొమ్మును తిరిగి చెల్లిస్తున్నాయి. ఏ కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాకుండా వ్యాధుల బారినపడిన రోగులందరికీ దేశవ్యాప్తంగా వైద్య ఖర్చులన్నింటిని ప్రభుత్వాలే భరించి స్వస్థత చేకూర్చాలి.
ప్రైవేటు వైద్యశాలకు ప్రోత్సాహమివ్వాలి
దేశంలో నానాటికీ పెరుగుతున్న జనాభా, రోగుల సంఖ్యను ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకొని వాటికి ప్రభుత్వాలు ప్రోత్సాహమివ్వాలి. ప్రతి రెండేళ్లకోసారి ప్రైవేటు వైద్యశాలల నాణ్యతను, చికిత్సావిధానాలను ప్రభుత్వ వైద్యాధికారులు పరిశీలించి వాటికి రేటింగ్ ఇవ్వాలి. క్యాన్సర్, గుండె జబ్బులు ఇతరత్రా ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు అవసరమైన మం దులు, పరికరాలు ఇప్పటికి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. దేశీయంగానే అలాంటి ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, అలాంటి వాటికి రాయితీలు ప్రభుత్వాలు ఇవ్వడంవలన ధరలను తగ్గించడమేకాకుండా దేశీయ వైద్య అవసరాలకుతగ్గ పరికరాలను ఉత్పత్తి చేసుకొనే వెసులుబాటు కలుగుతోంది.
రోగుల సమగ్ర సమాచారాన్ని, ఐసీటీ, టెక్నాలజి ఉపయోగించాలి
ఐసీటీ టెక్నాలజీ ద్వారా రికార్డులను అంతర్జాలం ద్వారా దూర ప్రాంతాల్లోని వైద్యులకు పంపించి టెలీమెడిసిన్ రూపంలో వారి సలహాలు తీసుకోడానికి సాయపడడమేకాకుండా, సందర్భానుసారం వైద్య కళాశాల విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. భారతీయ వైద్యంలో పూర్వం నుండి వస్తోన్న ఆయుర్వేదం, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ వంటి సాంప్రదాయ వైద్యవిధానాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే రోగులకు మరింత సౌలభ్యత, నయం చేసే అనుకూలత అలపడుతోంది.
వైద్య రంగానికి విధిగా నిధులు కేటాయించాలి
వైద్య ఆరోగ్యరంగంలో కొనసాగుతున్న పరిశోధన ఫలితంగా భారతదేశంలో 1990 నుంచి పౌరుల ఆయుః ప్రమాణం 58 ఏళ్లనుంచి 68.3 ఏళ్లకు పెరిగినా, అనేక దేశాలలో ప్రజలు మన దేశ ప్రజలకంటే ఎక్కువకాలం బ్రతకడంతోపాటు ఎక్కువగా నాణ్యమైన జీవనం గడుపుతున్నారు. మానవాభివృద్ధి చెందుతున్న 188 దేశాలలో మానవాభివృద్ధి సూచిలో భారత్ స్థానం 130నుంచి 131కి దిగజారింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రేటులో భారత్ దూసుకెళుతున్నా మానవాభివృద్ధి సూచికలో వెనుకబడడం దిగ్భ్రాంతికరమే. ప్రస్తుతం జీడీపీలో 1.15 శాతం నిధులు మాత్రమే ఆరోగ్యరంగానికి కేటాయిస్తుండగా ఎన్‌హెచ్‌పీ దీన్ని 2.5 శాతానికి పెంచాలంటోంది. మరో విచిత్ర పరిణామమేమిటంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కేటాయించిన కొద్దిపాటి నిధులను కూడా వెచ్చించకుండా వాపసు ఇచ్చేస్తున్నాయి.
పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంకల ఆరోగ్య విధానానికి తక్కువ నిధులతోనే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. జాతీయ ఆరోగ్య విధానం గురించి భారత్ ఇతర దేశాల అనుభవాలనుంచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వైద్యశాలలు జనజీవాలు
1990లలో ఆర్థిక సరళీకరణను పురస్కరించుకొని ప్రైవేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా విస్తరించినా అవి లాభసాటి ప్రాంతాల్లో ఉండడంవల్ల గ్రామీణ ప్రాంతాలకు ఆశించిన వైద్యసేవలు అందలేదు. పౌరులందరికీ ప్రాథమిక వైద్య సౌకర్యాలు ఎన్.హెచ్.పీ కింద అయుష్ ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చి నగరాలలో, పట్టణాలల్లోని పేద ప్రజలకు ఆరోగ్య సౌకర్యాలు ఇబ్బడిముబ్బడిగా తీర్చే జాతీయ పట్టణ ఆరోగ్య పథకాన్ని ప్రభుత్వం అమలుచేయాల్సిన అత్యయిక వైద్యసేవలు ప్రణాళికాబద్ధంగా అమలుచేయాల్సిన అగత్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

- దాసరి కృష్ణారెడ్డి 9885326493