సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుట్టతుదకొక చెట్టుక్రింద బుఱ్ఱెయొకటి పడి యుండుట జూచి దానిని గైకొని భగవత్ప్రార్థన చేయుచు స్వాతివర్షముకోసము నిరీక్షించుకొనియుండెను. ఆకస్మికముగా జల్లు వచ్చి కొన్ని చినుకులు పైకి ద్రిప్పబడియున్న పుఱ్ఱెలో బడెను, అంతనాతడు, ‘‘ఇవిగో, స్వాతి వర్షపుజినుకులు, నరుని పుఱ్ఱెలోనే లభించినవి’’అని సంతసించి మనఃపూర్వకముగా భగవంతునిట్లు ప్రార్థించెను: ‘‘దేవా! అనుగ్రహించి తక్కినవి కూడ సమకూర్పుము.’’ కొంత సేపటికి సమీపముననే యొక కప్పయు దానిపై బడబోవుచున్న త్రాచుబామును వానికి గాన్పించినవి. క్షణములో ఆ కప్ప పుఱ్ఱెమీదికి దూకినది. త్రాచు దానిని వెంబడింప దాని విషము పుఱ్ఱెలో బడినది. ‘‘ఆహా! ఏమి రుూశ్వరకృప!’’యని యాతడానందపరవశుడై యిట్లు పలికెను: ‘‘తండ్రీ నీ కృపవలన నసాధ్య విషయములన్నియు సాధ్యములైనవి, నే నెఱుగుదును, ఇక నా పుత్త్రుని ప్రాణము దక్కును!’’
కాబట్టి భగవంతునియందు మీకు దృఢ విశ్వాసమును వానిని బొందవలయునను తీవ్ర వాంఛయునున్న పక్షమున వాని యనుగ్రహమువలన సమస్తము చేకూరగలవు.
గోపికలు: వ్యాసుడు
1090. ఆత్మసాక్షాత్కారము కావలయునన్న, సాధన లాచరించి తీరవలయును. కాని పూర్ణవిశ్వాసమున్న పక్షమున స్వల్ప సాధనయైనను జాలును. వ్యాస మహర్షి నదిని దాటబోవుచుండెను. అప్పుడే గోపికలను నచటికి వచ్చిరి. కాని రేవున నావ లేదు. ‘‘అయ్యో, ఇపుడేమి చేయుట!’’యని వారు తత్తఱిల్లి వ్యాసునడిగిరి. అందులకాతడు, ‘‘దిగులు పడకుడు, నేను మిమ్మేఱుదాటించెదను. కాని నాకు జాల ఆకలివేయుచున్నది. తినుటకేమైన బెట్టెదరా?’’యనెను. గోపికలు తమ యొద్ద పాలు, వెన్న, మీగడయునుండగా వ్యాసునకు సమర్పించిరి. అతడు వానినన్నిటిని క్షణములో భక్షించెను. అంతట గోపికలు, ‘‘ఏఱుదాటు మాటయే’’మని వేగిరపడిరి. వ్యాసమహర్షి నీటియొడ్డున నిలుచుండి, ‘‘ఓ యమునా! నేనీనాడేమియు దినియుండని పక్షమున మేమిందుండి నడచిపోవునటుల నీరు పాయలుచేసి మాకు ద్రోవనిత్తువుగాక’’యని ప్రార్థించెను. ఆయన నోటినుండి రుూ మాటలు వెలువడగనే నీరు రెండుపాయలై వారికి గట్టెదుట నదీగర్భముకాన్పించెను. గోపికలబ్బురపడిరి. ‘‘ఇప్పుడే మనముపెట్టిన వన్నియు దిని, ‘నేనేమియు నేడు తినని పక్షమున’అని రుూతడు పలుకుట యెంత విచిత్రము!’’అని భావింపసాగిరి. వ్యాసుడు స్వయముగా దానేమియు దినలేదనియు, తన హృదయాంతర్వర్తియగు పరమేశ్వరుడే సర్వము నారగించియున్నా డనియు దృఢవిశ్వాసము గల్గియున్నందులకిది నిదర్శనమని గోపికలు గ్రహింపరైరి.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది