సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారదుడటు లొనర్చి తిరిగి వచ్చినంతనే భగవానుడు, ‘‘నారదా! సరియేకాని, పురము చుట్టు నీవు నడచునప్పుడెన్ని మాఱులు నన్ను దలచుకొంటివి?’’అని ప్రశ్నించెను. ‘‘ఒక్కమాఱైనను దలపలేదు. నూనెతో సంచులవఱకు నిండియున్న రుూ గినె్న తొణకకుండ జూడవలసి వచ్చినప్పుడు మిమ్ము దలచుకొనుటెట్లు స్వామీ?’’యని వాడు నారదుడు. అంత భగవానుడిట్లు పలికెను: ‘‘ఈయొక్క నూనె గినె్నయే నీవు నన్ను బూర్తిగా మఱచునట్లు చేసి మనస్సును భగవద్విముఖము చేసివేసినదే! దుర్భరమైన సంసార భారమును వహించుచునుగూడ ప్రతి దినము రెండుసార్లు నన్ను స్మరించుచున్న యాసేద్యగాడెట్టివాడో చూడుము!’’
నారదుడు: ఇద్దఱు యోగులు
1088. భగవత్ సాక్షాత్కారము పొందవలయునని యిద్దఱు యోగులు తపస్సు చేయుచుండిరి. ఒకనాడు నారద మహర్షి వారి పర్ణశాల సమీపమునుండి పోవుచుండెను. ఆతనిగాంచి, యోగులలో నొకడు, ‘‘స్వామీ! తాము వైకుంఠమునుండియా వచ్చుచున్నారు?’’అని ప్రశ్నించెను. నారదుడు ‘‘ఔను’’అననాతడు, ‘‘ఐనచో భగవానుడేమి చేయుచున్నాడో సెలవియ్యరా?’’యనెను. ‘‘ఏనుగులను లొట్టిపిట్టలను సూది బెజ్జముగుండా దూర్చుచు క్రీడించుచుండగా జూచితిని’’అని నారదుడు సమాధానించెను. అది విని యాయోగి, ‘‘దానిలో ఆశ్చర్యపడవలసిన దేమియులేదు, భగవానునకసాధ్యమగు కార్యమేముండును?’’ అనెను. కాని రెండవ వాడిట్లు ప్రతిఘటించెను: ‘‘వెఱ్ఱిమాట! అది యసంభవము! మీరు వైకుంఠమునకు బోనేలేదని దీనివలన ఋజువగుచున్నది.’’
ఇందు మొదటివాడు భక్తుడు, పసివాని నమ్మికను బోలు నమ్మిక గలవాడు. భగవానున కసాధ్యమగునదేదియులేదు. వాని తత్త్వమును బూర్తిగా నెవరు గ్రహింపగలరు? వాని మహిమమునుగూర్చి యేమైనను బలుకవచ్చును.
దైవ సంఘటన
1089. ఒకప్పుడొకని కుమారునకు బ్రాణముమీదికి వచ్చినది; ఎవ్వరును వాని ప్రాణమును గాపాడగలుగునట్లు కాన్పింపకుండెను. ఆ సమయమున నొక సాధువువచ్చి యిట్లు పలికెను: ‘‘కుఱ్ఱవాడు బ్రతుకుట కొక్క యుపాయమున్నది. కొలది స్వాతివర్షపు జినుకులతో గలిసిన త్రాచుబాము విషమును, మనుష్యుని పుఱ్ఱెను సంపాదించగలిగిన పక్షమున మీ పిల్లవాని ప్రాణమును గాపాడవచ్చును.’’ ఆ పిల్లవాని తండ్రి పంచాంగము చూచి మఱునాడే స్వాతినక్షత్రము ఉచ్చస్థితియందుండునని తెలిసికొని భగవంతునిట్లు ప్రార్థించెను: ‘‘తండ్రీ! ఆపద్బాంధవా! ఈ పరిస్థితులన్నియు కలిసివచ్చునట్లను గ్రహింపుము, నా పుత్త్రుని ప్రాణమును రక్షింపుము’’. అఖండ పరితాపముతో, నిష్కపట చిత్తముతో, మఱునాటి సాయంతనమేయాతడు బయలుదేఱి శ్మశానములన్నిటను దిరిగి నరక పాలముకొఱకై వెదకసాగెను.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది