సబ్ ఫీచర్

పర్యావరణం.. పిల్లలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న సామెత అందరూ వినే ఉంటారు. నిజమే ఏదైనా చిన్నపుడు నేర్చుకుంటేచాలు అది జీవితాంతం గుర్తుండి పోతుంది. అందుకే బాల్యం చాలా విలువైనది మధురమైందీ.
తల్లిదండ్రులంతా పిల్లల బాల్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సే ఉంటుంది. ఇపుడు మన మున్న పరిస్థితుల్లో పిల్లలకు పర్యావరణం మీద మంచి అవగాహనను చిన్నప్పటినుంచే నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఓజోన్ పొరకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఎంత దూరం లేవని వారు చెబుతున్నారు. మనం ఉపయోగించే ప్యాస్టిక్, కొన్ని రకాల రసాయనాలు ఇవన్నీ ప్రకృతికి చెడు చేస్తునే ఉన్నాయి.
కనుకనే చిన్నప్పటినుంచీ ప్రకృతితో స్నేహం ఎలా చేయాలో చెట్లు వల్ల లాభాలేమిటో ప్రకృతి మనకు ఎంతగా ఉపయోగపడుతుందో పిల్లలకు ఇంట్లోను బడుల్లోను కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదిగో ఆ దారినే నడుస్తున్న ఐశ్వర్య గురించి మనం తెలుసుకొందాం.
ముంబయిలో పనే్వలికి చెందిన ఐశ్వర్యా శ్రీధర్‌కు వారి తల్లిదండ్రులు చిన్నప్పటినుంచీ చెట్ల పెంపకం, వాతావరణానికి చెట్లు ఎలా ఉపయోగపడతాయో, ప్రకృతి ఎలా కాపాడుకోవాలో చెబుతుండేవారట. దాంతో ఈ అమ్మాయికి ప్రకృతి , పర్యావరణం, వన్యప్రాణులు మొదలైన వాటిమీద చిన్ననాడే ఇష్టం ఏర్పడింది. పాఠశాలలో చదువుకునే వయస్సులోనే వన్యప్రాణులు ఎందుకు అవసరం అని, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అని, ప్రకృతి మనిషికి ఏవిధంగా ఉపయోగపడుతుందనీ ఇట్లాంటి వ్యాసాలు రాసేది. వకృత్వపోటీల్లో కూడా ఇలాంటివాటి మీద మాట్లాడుతూ ఉండేది. ఈఅమ్మాయి కి 15 ఏళ్ల వయస్సులో సాంకుర్చి ఆసియాయంగ్ నాచురల్ అనే అవార్డు లభించింది. ఈ అవార్డు పొందిన పిల్లల్లో ఈమె మొదటి అమ్మాయి.
కాలేజీలో చదువుకునేటపుడు కూడా తన తోడి వారికి ప్రకృతి గురించి చెప్పి వారిని కూడా ప్రకృతి ప్రేమికులను చేస్తోంది. వారితో కలసి ఒక టీమ్‌ను తయారు చేసింది. ఆ టీమ్ వారంతా కలసి వన్యప్రాణుల గురించి అందరికీ చెబుతూ తనకు ఎక్కడైనా పాములు లేక చిన్న చిన్న జంతువులు కనిపించినపుడు వాటినిజాగ్రత్తగా తీసుకొని వెళ్లి అటవీ సంరక్షణ అధికారులకు అప్పగిస్తారట. అన్నీ పాఠశాలలకు తిరిగి సుమారుగా ఇప్పటివరకు 20 000 మొక్కలను ఈ టీమ్ తో కలసి ఐశ్వర్య నాటిందట.
చూశారా పిల్లలూ.. మరి మీరు కూడా చెట్ల పెంపకం చేపడుతారా..
పిల్లలూ ఈ అమ్మాయి గురించి తెలుసుకొని మీరు కూడా ప్రకృతి ప్రేమికులుగా మారండి. ప్రతివారు మొక్కలు నాటాలి. నాటమన్నారు కదా కేవలం నాటేసి వెళ్లిపోతే ప్రయోజనం లేదు. ఆ మొక్కను మీ చెల్లాయని లేక తమ్ముడిని ఎలా చూసుకుంటారో అలాగు చూసుకోవాలి. ఆ మొక్క పెరిగి చెట్టయి, వృక్షంగా మారి మీకే కాక నలుగురికీ ఉపయోగపడితే అపుడు మీరు మొక్కను నాటినవారు అవుతారు. అపుడు మీకు మీ తల్లిదండ్రులను కూడా ప్రశంసలు వస్తాయ.

సంపూర్ణ చంద్రిక