సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతి కధిష్ఠాన దేవత యింద్రుడు; కాబట్టి గోహత్యా పాతక మింద్రునిది కాని నాది కాదు.’’ స్వర్గమందలి యింద్రుడీ పలుకులను వినినాడు; విని యాతడొక వృద్ధ బ్రాహ్మణ వేషమును ధరించి తోట యజమానునియొద్దకు వచ్చి యిట్లు ప్రశ్నించెను: ‘‘అయ్యా, ఈ తోట యెవరిది?’’
బ్రాహ్మణుడు: నాది.
ఇంద్రుడు: ఇది యెంత చక్కని తోట! నేర్పరియైన తోటమాలిని మీరు సంపాదించి యుందురు; చూడుడు, మొక్కలనెంత సొగసుగా ఎంత నిపుణముగా నాటినాడో!
బ్రాహ్మణుడు: ఇదంతయు నా పనియేనండీ! చెట్లనన్నిటిని స్వయముగా బరీక్షించి, స్థల నిర్ణయము చేసి పాతించినాను.
ఇంద్రుడు: అలాగుననా అండి! చాల చక్కగా బాతించినారు. ఇచట నీ త్రోవ నెవరు వేయించినారు? ఇది యతి రమణీయముగా నిర్మింపబడియున్నది.
బ్రాహ్మణుడు: అంతయు స్వయముగా నేను జేసినదేనండి.
అంతట నింద్రుడు చేతులు జోడించుకొని యిట్లు విమర్శించి పలికెను: ‘‘ఈ పనులన్నియు ‘నావియే’యని, ఈ తోటయొక్క ఘనతయంతయు ‘నాదియే’యని- చెప్పుకొనుచున్నావు కదా. అవును జంపిన పాపము మాత్రమింద్రుని కంటగట్టుట చాల అన్యాయము సుమీ!’’
అహింస నవలంబించిన పాము
1076. ఒకచోట నొక పాము నివసించుచుండెను. ఎవరును ఆ వైపునకు బోవ సాహసించెడివారు కారు. ఏలన, కర్మము చాలక ఎవ్వరైనను నచటికి బోయినంతనే యది కఱచి చంపుచుండెడిది. ఒకనాడొక మహాత్ముడా త్రోవను బోవుచుండగా, పాము వానిని యథాప్రకారము తఱుముకొని పోయి కఱవజూచెను. కాని యది వానిని సమీపింపగనే తన భీకర స్వభావమును గోల్పోయి వాని సాధుత్వమునకు వశమైపోయినది. అప్పుడు దానిని జూచి యా మహనీయుడు, ‘‘మిత్రమా! నీవు నన్ను గఱవనెంతువా?’’ యనెను. పాము సిగ్గుపడి మిన్నకుండెను, అంత నాతడిట్లు బోధించెను: ‘‘సోదరా, నా మాట విను; ఇక నెవ్వరిని హింసింపకుము.’
పాము శిరమువంచి యందుల కొడంబడెను. ఆ మహనీయుడు వెడలిన పిమ్మట పాము తన కలుగును బ్రవేశించినది. అప్పటి నుండియు నది యెవ్వరిని హింసింపనొల్లక నిరపాయమైన జంతువై పావన జీవనము గడపు చుండెను. కొలది దినములైనంతనే చుట్టుపట్టుల వారెల్లరును పాము తన విషమును గోల్పోయినదనియు నిక దానివలన బ్రమాదము లేదనియు జెప్పుకొనసాగిరి. ఆ నమ్మకముతో జనులు దానిని సమీపించి పలు విధముల బీడింపసాగిరి. కొందఱు ఱాళ్లు రువ్విరి, కొందఱు నిర్దయులై తోకబట్టి రుూడ్చిరి- ఈ విధముగా దాని బాధలు చెప్పనలవి కాకుండెను.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది