సబ్ ఫీచర్

పట్టు పదిలం ఇలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రావణమాసం వచ్చేసింది. పూజలతో పాటు పట్టుచీరల సందడి మొదలైంది. ఎన్ని రకాల ఫ్యాషన్లు వచ్చినా శుభకార్యాలు, పండుగలు అనగానే అందరికీ గుర్తొచ్చేది పట్టుచీరలే. మార్కండేయ మహర్షి కలువ పూల నారతో దేవతలకు వస్త్రాలు నేసి ఇచ్చారని చెబుతాయి పురాణాలు. అవి ఎలా ఉన్నాయో తెలీదు కానీ.. కంచిచీరలను చూసిపప్పుడు మాత్రం కంచి కామాక్షమ్మను చూసినంత దైవత్వం కనిపిస్తుంది. కంచి చీరలు బరువుగా ఉంటాయి. పల్లు, అంచులు రెండూ చీర ప్రధాన భాగం కన్నా భిన్నమైన రంగుల్లో ఉంటాయి. విడిగా నేసిన పల్లు, అంచుని చీర ప్రధాన భాగంలోకి నేర్పుగా ముడివేసే అల్లిక కంచి పట్టుచీరల ప్రత్యేకత. చీర పాతబడినా కూడా కళకళలాడే అంచును, చీరకొంగును విడదీయడం సాధ్యం కాదు. అంతలా చీరతో జరీని కలిపేస్తారు. జరీ కూడా అతి సన్నని వెండితీగను బంగారు ద్రవంలో ముంచిన జరీ తీగలు వాడి బంగారు జరీ చీరలను నేస్తుంటారు నేత కళాకారులు. మామిడి పిందెలు, నెమళ్లు, చిలుకలు, పూలు.. ఇలా అనేక ప్రకృతి అంశాలతో పాటు పలు రూపాలను చీర పైన చక్కగా అల్లుతారు. పట్టులో ఎక్కువగా మల్బరీ, ఎరి, టస్సర్, ముగా తదితర రకాలు ఉన్నాయి. కానీ మల్బరీ సిల్క్ వినియోగం ఎక్కువ. అందరూ దీనే్న ఇష్టపడతారు. ఈ చీరల డిమాండ్ ఎనే్నళ్ళ నుంచి వస్తోంది. కానీ నేడు అనేక నకిలీ పట్టుచీరలు వీటి జాబితాలోకి వచ్చిచేరాయి. అసలైన పట్టును గుర్తించాలంటే కాస్త ఇబ్బందే.. కానీ కష్టం కాదు. అసలైన పట్టును ఇలా గుర్తించవచ్చు.
* పట్టుదారాల్లో యానిమల్ ఫైబర్, ప్లాంట్ ఫైబర్, మ్యాన్‌మేడ్ ఫైబర్, మినరల్ (ఆస్‌బెస్టాస్) ఫైబర్ తదితర రకాలు ఉన్నాయి.
* యానిమల్ ప్లాంట్ దారాలను నేచురల్ ఫైబర్‌గా, మిగిలిన వాటిని సింథటిక్ ఫైబర్‌గా పరిగణిస్తారు.
* యానిమల్ ఫైబర్ జుట్టు, ఊలు మాదిరిగా ఉంటుంది. దీన్ని కాలిస్తే జుట్టు కాలిన వాసన వస్తుంది. గుండ్రంగా పూసలా మారి పౌడర్‌లా తయారవుతుంది. చీర చివర్లోని పోగులను కాల్చి ఈ పట్టును నిర్ధారించుకోవచ్చు.
* పాలిస్టర్, నైలాన్, రేయాన్‌ల దారమైతే త్వరగా కాలిపోతుంది. ఈ దారం కాలిపోయిన తరువాత పూసలా గట్టిగా తయారవుతుంది.
* మల్బరీలో రీల్ మల్బరీ, డూపియన్, స్పిన్, నాయిల్, మట్కా, త్రోస్టర్, ఫెసుదా తదితర రకాలుంటాయి. టస్సర్‌లో రీల్డ్ బస్సార్, కరియా, చిచా, జరీ తదితరాలుంటాయి.
* పట్టు వస్త్రాల తయారీలో వినియోగించే దారాలు, రంగులు, డిజైన్స్‌ను బట్టి ధరను నిర్ణయిస్తారు.
* పట్టు వస్త్రాలు మరీ ఎక్కువగా, మరీ తక్కువగా మెరిస్తే నిశితంగా పరిశీలించాలి. అసలైన పట్టు బంగారంలా మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఈ దుస్తులపై ఎలాంటి గీతలు పడవు.
శుభ్రం చేయడం ఇలా..
* పట్టువస్త్రాలు ఎక్కువగా నీటిని పీల్చుకుని వదిలే గుణాలను కలిగి ఉంటాయి.
* వీటిని ఎక్కువ సమయం నీటిలో ఉంచితే రంగు పోతుంది.
* పట్టుచీరలను ఉతకడానికి ఎప్పుడూ గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి.
* రంగు చీరలు అయితే అంచును నీళ్లతో తడిపి, చేతితో రుద్ది రంగు పోతుందో లేదో పరిశీలించాలి.
* అర బకెట్ నీళ్లలో పది చుక్కల నిమ్మకాయ రసం వేసి దానిలో చీరను ఉంచి వెంటనే ఉతకాలి.
* పట్టు వస్త్రాలను ఉతికిన తరువాత గట్టిగా పిండకుండా, మడవకుండా, అలాగే నీడలో ఆరేయాలి.
* కాస్త తేమగా ఉన్నప్పుడే ఇస్ర్తి చేస్తే వేడి ప్రభావం దుస్తులపై పడకుండా ఉంటుంది.
* పట్టుచీరల మడతలను ప్రతి మూడునెలలకు ఒకసారి అయినా మార్చాలి.
* బీరువాలో భద్రపరిచే సమయంలో కలరా గోళీలు కాకుండా గంధపు చెక్క ముక్కలు గుడ్డలో చుట్టి ఉంచాలి.
* అలాగే మిరియాలను ఒక వస్త్రంలో చుట్టి చీరల మధ్యలో ఉంచినా మంచిదే.. వీటి వల్ల తేమ చేరకుండా ఉంటుంది.