సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదే విధమున భగవంతుని యొకానొక రూపమును మాత్రమే లేదా యొకానొక కళను మాత్రమే దర్శించినవారు (భగవంతుని స్వభావమును గూర్చి) తమలోదాము వాదులాడుకొనుచుందురు.
నూతిలోని కప్ప
1080. ఒక నూతిలో నొక కప్ప యుండెను. అది చాల కాలమందు వాసము చేసినది. అది దానిలోనె పుట్టి దానిలోనె పెరిగిన కప్ప. ఒకనాడు సముద్రములోనుండెడి మఱియొక కప్ప వచ్చి రుూ నూతిలో బడుట తటస్థించెను. నూతిలోని కప్ప క్రొత్తగా వచ్చిన దానిని చూచి, ‘‘నీ ఎక్కిడిదానవు?’’అని ప్రశ్నించెను. సముద్రపు గప్ప, ‘‘నేను సముద్రమున నుండుదానను’’ అని సమాధానించును. అంత నూతి కప్ప యిట్లడిగెను: ‘‘సముద్రమా! అది యెంత పెద్దది?’’ ‘‘అది చాల పెద్దది’’అని సముద్రపు గప్ప బదులుచెప్పెను. నూతి కప్ప కాళ్లు బాఱజాపి, ‘‘మీ సముద్రమింత పెద్దదిగానుండునా?’’యనెను. ‘‘అంతకంటె చాలపెద్దది’’అని సముద్రపు కప్ప ప్రత్యుత్తరించెను. అంత నూతికప్ప రుూవైపునుండి యావైపునకొక్క గంతువేసి, ‘‘ఈనా నూతి యంత పెద్దదా మీ సముద్రము!’’అనెను. ‘‘మిత్రమా! సముద్రమును నీ నూతితో ఎట్లుపోల్పగలవు?’’అని సముద్రపు గప్ప బదులుచెప్పెను. అంత నూతికప్ప యిట్లు నొక్కి వక్కాణించినది: ‘‘కాదు నా నూతికంటె నేదియు బెద్దదిగా నుండజాలదు- పెద్దదైయుండుట యెన్నటికిని బొసగదు! ఈ సముద్రపు గప్ప వట్టి ‘యబద్ధపుకోరు.’’ దీనిని తఱిమివేయవలయును.’’
సంకుచితాభిప్రాయములు గలవారి ధోరణి యిటులుండును; తమ చిన్న నూతిలో దాము కూర్చుండి ప్రపంచమంతయు దమనూతికంటె బెద్దదిగా నుండజాలదని తలపోయుచుందురు.
శ్రద్ధ్భాక్తులు: ఆత్మార్పణము
భక్తుడు: భగవంతుని రక్షణ
1081. ఒకప్పుడొకచాకలి యొక భక్తుని బట్టుకొని కొట్టుచుండ, నా భక్తుడు, ‘‘నారాయణ! నారాయణ!’’యని యఱచుచుండెను. శ్రీమన్నారాయణుడపుడు వైకుంఠమున లక్ష్మీదేవియొద్ద గూర్చుండి యుండెను. భక్తుని మొఱను వినినంతనే యాతడు తటాలున లేచి, వానిని రక్షించునిమిత్త మాతావునకు బోసాగెను. కాని నాలుగడుగులువేసి మఱల వచ్చి కూర్చుండెను. అది చూచి, లక్ష్మీదేవి, నారాయణుని, ‘‘ఇంత త్వరితముగా మఱలివచ్చుటకు కారణ’’మేమని యడిగెను. నారాయణుడిట్లు సమాధానించెను: ‘‘నేనచటికి బోవలసిన యగత్యము కనబడలేదు. కాబట్టి మఱలివచ్చినాను. వాడు (ఆ భక్తుడు) కూడ జాకలి వాడైనాడు, స్వయముగా రక్షించుకొన మొదలుపెట్టినాడు- తన్ను కొట్టుచున్నవానిని కలియబడి మఱల కొట్టుచున్నాడు. ఇక నేనెందుల కచటికి వెడలుట?

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి