సబ్ ఫీచర్

నిజంగానే బతుకొక గారడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడో దూరాన కూచున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడీ చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు.. అంటూ ‘విధి’మీద దాశరథి -కలం
చేసుకున్నాడు. ఆ అక్షరాలను తడిమి చూస్తే -మనో నేత్రానికి మాత్రమే
కనిపించే మూగ జీవితాలు కొన్ని
స్పర్శకొస్తాయి. అందులో -వసంతమ్మ పేరూ ఉండే ఉంటుంది. కాకపోతే -ఆమె విధికే ధిక్కార స్వరాన్ని
వినిపించింది. గాత్రాన్ని సరిచేసుకుంది. జీవితాన్ని సరిదిద్దుకుంది. గతవారం ‘వెనె్నల’ అతిథిగా ఎన్నో జ్ఞాపకాలు గుర్తుచేసిన గాయని వసంత -ఈవారం మరికొన్నింటిని మనోఫలకంపైకి తెచ్చుకున్నారు.

‘సమస్యల సునామీ చుట్టుముట్టినా -్భయపడలేదు. అప్పటికి నాకు భయమనేదే స్పష్టంగా తెలీదు. యాదృచ్ఛికంగా నాన్న అప్పగించిన తమ్ముడు, చెల్లెళ్ల బాధ్యతల్ని నెరవేర్చడమే నా లక్ష్యం అనుకున్నా. నా సంకల్పం ఫలించి -వారంతా ప్రయోజకులై జీవితాల్లో స్థిరపడ్డారు. ఆ తరువాతే నాగురించి ఆలోచించటం మొదలెట్టాను’ అంటారు వసంత.
వాణిశ్రీ- నాగేశ్వరరావు కాంబోలో వచ్చిన ‘ఇద్దరమ్మాయిలు’ సినిమాకోసం ‘నా హృదయపు కోవెలలో’ పాటను బాలుతోకలిసి ట్రాక్ పాడారు వసంత. ఆ పాటను ఘంటసాల చేత పాడించాలన్నది దర్శక నిర్మాతల కోరిక. అప్పటికి మాస్టారి అనారోగ్యం కారణంగా రికార్డింగ్ వాయిదా పడుతూవచ్చింది. పట్టువదలని దర్శక నిర్మాతలు -మాస్టారిని వీల్‌చైర్‌లో రికార్డింగ్ థియేటర్‌కు తెచ్చారు. ట్రాక్ విన్న మాస్టారు, ‘‘ట్రాక్ బావుంది. బాలు గొంతునే ఉంచండి’ అన్నారు. దర్శక నిర్మాతలు ఒప్పుకోలేదు. చివరకు మాస్టారు ‘ఎందుకురా ప్రాణం తీస్తారు? బాలు గాత్రం బాగుంది. నా మాటవిని అదే ఉంచండి’ అని కమాండింగ్‌గా చెప్పగలిగిన పెద్ద మనసు అక్కడే కనిపించింది. అంతేకాదు, దొడ్డ మనసున్న మాస్టారి సంగీత దర్శకత్వంలో పాటలు పాడానన్న విషయం గుర్తుకొస్తే -నాలో ఒకింత గర్వం కూడా తొణికిసలాడుతుంది’ అంటారు వసంత. చిత్రమేమంటే -ఆ పాట పాడడానికి ఆరుసార్లు రికార్డింగ్ థియేటర్‌కు వెళ్లారట. ఆరుసార్లూ పారితోషికం ఇచ్చి పంపించారు. అలాంటి దర్శక నిర్మాతలకు ఎప్పటికీ కృతజ్ఞరాలినే అంటూ ఆనందపడతారు వసంత. ‘్భనుమతి సంగీత దర్శకత్వంలో -నవ్వవే నా చెలి- పాట పాడాను. అపుడు భానుమతి ‘‘అమ్మాయ్, నీ గొంత బాగుందే. మంచి వృద్ధిలోకి వస్తావు’ అని దీవించారు. ఏకాంత సమయంలో అలాంటి ఆశీర్వాదాలు మళ్లీ మళ్లీ నా చెవులకు వినిపిస్తూనే ఉంటాయి’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు వసంతమ్మ. అంతేకాదు, ఎన్నో వేల పాటలు ఆమె ఆశీర్వాదంతోనే పాడానని వినమ్రంగా చెప్పారు. ‘తాయ్ పిరందాళ్’ చిత్రంలో భానుమతితో కలిసి ఆలపించిన పాట తమిళంలో సూపర్‌హిట్.
**
ఇళయరాజా కెరీర్ ఆరంభంలో -పావలార్ ఆరెస్ట్రాలో పాటలు పాడేవారు. అందుకు ఫిమేల్ వాయిస్‌గా వసంతనే సంప్రదించేవారు. ఎక్కడ ఆర్కెస్ట్రా వున్నా అక్కడికెళ్లి పాడేదాన్ని. అలా ఇళయరాజా తొలినాళ్లలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు వసంత. తరువాత ఆయన గొప్ప సంగీత దర్శకుడయ్యాడు. కానీ -ఇళయరాజా నుంచి వసంతకు వచ్చింది ఒకే ఒక్క అవకాశం. ‘పుదియవార్పుగళ్’ చిత్రంలో ‘తంతన తంతన తననమ్ తాళవరుమ్ పుదురాగవరుమ్’ అనే పాట పాడారు. ఆ చిత్రాన్ని ‘వౌనరాగం’గా డబ్బింగ్ చేస్తే, తెలుగు గాయని అయిన వసంతకు అవకాశం ఇవ్వలేదు. ఆ బాధ మాత్రం ఆమె గొంతులో చిన్నగా తొణికింది. చాలామంది అభిమానులు మాత్రం.. ‘తమిళంలో మీరు పాడారుగా. తెలుగులో ఎందుకు పాడలేదు’ అని అడిగితే, -‘తెలుగులో పాడటం నాకు రాదు’ అంటూ హాస్య చమత్కారంతో బాధను నిగ్రహించుకున్న గొప్ప వ్యక్తి వసంత. తరువాత ‘ఎర్రగులాబీలు’ చిత్రానికిగాను శ్రీదేవికి హమ్మింగ్ చేయడానికి పిలిచారు ఇళయరాజా. రికార్డింగ్‌ను రెండు గంటల్లో పూర్తిచేసి, తన చెల్లెళ్ల బాధ్యతలు చూసుకోవడానికి వెళ్లాల్సిన పరిస్థితి వసంతది. రాత్రి 11 గంటల వరకూ కూర్చోబెట్టడంతో -చాలా వేదనకు గురయ్యారట. అయినా రీకార్డింగ్ పూర్తిచేసి వెళ్తూ -అవకాశాలు ఇవ్వకున్నా ఫరవాలేదు. ఇంత సమయాన్ని వెచ్చించలేను అంటూ ఇళయరాజాతో చెప్పడంతో, మళ్లీ అవకాశమే రాలేదు అంటూ నవ్వేస్తారామె. కానీ ‘ఇళయరాజా గొప్ప సంగీత విద్వాంసుడు. ఆ భగవంతుడు ఆయనకు అలాంటి వరమిచ్చాడు. దాదాపు వందమందికి పైగా కొత్త గాయనీ గాయకులను పరిచయం చేసిన మహానుభావుడు’ అంటూ ప్రశంసించారు వసంత.
మురిపించే మువ్వలు చిత్రానికి సంగీతం అందించిన ఎస్‌ఎం సుబ్బయ్య నాయుడు నేతృత్వంలో ‘తాయుమ్ సేయుమ్’ పాటకు మంచి ఆదరణ లభించింది. ఎస్ వరలక్ష్మి సుస్వరలక్ష్మిగా అందరికీ పరిచయమే. కానీ ఆమె తమిళంలో నటిచిన శివశక్తి- శివలీల చిత్రాన్ని తెలుగులో అనువదించారు. ఆ అనువాదంలో ఎస్ వరలక్ష్మికి తాను నేపథ్యగానం అందించడం ఓ మరచిపోలేని అనుభూతి అంటూ గుర్తు చేసుకున్నారామె. ‘పాడుకోవే శివలీల పాడుకోవే’ అనే పాట అప్పట్లో భక్తిచిత్రాలు చూసేవారికి కర్ణపేయంగా వినిపించింది. తమిళంలో విశ్వనాథన్ రామ్మూర్తి, శంకర్ గణేష్‌లాంటి సంగీత దర్శకుల పాటలు వసంతను గొప్ప గాయనిగా పరిచయం చేశాయి. ‘నేను పాడిన ప్రతి పాటను, హమ్మింగ్‌ను ఇష్టపడి పాడతాను’ అంటూ గర్వంగా చెబుతారామె. బిఎన్ రెడ్డి రూపొందించిన పూజాఫలం చిత్రంలో రాజశ్రీ నటించిన ‘వస్తావు పోతావు నా కోసము యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసము’ అనే పాట, హిందీ తార రేఖ బాలతారగా వున్నపుడు రంగులరాట్నంలో నటించిన పాట ‘పంకజ నయన పన్నగ శయన’ పాటలు వసంతను ప్రత్యేక గాయనిగా తీర్చిదిద్దాయి. ఓసారి కెవి మహదేవన్ వద్ద వసంత తనకు రావలసిన గుర్తింపు రాలేదని అంటే ఆయన ఈ విధంగా అన్నారట. ‘ఎందుకమ్మా అలా అంటావు. ఇన్ని పాటలు పాడావు కదా. నీకు రావలసిన గుర్తింపు ఎప్పుడో వచ్చినట్టే’ అంటూ అనునయించడం జీవితంలో మర్చిపోలేని విషయం. అంతేకాదు, నా జీవితానికో సార్థకత ఉందన్న విషయాన్ని ఆ ఆశీర్వాదం ఎప్పుడూ గుర్తు చేస్తుంటుంది అంటూ పొంగిపోతారామె. 1991, 93లలో అమెరికా తానా, ఆటా కార్యక్రమంలో పాల్గొని అనేక అవార్డులు, రివార్డులు తీసుకున్నారు.
ఓసారి ఓ రికార్డింగ్ కంపెనీకి కొన్ని మలయాళ పాటలు పాడే ప్రాజెక్టు వసంతకు లభించింది. పాటలన్నీ దాదాపు పది పదిహేను రోజుల్లో రికార్డు చేశారు. ఆ ప్రాజెక్టులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకిలతోపాటుగా చిత్ర కూడా ఉన్నారు. కానీ వసంత కోసమే ఈ ప్రాజెక్టులో పాటలు పాడామని, ఒక్క పైసా కూడా తాము తీసుకోమని వారు నలుగురు పెద్ద హృదయంతో అనడంతో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక లాభాలన్నీ తనకే వచ్చాయని, ఆ డబ్బులతోనే తాను తన పిల్లలను అమెరికా పంపించి బిట్స్ పిలానీలో చదివించుకున్నానని వసంత ఆనందంగా, గర్వంగా చెప్పుకుంటారు. ఈ సందర్భంగా ఇంత సహాయం చేసిన ఆ నలుగురికీ తానెప్పుడూ రుణపడి ఉంటానంటారామె. ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే, కేరళ ఫార్మేషన్ డే ఒక్కరోజే. కానీ ఏనాడూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనను ఏ కార్యక్రమానికీ పిలవలేదని నిరాశ వ్యక్తం చేశారు వసంత. కానీ, ఇప్పటికీ కేరళ ఫార్మేషన్ డేలో మలయాళీలు ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనే కార్యక్రమం నిర్వహించి, తన పాటలు ప్రత్యేకంగా పాడించుకుంటారని, అక్కడికెళ్లి పాటలు పాడటం తనకెంతో హాయి, ఆనందాన్నిస్తోందని అంటారామె. ‘ఇప్పటికీ నన్ను అమ్మలా ఆదరించే మలయాళీలు అన్నివిధాలా గౌరవించటం నేను చేసుకున్న అదృష్టమమో’ అంటారు వసంత. కానీ, తెలుగువాళ్లకి నేనెక్కడున్నానో తెలీకపోవడం ఎక్కడో బాధకలుగుతుందని భావగర్భితంగా అన్నారు.
ఢిల్లీ మలయాళ అసోసియేషన్ వారు బెస్ట్ సింగర్ అవార్డును ఇచ్చారని, అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డు అందించడం తన జీవితంలో మర్చిపోలేని విషయమంటారు వసంత. చెన్నై ఆలిండియా రేడియోలో గ్రేడ్ 1 ఆర్టిస్టుగా, గ్రేడ్ 2 మ్యూజిక్ కంపోజర్‌గానూ సంగీతం సేవ చేసుకున్నట్టు గుర్తు చేసుకున్నారు వసంత.
మద్రాస్ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, ‘ఉమ్మచ్చు’ (1971) అనే మలయాళ చిత్రానికి పాట పాడినందుకు ఉత్తమ గాయని అవార్డు, మలయాళం సినీ టెక్నీషియన్ అసోసియేషన్ నుండి, కమగర ఫౌండేషన్ నుండి లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా మద్రాస్ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ నుండి జి రామనాథన్ పేరిట అందించే వెటరన్ అవార్డు, కళాసుధ అసోసియేషన్ నుండి మహిళారత్న (2012)లో అవార్డు అందుకున్నారు. మలయాళంలో చివరిసారిగా ఘోషయాత్ర అనే చిత్రంలో పాట పాడారు. తెలుగులో జూ.ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం’ చిత్రంలో ఎస్‌ఎస్ తమన్ సంగీత దర్శకత్వంలో చివరిసారిగా పాడారు.
ఇనే్నళ్లుగా ఇన్ని పాటలు పాడినా తనకు ఇంకా పాడే శక్తిని దేవుడిచ్చాడని, పాడుతూనే ఉండాలన్న సంకల్పంతోనే ఉన్నానంటారు వసంత. ఇప్పటికొచ్చిన మంచి పేరుకు, దేవుడిచ్చిన తమ్ముడు, చెల్లెళ్ల బాధ్యత నెరవేరినందుకు ఎప్పటికీ ఎంతో సంతోషిస్తుంటాను. బహుశ మనిషి బతుక్కి సార్థకత అంటే ఇదేనేమో -అంటారు వసంత.

-సరయు శేఖర్, 9676247000