సబ్ ఫీచర్

తెలివితేటలను కొలవగలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిప్రియ తమిళనాడుకు చెందిన బాలిక. వయస్సు పదకొండు సంవత్సరాలు. బ్రిటన్‌లో పుట్టి పెరిగింది. అయితే.. ఐక్యూలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి దిగ్గజ శాస్తవ్రేత్తల సరసన నిలిచిన బాలికగా గుర్తింపు పొంది.. పతాక శీర్షికలకు ఎక్కింది. చదువు, బహుభాషలు, నృత్యం, సంగీతం, పాటలు, ఆటలు.. ఇలా అనేక రంగాల్లో ఆమె అద్భుతంగా రాణిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత మేధో ప్రయోగశాలల్లో ఒకటైన బ్రిటీష్ మెన్సా నిర్వహించిన ‘కా టెల్-3బి’ పరీక్షకు హరిప్రియ హాజరైంది. అందులో పొందగలిగే అత్యధిక రేటింగ్ 162జ దాన్ని హరిప్రియ సాధించింది. అసలు ఇంతకూ ఐక్యూ అంటే ఏమిటి? మునుపు ఐన్‌స్టీన్ కూడా ఐక్యూ టెస్ట్‌కు హాజరయ్యారా? అని ఆరాతీస్తే..
ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్.. ఇది ఎవరైనా ఒక వ్యక్తి తెలివితేటల స్థాయిని చెప్పే కొలమానం. సమస్యలను విశే్లషించగల, పరిష్కరించగల సామర్థ్యానికి కొలమానం ఇది. ఐక్యూను నిర్థారించేందుకు కొన్ని రకాల పరీక్షలను చేస్తారు. మనదేశంలో ఐక్యూ టెస్ట్‌లకు అంత ప్రాముఖ్యత లేకపోయినా పాశ్చాత్య దేశాల్లో ఇవి సర్వసాధారణం. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాలో సాయుధ బలగాల నియామకంలో ఈ టెస్టులను భారీస్థాయిలో ఉపయోగించారు. ఆఫీసర్ స్థాయి పోస్టులకు అర్హులను ఈ టెస్టుల ద్వారా నిర్ణయించేవారు. మొదట్లో ఐక్యూ టెస్టు ఒక మనిషి మానసిక వయసును అదే మనిషి కాలక్రమానుసార వయసుతో విభజించి నిర్ణయించేవారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఐక్యూని గణించే పద్ధతి కూడా మారుతూ వచ్చింది. ప్రస్తుతం రకరకాల ఐక్యూ టెస్టులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే వెక్ల్సర్ టెస్టును ఎక్కువగా వాడతారు. అత్యధికంగా వాడుకలో ఉన్న వెక్ల్సర్ టెస్టు ప్రధానంగా ఒక మనిషి శబ్ద గ్రహణ శక్తి, జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి, జ్ఞాపకశక్తి, ప్రాసెసింగ్ స్పీడ్‌ను పరిగణలోకి తీసుకుంటుంది. స్టాన్ఫర్డ్-బినెట్ స్కేల్ అనే మరో ఐక్యూ టెస్ట్ కూడా ఉంది. ఈ టెస్ట్ కూడా దాదాపు వెక్ల్సర్ టెస్ట్ పరిగణనలోకి తీసుకునే అంశాలనే కొలిచినా.. దృశ్య ప్రాదేశిక ప్రాసెసింగ్ వంటి కొత్త అంశాలను కూడా దీని సాయంతో కొలుస్తారు. గణితంలో సామర్థ్యం, పదజాలంలో ప్రతిభను కొలిచే కొన్ని ప్రశ్నలతో ఈ టెస్టులు నిండి ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలను నిర్ణీతకాలంలో పూర్తిచేయాలి. ఐక్యూ టెస్టులు రకరకాల విధానాల్లో మనిషి వయసుకు అనుగుణంగా రూపొందిస్తారు. ఇన్ని రకాల ఐక్యూ పరీక్షా విధానాలున్నా.. పరిపూర్ణ ఫలితాలను ఇచ్చే టెస్ట్ అంటూ ఏదీ లేదు. బ్రిటన్‌లోని ‘మెన్స’ అనే సంస్థ ఐక్యూ టెస్టులు పెట్టి వాటిలో అత్యధికంగా స్కోర్ చేసిన వారందరినీ ఒకచోటకి చేరుస్తోంది. ఈ సంస్థ సభ్యత్వం కావాలంటే జనాభాలో ఐక్యూ అత్యధికంగా ఉన్న రెండు శాతంలో మనం కూడా ఉండాలి.
నిజమేనా?
ప్రస్తుతం ఐన్‌స్టీన్ పేరుపై ప్రచారం జరుగుతున్న 160 ఐక్యూ స్కోర్‌లో నిజమెంత అనే విషయం ఎవరికీ తెలీదు. ఐన్‌స్టీన్ ఐక్యూ టెస్టు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారం లేదు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి దిగ్గజాల ఐక్యూ స్కోరు సాధారణంగా అత్యధిక స్కోరుగా పరిగణిస్తారు. నిజంగానే ఐక్యూ టెస్టుల ద్వారా మనుషుల తెలివితేటలను కొలవగలమా? అనే ప్రశ్నకు ఇంతవరకూ సరైన సమాధానం లేదు. ఐక్యూ టెస్టుల ద్వారా మనుషుల తెలివితేటలను గణించడం అనే పద్ధతి చాలా వివాదాస్పదంగా మారిన తరుణం కూడా ఉంది. *