సబ్ ఫీచర్

కృష్ణనామ స్మరణం.. పాపహరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణాష్టమి, జన్మాష్టమని గోకులాష్టమి శ్రావణ బహుళ అష్టమి ఇలా ఏ పేరుతో నైనా పిలవండి. నాడు కృష్ణుని పుట్టినరోజు. నందుని ఇంట పుణ్యాల పంట పండిన రోజు. దేవకీ దేవి నోముల ఫలాలు అందిన రోజు. అందుకే ఆ సౌభాగ్యాన్ని ఆ సంపదను మనింట నిండాలని ప్రతి శ్రావణ బహుళాష్టమి నాడు కృష్ణజననోత్సవాన్ని హిందువు లంతా పండుగలా చేసుకొంటారు.
బాలకృష్ణుడు అందరి ఇళ్ళల్లోకి తన స్నేహితులతో వెళ్లి తనకిష్టమైన పాలు, పెరుగు, వెన్న దొంగిలించేవాడు. తను తిని అందరికీ పెట్టేవాడు. ఆ కృష్ణపరమాత్మ తన స్నేహితులను నేలమీద ఒకరి వీపుపై ఒకరిని పడుకోబెట్టి అప్పుడు వెన్న, పెరుగు తినేవారని అంటారు. ఈ కృష్ణలీలను గుర్తుచేసుకుంటూ జరుపుకునే సంబరమే ఉట్టిలు కొట్టడం. నేడు చిన్ని చిన్ని పిల్లలకు కృష్ణ వేషం కట్టి ముద్దుగారే యశోద ముంగిట ముత్యమూ వీడు... దిద్దరాని మహీమల దేవకీ సుతుడు వీడు... అని వారి చేత పాటలు పాడిస్తారు. నృత్యాలు చేయస్తారు. వూయల్లో పడుకోబెట్టి వేడుక జరుపుతారు. ఉట్లు కొట్టిస్తారు. కృష్ణుడు ఆనాడు చేసిన చేతలన్నీ రసరమ్యంగా చెప్పుకుంటూ ఆనందిస్తారు.
మరికొందరు పరిశుద్ధ ప్రదేశమున మండపమును ఏర్పరచి, దానిపై కలశమును స్థాపించి, అందు దేవకీ వసుదేవులను, గోవులను, గోపికలను ఆవాహన చేస్తారు. యశోదమ్మకు సౌభాగ్యసొంఠిని నివేదిస్తారు. నందునికి శుభాకాంక్షలని పువ్వులు చల్లుతారు. శ్రీకృష్ణ ప్రతిమను లేదా పటాన్ని ఉంచి షోడశోపచారములతో భక్తిగా అర్చిస్తారు. నేలను అలికి, స్వస్తిక్ ఆకారపు ముగ్గువేసి, ఆ స్థలాన్ని బాగా అలంకరిస్తారు. పండ్లు, పిండి పదార్థాలు లడ్డూలు, మోదకములు, పాలతో వండిన పదార్థాలతో నెయ్యి, పాలు, తేనె, బెల్లంతో కూడిన నైవేద్యమును ‘ఓం శ్రీహరీ నీవు స్వీకరింతువుగాక’ అని నివేదిస్తారు. తరువాత పచ్చకర్పూరం, యాలకులు, లవంగాలు, జాజి, జాపత్రి మొదలైన సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలమును స్వామికి సమర్పిస్తారు. అనంతరం స్వామికి కర్పూర నీరాజనమును, నమస్కారమును సమర్పించి పూజకు ముగిస్తారు.
ఆత్మ - పరమాత్మల సమ్మేళనలోని అంతరార్థాన్ని తెలియచేసేందుకై రాసక్రీడ ఆడాడని బృందావన కృష్ణుడిని కేళిని స్మరించుకుంటారు. గోపికల్లోని శారీరక మోహావేశాన్ని, ఈర్ష్యాసూయల్ని గోపాలుడు నావాడే అన్న స్వార్థాన్ని, అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన పరతత్వంలో మమేకం కావడం అంటే ఏమిటో తెలియజేశాడని మనమూ అమానవత్వాన్ని వీడి మానవత్వం పదిలపరుచు కుని దివ్యత్వాన్ని పొందుదామని ప్రతినబూను తారు. కలియుగంలో కడతేర్చేది కేవలం కృష్ణనామ మేనని శుకదేవులు చెప్పారని, సర్వజీవు లలో చైతన్యస్వరూపుడై వెలిగే పరమాత్మనే కృష్ణస్వ రూపునిగా ద్వాపరంలో దర్శనం ఇచ్చాడని, దుష్టులను దునుమాడి ధర్మసంస్ధాపన చేశాపని, ఎక్కడెక్కడ అధర్మం అన్యాయం పెచ్చుమీరు తాయో అక్కడక్కడ తాను ఆవిర్భవించుతానని అర్జునుడి కర్తవ్యోన్ముఖుడిని చేసే నెపంతో చెప్పిన గీత లో చెప్పాడని, లీలావేషధారిగా జగత్తంతటికి ఆనందాన్ని పంచుతూనే జ్ఞానబోధ చేసిన జగద్గురువునీ, కష్టాన్ని చూసి బెంబేలు పడకుండా తన కర్తవ్యాన్ని తాను చేస్తే చాలు ఏ ఫలం ఎవరికి చెందాలో వారికి అందేలా చేస్తానని కూడా కృష్ణుడు స్వయంగా చెప్పాడని కృష్ణలీలలను స్మరించు కుంటారు ఇంకొందరు.

- గున్న కృష్ణమూర్తి