సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధకుడు: పురీషము
1086. ఒక మనుష్యుడొక సాధువును సమీపించి అఖండ వినయమును గనబఱచుచు నిట్లు పలికెను: ‘‘స్వామీ! నేనత్యల్పుడను. నేనెట్లు తరింపగలనో యానతీయవేడెదను.’’ సాధువు వాని హృదయమును గనిపట్టి యిట్లనియెను: ‘‘మంచిది, నీవుపోయి నీకంటె అల్పమైన దానిని (దేనినైనను) నాయొద్దకు దీనికొని రమ్ము.’’ ఆ మనుష్యుడు వెడలి తన కంటె నల్పమైన దానికొఱకు నలువైపులను వెదకెను, గాని వానికేదియు గాన్పింపలేదు. తుదకాతడు తన పురీషమును గని, ‘‘ఓహో! ఇదిగో, నాకంటె అల్పమైనదిదియే’’అని దానిని దీసికొనిపోవుటకై చేయు చాచునంతలో ఆ పురీషమునుండి యొక ధ్వని యిట్లు వినవచ్చెను: ‘‘ఓ పాపీ! నన్ను దాక బోకుము, మధురము, రుచ్యమునైన అపూపమైన నేను దేవతార్పణమునకు దగియుంటిని- చూచువారలకు గన్నుల పండువనై యుంటిని, కాని నాయభాగ్య దేవత నన్ను నీకడకు దెచ్చినది. నీ సంసర్గమునన్నీ హీన దశకు దెచ్చినది- నరులు నన్నుజూచి యసహ్యించుకొని గుడ్డతో ముక్కు గట్టిగామూసికొని పాఱిపోవుచున్నారు, ఇదియంతయు నీ సంపర్కమహిమ! నేను నీ సంసర్గమునకు వచ్చినది ఒక్కసారియే. అంతమాత్రముననే నా కర్మమిట్లు కాలినది. నీవు మఱల నన్ను తాకిన పక్షమున నాకింక నెట్టి ఘోరదుర్దశ రాబోవునోగదా!’’
ఈవిధముగా నాతడు నిజమైన నమ్రతను నేర్చెను- నేర్వవలసి వచ్చెను. దానితోనాతడు వినయవంతులకెల్ల వినయవంతుడై కాలక్రమమున ముక్తుడయ్యెను.
నారద గర్వభంగము
1087. నారదునొకప్పుడు తన్ను మించిన భక్తుడు లేడను గర్వమావేశించినది. అతని హృదయమును గ్రహించి భగవానుడిట్లనియెను: ‘‘నారదా! ఫలాని చోటికిబోయి చూడుము. అక్కడ గొప్ప భక్తుడొకడు గలడు. వాని పరిచయము సంపాదింపుము, ఏలన నాతడు నాయుత్తమ భక్తుడు.’’నారదుడచటకిపోయి యొక వ్యవసాయిని గనుగొనెను. ఆతడుదయముననే లేచి, ఒక్కసారి ‘హరీ’యని నాగలిని గైకొని పొలమునకుబోయి దినమంతయు నేల దున్నుచుండును. రాత్రి మఱల నొక్కసారి ‘హరీ’యని పరుండును. వానిని జూచి నారదుడిట్లు తలచెను: ‘‘ఈ మోటుమానిసి భక్తుడెట్లుకాగలడు? వీడు దినమంతయు విధివిరామములనునవి లేక లౌకిక విషయములలో నిమగ్నుడైయుండును. భక్తుని చిహ్నములెవ్వియు వీనియందు గానరావు. వీడా, యుత్తమ భక్తుడు!’’ అంత నారదుడు తిరిగి భగవానుని సమీపించి తాను చూచి వచ్చిన నూతన వ్యక్తియొక్క యావద్వృత్తాంతమును దెలిపెను. అంత భగవానుడిట్లు వచించెను: ‘‘నారదా! ఈ నూనె గినె్నను దీసికొని రుూ పురమును జుట్టిరమ్ము. ఒక్క చుక్కయైనను గినె్ననుండి నూనె తొణకరాదు సుమీ!’’ అని చెప్పాడు.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది