సబ్ ఫీచర్

ప్రభుత్వాల నైతిక సామాజిక బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత జనాభా 130 కోట్లకు చేరుకుంటున్న తరుణంలో నిస్సహాయులు నిర్భాగ్యులను బేషరతుగా అన్నివిధాల ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని భారత రాజ్యాంగంలో నాడే విస్పష్టంగా పేర్కొంది. భారత్ రాష్ట్రాల బాధ్యతను మరోసారి గుర్తుచేసింది. మొదటి దశగా ఈ సామాజిక బాధ్యతను చాలా రాష్ట్రాలు తుంగలోతొక్కి తాత్సారం చేశాయి. స్వాతంత్య్రం సిద్ధించిన 48 ఏళ్ళ తరువాత కేంద్ర ప్రభుత్వం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని (ఎస్‌ఎస్‌ఏపీ) ప్రారంభించింది. తొలుత 50 రూపాయలతో పింఛను పథకం ప్రారంభమైన పథకాన్ని ఆశ్రయించే అభాగ్యుల సంఖ్య వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం రెండువందల రూపాయలు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంత కలిపి నిరాశ్రయులకు అందజేసి, వారి కనీస అవసరాల్ని తీర్చాల్సిఉంది.
దేశ జనాభాలో దాదాపు 13 కోట్ల మంది అభాగ్యులున్నారు.
సమాజంలో ప్రస్తుతం 10కోట్ల మంది వృద్ధులు, 2.68 కోట్ల మంది దివ్యాంగులు, నాలుగు కోట్ల మేర వితంతువులు, ఆర్థిక వనరులు లేని ముప్పూటలు ఆకలిని తీర్చుకోలేని నిరుపేదలు లెక్కకుమిక్కిలిగా ఉన్నారు. దేశంలో విద్యాంగులు, అంగవైకల్యంతో కుటుంబీకులనుంచి ఆదరణ లోపించడంతోపాటు వారికి అవసరమైన వసతులు సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం అన్నింటికీ మించి ప్రభుత్వాలనుంచి అందక పోవడంతో కడుపేదలుగా బాధితులుగా మిగిలిపోతున్నారు.
ముందడుగులో ఉన్న తెలుగు రాష్ట్రాలు
తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో 1.06 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, దివ్యాంగులకు ఇతర పేద వర్గాల సుస్థిర భవితకు పట్టంకట్టేందుకు సముచిత నిర్ణయాలతో సకాలానికి సామాజిక పింఛన్లు అందజేయడంతో నిరాశ్రయులలో కొండంత నమ్మకం కుదిరింది. ప్రస్తుతం ఆ ముందు జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రజలతీర్పు ఆదుకొని అరమరికలులేకుండా పాలన చేస్తారని భావించిన ప్రజలు ఆయా పార్టీలకు పట్టంకట్టాయి. కేవలం సామాజిక పింఛనే్లకాకుండా ప్రజల హితానే్న పరమావధిగా భావించాలి.
గతంకంటే ఈ ఏడాది అటు తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోను వర్షాభావ పరిస్థితులతో కరువుకాటకాలు నెలకొన్నాయి. మెట్టపంటల సాగు ఉభయ రాష్ట్రాల్లో చేసుకొనే రైతుల సంఖ్య గణనీయంగానే ఉంది. అయితే అదునూ, పదునులలో వర్షంపడక, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో సామాన్య రైతులు కుంగుబాటుకులోనై దిక్కుతోచని స్థితిలో కుదేలవుతున్నారు. రైతు రుణమాఫీలు కేవలం వాగ్దానాలకు, ప్రకటనలకు పరిమితమై వంతులవారీగా విదిల్చిన రుణమాఫీలు సక్రమంగా అందక బినామీల ఖాతాలలో జొరబడి నికరంగా పంట నష్టపోయినవారు పరితపించడం మరో దుస్థితి. తెలంగాణాలో సీజన్లువారిగా ఆ ప్రభుత్వం సాగుపెట్టుబడి 4వేల రూపాయలు అందజేయడం ఆ రాష్ట్ర రైతాంగానికి భరోసానిచ్చే అంశమే. ఆంధ్రప్రదేశ్‌లో 4,5 విడతల రుణమాఫీ రైతులు ఇదివరకు కంట చూసింది లేదు. రుతుపవనాల రాక జాప్యంచేస్తూనే ఉన్నాయి. సాగుకోసం దుక్కులు దున్నించి కనాకష్టాలుపడి విత్తనాలు సేకరించి సిద్ధంచేసుకున్నా మేఘాలు కురవవు. తేమలేని భూములముందు మోకాళ్లపైన కొక్కిరి కూసుని దిగాలుపడుతున్న రైతుల చింతలు చెప్పనలవికావు. దేశానికి వెనె్నముకని వేదికలపైనా, ప్రకటనల్లో గొప్పలుపోయే ప్రభుత్వాలు రైతాంగ సమస్యలు వాటి నిర్మూలనకు రైతాంగ నిపుణులైన శాస్తవ్రేత్తలతో మేధావులతో ఒక సమగ్ర పరిశీలన కమిటీవేసి సమస్యల్ని శాశ్వత ప్రాతిపదికన నిర్మూలించే మార్గాల సమగ్ర నివేదికను కమిటీ సూచనల, సలహాలమేరకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడమే కాకుండా పక్కాగా అమలు జరిపే విధానంపై నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తే తప్ప జాతీయ ఆహార భద్రతకు భరోసా ఉండబోదు.
గ్రామ వాలంటీర్ల పథకం
నూతనంగా వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న గ్రామవాలంటీర్ల పథకం విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట కఠినతర వైఖరితోపాటు నిబంధనలపరంగా ఏలాంటి నిర్లిప్తత, ఉపేక్షలేని విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించే కటువుతనంతోపాటు, క్రమశిక్షణతో వ్యవహరించే కఠినవైఖరి, కరకుదనాన్ని తూ.చ తప్పకుండా పాటించాలి. నిర్దేశిత పథకం సమాజానికి, జన సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతుందనేది నిర్వివాదాంశం. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రికలైన నవరత్నాలు నవ నవోనే్వషంగా వర్ధిల్లి జన జాగృతికి నూతనోత్తేజాన్ని కల్పించే ఊతం కావాలని ఆశిద్దాం.

- దాసరి కృష్ణారెడ్డి 9885326493