సబ్ ఫీచర్

అన్యోన్యంగా ఉంటే అలసట దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫీసులో విపరీతమైన పనిభారం. సాయంత్రానికి అలసి సొలసి ఇంటికి వస్తాం. ఇలాంటి సమయంలో ఆలుమగల అన్యోన్యత బాగుంటే సరాసరి. లేదంటే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో చుట్టుముడతాయి. తెల్లారితే మళ్లీ భుజాన బ్యాగు వేసుకుని బయలు దేరాల్సి వస్తుంది. ప్రతిరోజూ ఇలానే ఉంటే జీవితం నిరాశగా ఉంటూ బోర్ కొట్టేస్తుంది. అలాకాకుండా నిత్యం నూతనోత్సాహంతో ఉండాలంటే మీ అంతర్గత శక్తిసామర్థ్యాలను సరిగ్గా వినియోగించుకుంటే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. కనీసం ఆరునెలలపాటు క్రమం తప్పకుండా వీటిని పాటిస్తే.. ఇక ఆనందం సొంతమైనట్లే.. మరి ఆ చిట్కాలేంటో చూసేద్దామా..
* ఏదైనా సమస్య ఎదురవుతుందని భావించినప్పుడు దానికి రెండు పరిష్కారాలను కనుక్కోవాలి. వాటి పర్యవసానాలపై కూడా ఒక అంచనాకు రావాలి. ఏ మార్గం ద్వారా సమస్య సులువుగా పరిష్కారమవుతుందో దానినే ఆచరణలో పెట్టాలి.
* టీవీల్లో రకరకాల కార్యక్రమాలు వస్తూంటాయి. వాటిలో రాజకీయ చర్చా కార్యక్రమాలను చూడటానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. అందులో రాజకీయ విశే్లషకులు ఎదుటివారి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారో గమనించాలి. ఒకవేళ మీరు ఆ స్థానంలో ఉంటే ఏం చెబుతారో ఓ అంచనాకు రావాలి. దీనివల్ల మనకు ఎదురయ్యే సమస్యలను చాలా చాకచక్యంగా పరిష్కరించుకోవచ్చు.
* సాధారణంగా చాలామంది కొత్త విషయాలపై ఆసక్తి చూపిస్తారు. జీవితంలో నిస్సత్తువ ఆవహించినవారు ఇలాంటివాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. దీని నుంచి బయటపడేందుకు గాంధీజీ జీవిత చరిత్రను చదవాలి. నిజజీవితంలో ఆయన ఎలా వ్యవహరించేవారో సొంతంగా విశే్లషించాలి.
* మీ సమక్షంలో ఏదైనా అంశం చర్చకు వచ్చినప్పుడు ముందుగా ఎదుటివారు చెప్పేది సావధానంగా వినాలి. ఆ తర్వాతే మీమీ అభిప్రాయాలను బయటపెట్టాలి. అవతలివారు మీకంటే మంచి సలహా ఇచ్చినప్పుడు దానిని స్వీకరించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకాడకూడదు. దీనివల్ల ఇతరులకు మీపై సదాభిప్రాయం కలుగుతుంది. భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వారంతా మీకు అండగా ఉంటారు.
* * పనిని ఇష్టంగా, పట్టుదలతో చేసేందుకు ప్రయత్నించాలి. అప్పగించిన పనిని సమర్థంగా నిర్వర్తించాలి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని చేరుకునే క్రమంలో ఎదురైన అవాంతరాలను అంచనా వేయాలి. అంతేకాకుండా వాటిని అధిగమించడానికి అవలంబించాల్సిన పద్ధతులను కూడా పరిశీలించాలి.
* జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు మరపురాని తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. సందర్భాన్ని బట్టి కుటుంబ సభ్యులను, స్నేహితులను చిన్న చిన్న బహుమతులతో ఆశ్చర్యపరచండి. తద్వారా మీవారిలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఎంతో సహాయపడుతుంది. ఇతరుల్లో మీరు గమనించిన శక్తి సామర్థ్యాలను వారితో ప్రత్యక్షంగా చెప్పండి. ఇది మీపై సానుకూల దృక్పథాన్ని ఏర్పరిచేలా చేస్తుంది.
* మనకు నిత్యజీవితంలో ఎంతోమంది కనిపిస్తుంటారు. అందులో రకరకాల మనస్తత్వం కలవాళ్లు, కలిమి లేములతో ఉన్నవాళ్లు ఉంటారు. జీవితంలో అందరినీ కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న పరిస్థితి వర్ణనాతీతం. అలాంటివారిని ప్రేమతో పలకరించాలి. ఏదైనా అనాథ శరణాలయానికో, వృద్ధాశ్రమానికో వెళ్లి అక్కడివారితో కాసేపు ముచ్చటించాలి.
* ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిదానంగా ఆలోచించాలి. అది ఎంత సులభంగా తీసుకున్నదైనప్పటికీ పూర్తిగా ఆలోచించిన తర్వాతే కార్యాచరణ ప్రారంభించాలి. ఆ రోజు చేయాల్సిన పనులన్నింటినీ ఒక పేపర్‌పై రాసుకుని, ప్రతి గంటకు మనం ఏమేం చేయదలచుకున్నామో స్పష్టమైన అవగాహనకు రావాలి. మనం ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం పని పూర్తవుతోందా? లేదా? ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. కుటుంబ పరిస్థితులు, మీకు ఎదురయ్యే అనుభవాల ప్రకారం పైన చెప్పిన వాటిల్లో అవసరమైన వాటిని కనీసం ఆరు నెలలు క్రమం తప్పకుండా పాటించినట్లయితే మానసిక ఉల్లాసాన్ని తిరిగి పొందే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.