సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలభక్తుని దేవతార్చన
1091. ఒక దేవతార్చన బ్రాహ్మణుడొకరింట నిత్యము దేవతార్చన చేయుచుండువాడు. ఆ పనిని దన చిన్నకుమారున కొప్పగించి యొకప్పుడాతడు గ్రామాంతరముపోయెను. నిత్య నైవేద్యమును దేవునిముందు బెట్టి, దేవుడు దాని నారగించునట్లు చూడుమని యాతడు బాలునకు జెప్పియుండెను. తండ్రి యాజ్ఞననుసరించి పిల్లవాడు నైవేద్యమును విగ్రహముముందుబెట్టి వౌనముగా వేచియుండెను. కాని యావిగ్రహము తిననుదినదయ్యె; మాటాడను మాటాడదయ్యె! ఐనను పిల్లవాడు చాలసేపటులనే వేచియుండెను. దేవుడు పీఠము దిగివచ్చి నైవేద్యము పెట్టిన పళ్లెరములకడ గూర్చుండి తినునని పిల్లవాని దృఢ విశ్వాసము! అంతనాతడు, ‘‘ఓ దేవుడా! రమ్ము, ఆరగింపుము, ఆలసింపకుము, నేనింక గనిపెట్టుకొనియుండలేను’’ అని వేడుకొనసాగెను. కాని దేవుడు పలుకలేదు. ఆ బాలుడంతట, ‘‘్భగవంతుడా! నీవీ నైవేద్యము నారగించునట్లు చూడుమని మా నాన్న నాతో జెప్పినాడు. నీ వేల రావు? నీవు మా నాన్నయొద్దకువచ్చి యాయనర్పించు నైవేద్యము నారగింతువుగదా! నీవు వచ్చి నేనర్పించుదానిని దినవేమి? నా నేరమేమి?’’ అనుచు నేడ్వసాగెను. ఆ విధముగా చాలసేపు వెక్కివెక్కి యేడ్చినాడు. అంతట దేవతాపీఠము వంక గనువిచ్చి చూడగా, దేవుడు నర రూపమున వచ్చి నివేదిత పదార్థములను దినుచుండుట కాననయ్యెను! అటుల దేవతార్చనమును ముగించ బాలుడు వెలుపలికి రాగా, ఆ యింటివారు, ‘‘దేవతార్చన పూర్తియైన యెడల ప్రసాదమును దీసికొని రమ్ము’’అనిరి. ‘‘ఔను, దేవతార్చనయైనది. దేవుడంతయు దినివేసినాడు’’ అని యా బాలుడు సమాధానము చెప్పినాడు. వారందఱును నివ్వెఱపడి, ‘‘నాయనా! ఏమనుచున్నావు? దేవుడే యంతయు దినివేసినాడా?’’ అనిరి. శుద్ధ నిష్కాపట్యము మోమున దాండవింప బాలుడిట్లు పలికెను: ‘‘ఏల? భగవంతుడు నేనర్పించిన దానినంతయు నారగించినాడు.’’ అంతట వారందఱును దేవతార్చన మందిరమున బ్రవేశించి యుత్తవిగానున్న పళ్లెరములను గాంచి నిశే్చష్టులైరి.
నిజమైన విశ్వాసముయొక్కయు భగవత్పరితాపము యొక్కయు ప్రభావమిట్టిది!
కృష్ణుడు నీయన్న
1092. తీవ్ర పరితాపమొక్కటియే భగవద్దర్శనమునకు నిశ్చితమైన మార్గము. పసివాని నమ్మికను బోలు నమ్మిక యుండవలయును; తల్లిని జూచుటకై వానిని గలుగునట్టి తీవ్రకాంక్ష యుండవలయును.
జటిలుడను పిల్లవాడుండెను. అతడు బడికి బోవునప్పుడొంటరిగ నొకచిట్టడవిగుండా పోవలసి వచ్చెడిది. అతడు తఱచు భయపడు చుండెడివాడు. ఈ మాట తల్లితో జెప్పగాదల్లి యిట్లుపలికెను: నాయనా! భయమెందులకు? నీకు భీతికలిగినప్పుడెల్ల కృష్ణుని బిలువుము.’’ ‘‘కృష్ణుడెవరమ్మా!’’అని బాలుడడిగెను. ‘‘కృష్ణుడు నీయన్న’’అని తల్లి చెప్పినది. అటు తరువాత జటిలున కడవిలో భీతి కలిగినప్పుడాతడు, ‘‘అన్నా! కృష్ణా!’’అని యఱచినాడు. ఎవరును రాకపోవుటచే నింకను బిగ్గఱగా, ‘‘ఓయన్నా! కృష్ణా! నీవెక్కడనున్నావు? నాకు భయము వేయుచున్నది. నన్ను వచ్చి కాపాడుము’’అని యఱచెను. అంత నిష్కపటముగా మొఱవెట్టుచున్న యా బాలుని మొఱాలకింపకుండ- ఆతని వచ్చి రక్షింపకుండ- కృష్ణుడూరకుండగలడా?
- ఇంకాఉంది