సబ్ ఫీచర్

డిజిటల్ విప్లవానికి జేజేలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేచింది. సాయుధ విప్లవాల కన్నా సాంకేతిక విప్లవాలు మానవాళిని ముందుకు తీసుకెళతాయని మరోసారి రుజువుకానున్నది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ భారతదేశ ప్రముఖ పారిశ్రామిక- వ్యాపార సంస్థ రిలయన్స్‌తో కలసి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో క్లౌడ్ డేటా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నది. తొలి ప్రయత్నంలో భాగంగా గుజరాత్, మహారాష్టల్ల్రో రెండు ‘అజ్యూర్’ క్లౌడ్ ప్లాట్‌ఫాం కేంద్రాలను స్థాపించనున్నారు. ఇవి సరికొత్త విప్లవానికి నాంది పలకనున్నాయి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త జవసత్వాలు అందనున్నాయి. నిజమైన ‘డిజిటల్ ఎకానమీ’ అనుభూతిని పౌరులు పొందనున్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు అవసరమైన సాంకేతికతను, ‘టూల్స్’ను ఆ కేంద్రాలు అందించనున్నాయి. దీంతో భారతదేశం ‘రూపాంతరం’ చెందగలదని భావిస్తున్నారు. వర్తమానంలో అంతటా అంకుర పరిశ్రమలు (స్టార్టప్స్) పురుడు పోసుకుంటున్నాయి. వాటికి క్లౌడ్ సేవల్లో కొన్ని ఉచితంగా అందించేందుకు ముందుకు రావడం ముదావహం. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, నైపుణ్య రంగాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఈ టెక్నాలజీ దారిచూపుతుంది. అన్నింటికన్నా కీలకాంశమేమిటంటే.. ఈ రంగాల్లోని స్టార్టప్స్‌లో రిలయన్స్-జియో పెట్టుబడులు పెట్టనున్నామని ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవల ముంబయిలో ప్రకటించడం. ఏ కోణం నుంచి చూసినా ఇది గొప్ప ముందడుగుగా భావించాలి.
మైక్రోసాఫ్ట్ సహకారంతో దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి క్లౌడ్ డేటా కేంద్రాలను ఏర్పాటు చేయడం సరికొత్త చరిత్రను సృష్టించడమే. భారతదేశ చిన్న-మధ్యతరహా వ్యాపారస్తులు ప్రయోజనం పొందేలా కనెక్టివిటీ, కంప్యూటింగ్, స్టోరేజి సొల్యూషన్స్ అందించనున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనం గల ఈ పథకం ప్రపంచంలోనే వినూత్నమైనదిగా భావిస్తున్నారు. దీనివల్ల భారతదేశ ఆర్థిక ముఖచిత్రం మారగలదని, జిడిపి పెరగగలదని, దేశం రూపాంతరం చెందుతుందని నిపుణుల భావన. రానున్న తరం టెక్నాలజీని ఇప్పుడే ప్రవేశపెట్టడం ఓ అద్భుతం.
రిలయన్స్ జియో- మైక్రోసాఫ్ట్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం సందర్భంగా సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ ఇచ్చిన వీడియో సందేశం ఉత్సాహపరిచేదిగా, గొప్ప భవిష్యత్‌ను కళ్ళముందు నిలిపేదిగా ఉండటం విశేషం. ప్రపంచ స్థాయి టెక్నాలజీని భారతదేశ పౌరుల చెంతకు చేర్చడం, వాటి ఫలితాలు అందుకునే అవకాశం కల్పించడం, అందులోనూ చౌకగా, కొందరికి ఉచితంగా అందించడం అపురూపమే.
ప్రపంచంతో పోటీపడి పయనించడానికి అవసరమైన వెన్నుదన్ను ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు రావడం, అత్యాధునిక అజ్యూర్ క్లౌడ్ ప్లాట్‌ఫాంను భారతీయుల ద్వారా ముందుకు తేవడం గొప్ప విప్లవం గాక ఏమవుతుంది?
ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్ చరిత్ర. అన్ని రంగాలలోకి డిజిటల్ టెక్నాలజీ చొచ్చుకుపోతున్నది. అందుకే డిజిటల్ ఎకానమీ అన్నమాట పుట్టుకొచ్చింది. ఆ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగమే ఈ క్లౌడ్ డేటా కేంద్రాలు. ఇవి స్టార్టప్‌లకు వరప్రదాయిని లాంటివి.
జియో ఫైబర్...
వ్యాపార- వాణిజ్యాలు, లావాదేవీల వ్యవహారాల్లోనే గాక ఈ టెక్నాలజీ విప్లవం ఇళ్ళలోకి చొచ్చుకొస్తోంది. టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ ఇకపై సరికొత్తగా పలకరించనున్నాయి. అదనపు హంగులతో ఆకర్షించబోతున్నాయి. అమెరికాలోనూ లేని వేగంతో డేటా బట్వాడా జరగబోతున్నది. ఇది ‘జియో ఫైబర్’ ద్వారా సాధ్యం కానున్నది. మూడు సంవత్సరాల క్రితం జియో కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించి 4జీని మారుమూల ప్రాంతాల ప్రజల చెంతకు తెచ్చి నిజమైన విప్లవాన్ని సృష్టించింది. ఆ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకిప్పుడు జియో ఫైబర్‌ను ప్రవేశపెడుతోంది. ఇరవై రోజుల్లో ప్రజల ముందుకు ఇది రాబోతోంది.
జియో ఫైబర్ కనెక్షన్ టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాల్ని అందించనున్నది. ఈ బ్రాడ్ బ్యాండ్ సేవలకోసం ఎందరో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఆ కల ఇప్పుడు నెరవేరబోతోంది. జియో ఫైబర్ సేవల కింద అందించనున్న సెట్ టాప్‌బాక్స్ (ఉచితం) ద్వారా టీవీ ‘స్మార్ట్’ అవతారం ఎత్తనున్నది. అంతర్జాతీయ వీడియో కాల్స్ చేసుకోవచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు. ఇట్లా ఒకటా రెండా సవాలక్ష సౌకర్యాలతో అలరారనున్నది. రెండు కోట్ల గృహాలకు ఈ సౌకర్యం అందించేందుకు జియో సిద్ధమైంది.
ఐఓటి...
వర్తమాన నాల్గవ పారిశ్రామిక యుగంలో ఇప్పుడు ప్రముఖంగా చెప్పుకుంటున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి)పై జియో దృష్టి సారించింది. దీని ద్వారా వంద పరికరాలను అనుసంధానించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికవసరమైన బ్రాడ్ బ్యాండ్ ఇప్పుడు జియో అందుబాటులో ఉంది. ఈ మాధ్యమం ద్వారా ఆదాయాలను పెంచుకునే యోచన చేస్తోంది. ఇందుకు అవసరమైన అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకుంటోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో సమగ్ర దీర్ఘకాల ఒప్పందం కుదుర్చుకున్నది.
రిలయన్స్ జియోలో ఇప్పటివరకు మూడున్నర లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు. అంత పెద్ద మొత్తంతో దేశంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి, కమ్యూనికేషన్స్ విప్లవానికి గొప్ప పునాదులు వేశారు. ప్రజలకు సాధికారత ‘‘రుచి’’ చూపించారు. వర్తమానంలో, ప్రజాస్వామ్య యుగంలో సాధికారత అత్యంత కీలకం. గతంలో ఇందుకోసం సాయుధ పోరాటాలకు శ్రీకారం చుట్టేవారు. వర్తమానంలో ఆ అవసరం లేదు. అలాంటి ఆలోచనలు అనర్థదాయకం, అజ్ఞానం అని తాజా సాంకేతిక విప్లవాలు చెప్పకనే చెబుతున్నాయి.
రిలయన్స్ కంపెనీలో మదుపు చేసిన వాటాదారులు, సాధారణ వ్యక్తులు డివిడెండ్లు దండిగా అందుకుంటున్నారు. అంతేగాక దేశ ఆర్థిక ప్రగతికి తమ వంతు కృషిచేస్తున్నామని గర్వపడుతున్నారు. నాయకత్వం, దార్శనికత, ధైర్యం, సాంకేతిక అవగాహన, నూతన ఆలోచనలు ఎంత అవసరమో వారు గుర్తించి ముకేశ్ అంబానీకి తమ మద్దతును ప్రతి వార్షిక సమావేశంలో కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాల మధ్య వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు రిలయన్స్ సంస్థ జమ్మూ-కశ్మీర్, లద్దాక్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి అక్కడి ప్రజల అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నదని ముకేశ్ అంబానీ ఇటీవల జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీ 42వ వార్షిక సాధారణ సమావేశంలో ప్రకటించినప్పుడు మదుపరులు, వాటాదారులు తమ మద్దతు తెలుపుతూ కరతాళ ధ్వనులు చేశారు. హర్షాన్ని వ్యక్తం చేశారు. వారందరూ ప్రజలే... టెక్నాలజీ ప్రేమికులే... దేశ భక్తులే... సాధికారత కోసం తహతహలాడేవారే... దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకునే వారే... డిజిటల్ టెక్నాలజీకి జై.. అంటున్న వారే... డిజిటల్ విప్లవానికి జేజేలు పలుకుతున్న వారే! సామాన్యుడి గుండె సవ్వడిని వినిపించిన వారే... వారందరూ మహానుభావులే కదా?...

-వుప్పల నరసింహం 99857 81799