సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంత నామూఢభక్తుడు సగము సంతోషమును సగమువెగటును బొందెను. ఆతడు తానర్పించు నైవేద్యములను శివరూపముననున్న వైపున నుంచెనుగాని విష్ణురూపమున నున్న వైపున నేమియు బెట్టడయ్యెను. తన యిష్టదైవతమగు శివునకు ధూపమునర్పించి యాదురభిమాని విష్ణువు దాని ననుభవించిపోవునేమోయని వాని ముక్కు పుటములను గట్టిగా నదిమిపట్టినాడు. అంతట శివుడిట్లుపలికెను: ‘‘ఓరీ; నీ దురభిమానము కాలిపోను; నేనే హరిహర రూపమునుదాల్చి సమస్త దైవతములు నొకే బ్రహ్మముయొక్క వివిధ రూపములని నీకు నచ్చజెప్పబూనితిని. కాని సద్బుద్ధివై నీవీ గుణపాఠమును గ్రహింపవైతివి. నీ దురభిమానమునకై నీవు ఫలమనుభవింపవలసినదే. చిరకాలమందులకై దుఃఖమను భవింతువుగాని లెమ్ము.’’ ఆ మూఢ భక్తుడనంతరమొక పల్లెటూరికిబోయి కాలముగడపు చుండెను. అచిర కాలముననే యాతడు ప్రబల విష్ణుద్వేషిగా పరిణమించెను. ఆతని మనోవైచిత్య్రమును గనిపట్టి ఆ యూరి పిల్లలాతడు కాన్పించినంతనే ‘‘విష్ణువు, విష్ణువు’’ అని కేకలు వేయుచు వానిని పీడింపసాగిరి. ఆతడు రెండు చెవులకును రెండు గంటలు కట్టుకొని, పిల్లలు, ‘‘విష్ణువు, విష్ణువు’’ అని యఱవనారంభించినంతనే తన కసహ్యమైన యా నామములు వినరాకుండ గంటలు గణగణ మ్రోగించుకొనుచుండెడివాడు! అది చూచి పిల్లలు వానిని మఱింత పీడింపసాగిరి. ఈవిధముగా వానికి ఘంటాకర్ణుడను పేరు ప్రసిద్ధమైనది.
గ్రుడ్డివాండ్రు: ఏనుగు
1079. నలుగురు గ్రుడ్డివాండ్రేనుగు రూపమెట్టిదో తెలిసికొనవలెనని బయలుదేఱిరి. ఒకడేనుగు కాలిని దడివి, ‘ఏనుగు స్తంభములవలె నుండును’అనుకొనెను. రెండవవాడు దాని తొండమును దాకి, ‘‘ఏనుగు పెద్దగదవలె నుండును’’అనుకొనెను. మూడవవాడు దాని పొట్టను దాకి, ‘‘ఏనుగు పెద్ద పీపా వలెనుండును’’అని యూహించెను. నాలుగవవాడు దాని చెవిని నిమిరి, ‘ఏనుగు పెద్ద చేటవలెనుండును’’ అని యెంచెను. తుదకేనుగు స్వరూపమును గూర్చి వారు తమలో తాము తీవ్రముగా వాదులాడనారంభించిరి. దారిని బోవువాడొకడు వారు వివాదపడుచుండుట చూచి, ‘‘దేనినిగూర్చి మీరు వివాదపడుచున్నారు?’’ అని యడిడెను. వారు తమ వృత్తాంతమునంతను దెలిపి మధ్యవర్తిగానుండి న్యాయము చెప్పుమనిరి. అంత నాతడిట్లుపలికెను: ‘‘మీలోనెవరును ఏనుగును జూడలేదు ఏనుగు స్తంభమువలెనుండదు, దాని కాళ్లు స్తంభమును బోలియుండు. అది చేటవలె నుండదు, దాని చెవులు చేటలవలె నుండును. అది గద రీతిగా నుండదు, దాని తొండము గదరీతిగా నుండును. కాళ్లు, చెవులు, కడుపుమొదలైన రుూ యవయవములన్నిటియొక్కయు కలయికయే యేనుగు. ఇవన్నియు గూడిన యాకారమే ఏనుగుయొక్క యాకారము.’’
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి