సబ్ ఫీచర్

అద్భుతం భారతీయుల వైజ్ఞానిక దృక్పథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశానికి తనదైన వైజ్ఞానిక చరిత్ర ఉందా? ఉంటే అది ఎటువంటిది? పాశ్చాత్యుల కన్నా అది ఏ విధంగా ప్రత్యేకమైనది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదికినప్పుడు మనకు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
అల్ బిరూనీ క్రీ.శ.973-1052 నాటి పర్షియన్ జ్ఞాని. వెయ్యి సంవత్సరాల క్రితం మన దేశంపైకి దండెత్తి వచ్చిన మహమ్మద్ గజనీతో పాటు యితడు కూడా మన దేశంలోకి వచ్చేడు. గజనీ సంచార దర్బారులో కొంతకాలం ఆస్థాన పండితుడిగా ఉన్నాడు. అతడు ఎన్నో గ్రంథాలను రచించేడు. వాటిలో ‘తాఖిఖ్ మా లి-ల్-హింద్ మిన్ మాఖ్బులహ్ మాఖ్బులహ్ ఫి అల్-అఖల్ అవ్ మార్దులహ్’’ (్భరతీయులు చెప్పిన విషయాలలో ఉచితానుచితాలు - ఒక పరిశీలన) అన్న పుస్తకం ప్రముఖమైనది. తన పుస్తకంలో చాలా అధ్యాయాలలో భారతీయ ఖగోళ శాస్త్రాన్ని గురించి అల్ బిరూనీ చెప్పిన విషయాలు పాఠకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. విజ్ఞానశాస్త్రం, కళలు, ఆధ్యాత్మిక పరిజ్ఞానంలో తమకు సాటి ప్రపంచంలో ఎవరూ లేరని హిందువులు భావించేవారని అల్ బిరూనీ పేర్కొన్నాడు. అయితే ఎన్నో అద్భుతమైన విజ్ఞాన శాస్త్ర విషయాలని భారతీయులు పురాణగాథలతో మేళవించి చెప్పడం అతనికి నచ్చలేదు.
అల్-అందలూసీ (క్రీ.శ. 1029-1070) స్పానిష్- అరబ్‌కి చెందిన గణిత శాస్తజ్ఞ్రుడు, ఖగోళ శాస్తజ్ఞ్రుడు. అతడు ప్రపంచ విజ్ఞానశాస్త్ర చరిత్ర గురించి ఒక పుస్తకం వ్రాశాడు. దాని పేరు ‘‘అల్- తరిఫ్ బి- తబాకత్ అల్-ఉమామ్’’ (అంటే జాతుల తరాలు- ఒక వ్యాఖ్యానము). ఈ పుస్తకంలో భారతీయ విజ్ఞాన శాస్త్రంలోని ఎన్నో అద్భుతమైన విషయాలను గూర్చి పేర్కొన్నాడు. గ్రీకులు, ఈజిప్షియనులు, అరబ్బులు, హిందువులు (్భరతీయులు) విజ్ఞాన శాస్త్రంలో చేసిన గణనీయమైన కృషిని ఈ పుస్తకంలో ఆయన తులనాత్మకంగా పేర్కొంటూ వీరిలో హిందువులే అగ్రగాములని పేర్కొన్నాడు. హిందువులు ఎంతో తెలివైన వారనీ, సృజనశీలురనీ, వారికి భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయనీ అల్-అందలూసీ తన పుస్తకంలో పేర్కొన్నాడు.
ఆ కాలంలో ప్రపంచస్థాయి మేధావులకు అరబ్బులు ఆకర్షణ కేంద్రంగా ఉండేవారు. అయినా తాము భారతీయ, గ్రీకు తదితర నాగరికతల నుంచి ఎంతో నేర్చుకున్నామని ఏ సంకోచమూ లేకుండా చెప్పుకున్నారు.
ఇరాక్ రాజధాని బాగ్దాదులో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘హాల్ ఆఫ్ విజ్‌డమ్’ ఉంది. ఇక్కడ ఆర్యభట్టు, బ్రహ్మగుప్తుడు, చరకుడు, సుశ్రుతుడు రచించిన పుస్తకాలన్నింటికి అరబిక్ అనువాదాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి పర్షియన్, చైనా అనువాదాలు కూడా ఇక్కడ లభిస్తాయి.
ఇదంతా గమనించినప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం విజ్ఞానశాస్త్ర రంగంలో భారతీయుల పాత్ర ప్రముఖమైనదని అవగతవౌతుంది.
భారతదేశ ఖగోళ శాస్తజ్ఞ్రుడైన ఆర్యభట్టు గొప్ప వివేకి. అతడి ఆవిష్కరణలను కేవలం కల్పితాలుగా కొట్టిపారేయకూడదు. చంద్రుని నీడ భూమిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందనీ, చంద్రునిపై భూమి నీడ పడినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుందనీ అతడు పేర్కొన్నాడు. చంద్రునిపై పడే భూమి నీడ యొక్క ఆకారాన్నిబట్టి అతడు భూమి గుండ్రంగా ఉంటుందని ఊహించేడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూండడంవల్ల పగలు, రాత్రి ఏర్పడుతాయని అతడు ప్రతిపాదించాడు. అంతేకాదు, భూమి కదులుతున్నప్పటికీ దానిపైనున్న వారికి అది నిశ్చలంగా ఉన్నట్టూ, ఆకాశంలోని సూర్యుడు మొదలైనవి పరిభ్రమిస్తున్నట్టూ అనిపిస్తుందని అతడు ప్రతిపాదించాడు. నేడు ఇది చాలా సామాన్యమైన పరిజ్ఞానంగానే కనిపించవచ్చు. కానీ ఆర్యభట్టు నాటి ప్రపంచంలో పేరుకుపోయిన విశ్వాసాలకు, అభిప్రాయాలకూ విరుద్ధంగా తన ప్రతిపాదనలను ముందుంచాడు.
దానవులైన రాహువు సూర్యుని మింగడంవల్ల, కేతువు చంద్రుని మింగడంవల్ల సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడతాయన్న పురాణగాథల్ని ఆర్యభట్టు తోసిపుచ్చాడు. కేతువు మొండెము సర్పాకారంలో ఉంటుంది కదా. మరి చంద్రగ్రహణం వచ్చినప్పుడు తానూ పాము ఆకారంలో గల నీడని చూడలేదని పేర్కొన్నాడు. ఆర్యభట్టుకి వంద సంవత్సరాల తరువాత వాడైన బ్రహ్మగుప్తుడు రాహుకేతువుల విషయంలో ఆర్యభట్టు వాదనలను తీవ్రంగా ఖండించాడు. అయితే ఆర్యభట్టు అనుచరుల్లో ఒకడైన వరాహమిహిరుడు (క్రీ.శ.505-587) బ్రహ్మగుప్తుని వాదనలను త్రోసిపుచ్చేడు. ఎందుకంటే బ్రహ్మగుప్తుడు కూడా భూమిపై ఏర్పడే చంద్రుని నీడవల్ల సూర్యగ్రహణం, చంద్రునిపై ఏర్పడే భూమి నీడవల్ల చంద్రగ్రహణం వస్తాయని ఊహించాడు. బ్రహ్మగుప్తుని వాదనలోని ఈ అస్థిరత్వాన్ని అల్-బిరూనీ కూడా ప్రశ్నించేడు. దీనినిబట్టి పురాణగాథలకి, విజ్ఞానశాస్త్రాలకి మధ్య చర్చ భారతదేశంలో కనీసం ఆర్యభట్టు- బ్రహ్మగుప్తుల కాలం నుండీ వస్తోంది అని తెలుస్తోంది. ఇది ఇప్పటికీ మన దేశంలో కొనసాగుతోంది.
ఆర్యభట్టీయంలో ‘దృగ్ గణిత’ అన్న శబ్దము ప్రయోగింపబడింది. ‘దృగ్’ అంటే చూడడం లేదా గమనించడం. ‘గణిత’ అంటే లెక్కించడం. అనగా చూడడం, గమనించడం ద్వారా గ్రహించినదానిని గణన ప్రక్రియ ద్వారా వివరిస్తూ నిరూపించడమన్నమాట. నేటి విజ్ఞానశాస్త్ర పరిశోధనల్లో కూడా ఈ పద్ధతిని అనుసరించడం మనం చూస్తున్నాం. గ్రీకులు అనుసరించిన ఆలోచనాత్మక సుదీర్ఘ విశే్లషణలకు కాకుండా భారతీయులు గణన పద్ధతికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేరు. విజ్ఞానశాస్త్ర పరిశోధనల్లో తక్కిన ప్రపంచం అనుసరించిన పద్ధతులన్నింటికన్నా ఇదే శ్రేష్ఠమైనది. పంతొమ్మిదవ శతాబ్దంలో అంక గణితం (ఆల్జీబ్రా), ఇతర గణనపద్ధతులతో మేళవించిన న్యూటన్ సిద్ధాంతం ఖగోళ శాస్త్రంతోపాటు ఇతర భౌతిక శాస్త్రాల తీరునే మార్చేసింది. న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలను ఎంతో విశిష్టమైనవిగా ప్రపంచం గౌరవిస్తుంది. కానీ న్యూటన్ తాను రహస్యంగా మతశాస్త్రం గురించి వ్రాసుకున్న పుస్తకానికి ఇచ్చిన ప్రాముఖ్యాన్ని తన సిద్ధాంతాలకు ఇవ్వలేదు. ఇది చాలా కొద్దిమందికే తెలుసు.
ప్రాచీన భారతదేశ, ఐరోపీయుల గ్రంథాలను పరిశీలించినట్లయితే కొత్త పద్ధతుల్లో జ్ఞాన సముపార్జన ఎలా చేసేవారో అర్థవౌతోంది. క్రీ.శ. 17వ శతాబ్దంలో బేకన్ చెప్పిన పద్ధతులనే న్యూటన్ అనుసరించాడు. విజ్ఞాన శాస్త్రాన్ని గణితశాస్తప్రరంగా విశే్లషించడమే ఈ మార్పునకు కారణమని పాశ్చాత్యులు చెప్తారు. కానీ ఇందులో వాస్తవం లేదు. ప్రాచీన భారతీయులు, గ్రీకులు గణితశాస్త్ర పద్ధతులలోనే విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలను ప్రతిపాదించారు. 16వ శతాబ్దం తరువాత పాశ్చాత్యులు సంఖ్యాశాస్త్రం, బీజ గణిత పద్ధతులను కూడా అనుసరించడం మొదలుపెట్టేరు. ఈ రెండింటినీ వారు భారతదేశం నుండి పొందారు. బీజగణితం అరబ్బులు, పర్షియన్లు ద్వారా ఐరోపా దేశాలను చేరింది. అక్కడినుండి గణితశాస్త్రం పట్ల ఐరోపావారి దృక్పథమే మారిపోయింది. పాశ్చాత్య దేశాలలో గణిత శాస్తజ్ఞ్రుడిని క్షేత్ర గణితజ్ఞుడిగానే పరిణించేవారు. కానీ భారతదేశంలో గణిత శాస్తజ్ఞ్రుడు క్షేత్ర గణితానికే పరిమితం కాలేదు. లెక్కించడం, అంచనా వేయడం, ఎంపిక చేయడం వంటి పద్ధతులన్నీ భారతీయ గణిత శాస్త్రంలో ఉండేవి. ‘బీజము’ అంటే అవ్యక్తమైనది లేదా అగోచరమైనది అని అర్థం. తనలోనే వున్నది బయటపెట్టనిది బీజము. ‘అవ్యక్తమైనదానిని వ్యక్తపరచేదే బీజగణితం’ అని భాస్కరాచార్యుడు అన్నాడు. అంటే ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగించి సమీకరణాల ద్వారా పరిష్కరించి అవ్యక్తంగా ఉన్నదానిని బయల్పరచడానికి బీజగణితం ఉపకరిస్తుందన్నమాట. ఈ బీజగణితమే ఆల్జీబ్రాగా ఐరోపా, అరబ్బు దేశాలలో ప్రాచుర్యం పొందింది.
నీలకంఠుడు కేరళ ప్రాంతానికి చెందినవాడు. ఇతడు 15-16 శతాబ్దాలకు చెందిన గణిత శాస్తజ్ఞ్రుడు. ఇతడు జ్యోతిర్మీమాంస అన్న గ్రంధాన్ని వ్రాశాడు. దురదృష్టవశాత్తు ఇది ఆంగ్లంలోకి అనువదింపబడలేదు. ఇందులో జ్ఞానమీమాంస గురించి చెప్పబడింది. మనం చెప్పే విషయంలో తరతరాలపాటు విశ్వసనీయత, విలువ నిలిచి ఉండాలంటే ఆ విషయాన్ని ఎలాంటి పద్ధతులలో చెప్పాలో ఈ పుస్తకంలో వివరించాడు నీలకంఠుడు. ప్రిన్సిపుల్ మేథమేటికా ఫిలాసఫియా నేచురలిస్ (ది మేథమేటికల్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ నేచురల్ ఫిలాసఫీ) పేరుతో న్యూటన్ విజ్ఞానశాస్త్రానికి సంబంధించి ఎన్నో గ్రంథాలను రచించాడు. మొదటి రెండు సంపుటాలలో అతడి చర్చ యూక్లిడియస్ అనే శాస్తవ్రేత్త అనుసరించి ఊహించే పద్ధతిలో సాగుతుంది. అయితే మూడవ సంపుటం నుండి న్యూటన్ తన సిద్ధాంతాలను చర్చించే తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. బ్రిటీష్ వారు 19 శతాబ్దంలో మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేంతవరకు భారతీయులు యూక్లిడియస్ ఆలోచనా ధోరణితో పరిచయం లేదు. భారతీయ న్యాయవ్యవస్థ కూడా తర్కాన్ని ఆధారంగా చేసుకొని ఒక విషయాన్ని నిర్థారించే పద్ధతికి ప్రాధాన్యాన్నివ్వలేదు.

- ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్ 8008264690