సబ్ ఫీచర్

టిక్‌టాక్ ఒక వ్యసనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్‌ఫోన్ల యుగం నడుస్తోంది. ఫోన్ చేతిలో ఉంటే చాలు సెల్ఫీలు, డబ్ స్మాష్‌ల పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. స్మార్ల్‌ఫోన్ల పుణ్యమా అని సెల్ఫీ చిత్రాలు, వీడియోలు వంటి ఇతరత్రా పీచర్లకు బాగా అడిక్ట్ అయ్యారు. స్మార్ట్ఫోన్లను తదేకంగా వినియోగిస్తున్నారు. ప్రక్కనున్నవారిని కూడా పట్టించుకోకుండా యువత ఫోన్లకే అతుక్కుపోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో బాగా క్రేజున్న టిక్‌టాక్ పేరుతో కొత్త పిచ్చి యువతను, చిన్నారులను కట్టిపడేస్తోంది. టిక్ టాక్ యాప్‌కు బానిసలై పిచ్చి పిచ్చి వీడియోలతో పిల్లలు, యువత పెడదారిపడుతోంది.
కొద్దినెలలనుంచి టిక్ టాక్ ప్రభావం తీవ్రంగా పెరిగిపోయింది. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్ టాక్ ఇపుడు ప్రాణాలమీదికి తెస్తోంది. ఇటీవల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిమానేసి టిక్ టాక్ చేస్తున్న వీడియోలు, గుజరాత్‌లో ఓ కానిస్టేబుల్ ఏకంగా పోలీసు స్టేషన్‌లోనే టిక్ టాక్ చేయడం, గాంధీ ఆసుపత్రిలోని ఫిజియోథెరపీ విభాగంలోనూ, ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థులు ఆసుపత్రిలోనే టిక్ టాక్ వీడియోలు చేయడం, తాజాగా కరీంనగర్ వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగులు టిక్ టాక్ వీడియోలు చేసి అభాసుపాలవుతున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. టిక్ టాక్ చేయవద్దని భర్త మందలించినందుకు భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన, మేడ్చెల్ జిల్లాలో టిక్ టాక్ కోసం వీడియో తీస్తూ యువకుడు నీట మునగడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. టిక్ టాక్ వీడియోలకు అడిక్ట్ కావడంతో ఓ యువతి మానసిక స్థిమితం కోల్పోయింది. వయస్సుతో భేదం లేకుండా అంతా టిక్ టాక్ మాయలో పడిపోతున్నారు. టిక్ టాక్ ఒక వ్యసనంలా మారి జీవితాల్లో చిచ్చుపెడుతోంది. ఉద్యోగాలు ఊడగొడుతోంది. కెరీర్‌ను బుగ్గిపాలు చేస్తోంది. హత్యలకు, మరణాలకు కారణమవుతోంది. మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఇలా ఒక యాప్ తెలియకుండానే వ్యసనంలా మారి ఎంతోమంది జీవితాల్లో చిచ్చుపెడుతోంది. కాబట్టి స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని, కొత్త కొత్త యాప్‌లను వాడటం తగ్గిస్తే అంత మేలు.
తొలుత సరదాయే..
చిన్న చిన్న వీడియోలు రూపొందించి టిక్ టాక్ యాప్ ద్వారా చాలామంది ప్రచారం పొందుతున్నారు. గ్రామాల నుంచి నగరాల వరకు ఈ యాప్ చర్చనీయాంశమవుతోంది. పాటలు, నృత్యాలు, సినిమా డైలాగులు- ఇలా అనేక రకాలుగా వీడియోలు తీసి స్నేహితులతో పంచుకుంటున్నారు. తొలుత సరదాగా కాలక్షేపంకోసం చూసే ఈ వీడియోలు చివరికి వ్యసనంలా మార్చేస్తున్నాయి. లైక్‌లు, కామెంట్లకోసం చాలామంది రకరకాల వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తున్నారు. ఎక్కువ లైక్‌లకోసం అశీల్లంగా మాట్లాడటం, నృత్యాలు చేయడం చేస్తున్నారు. వివాహిత స్ర్తి పురుషులు ఇలాంటి వీడియోలు అప్‌లోడ్ చేయడంతో అవి వైరల్ అయి చివరికి భాగస్వామి వద్దకు చేరుతున్నాయి. దీంతో ఇంట్లో గొడవలు.. హత్యలు.. ఆత్మహత్యలుకు ప్రేరేపిస్తున్నాయి.
పాశ్చాత్య సంస్కృతితో..
చదువుకునే రోజుల్లో యువత నగరాల్లో ఉండాల్సి రావడంతో పాశ్చాత్య సంస్కృతి త్వరగా వంటబట్టేస్తోంది. ఆ తర్వాత ఉద్యోగంలో చేరి అయిదంకెల వేతనాలు సంపాదించే క్రమంలో కొత్తదనం కోరుకోవడం సహజంగా మారింది. పిల్లలపై నమ్మకంతో తల్లిదండ్రులు వారిని వసతి గృహాలు, అద్దె ఇళ్ళల్లో ఉండేందుకు అంగీకరిస్తున్నారు. పెద్దల నమ్మకాన్ని వమ్ముచేసే ధోరణి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత విద్య చదివే క్రమంలో పాశ్చాత్య సంస్కృతిని వంటబట్టించుకున్న యువతీ యువకులు వారి వారి హద్దుల్లోనే ఉంటున్నా కొందరు మాత్రం ఆ మోజులో పడిపోతున్నారు. అలాంటివారు భవిష్యత్తులో చిక్కులు కొనితెచ్చుకుంటున్నారని గ్రహించలేకపోతున్నారు.
రెండక్షరాల ప్రేమ తీయని అనుభూతిని కలిగించేది కావడంతో యువత ఆకర్షితులు కావడం సహజమే. ఒకరిని ఒకరు లోతుగా అర్థంచేసుకునే క్రమంలో కొందరు సహజీవనానికి అలవాటుపడుతున్నారు. ఇప్పుడంతా సెల్ఫీల కాలం కావడంతో ఏకాంత సమయాలను సరదాగానో, మధురజ్ఞాపకాల కోసమో వీడియోలు, చిత్రాలు తీసేస్తున్నారు. వాటిని చరవాణిలో భద్రపరచుకోవడం అబ్బాయిలకు అలవాటుగా మారుతోంది. ఇద్దరిమధ్య అభిప్రాయ భేదాలొచ్చినా, కుదరదని తేలినా విడిపోక తప్పని పరిస్థితి. ఈ పరిణామం అమ్మాయిలకు శాపంగా మారుతోంది. అమ్మాయిలు తమను దూరంగా పెట్టినా, నిర్లక్ష్యం చేసినా అబ్బాయిల అహం దెబ్బతిని బెదిరింపుల పర్వానికి తెరలేపుతున్నారు. లొంగకపోతే అప్పటివరకూ మధురజ్ఞాపకాలుగా దాచుకున్న చిత్రాలే బెదిరింపులకు గురిచేసే ఆయుధాలవుతున్నాయి. బాధితురాలికి అతడి వికృతరూపం పూర్తిగా అవతమవుతుంది. అపుడు ఇంకా దూరం జరిగేందుకు ప్రయత్నిస్తుండడంతో యువకులు రెచ్చిపోయి వీడియో, చిత్రాల్ని అంతర్జాలంలో అప్‌లోడ్ చేస్తున్నారు. చాలామంది అమ్మాయిల జీవితాలు నట్టేట మునుగుతున్నాయి.
వ్యక్తిత్వ వికాస లోపంతోనే..
సామాజిక మాధ్యమాలతో అధిక సమయం గడపడం అంటే వ్యక్తిత్వ వికాస లోపం (పర్సనాలిటీ డిజార్డర్)తో బాధపడుతున్నవారే. ఒంటరిగా కూర్చోవడం, ఏ పని చేయాలనిపించకపోవడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించకపోవడం- ఇలాంటి కారణాలతో సామాజిక మాధ్యమాలకు బానిసలవుతుంటారు. సరదాగా అలవాటుపడిన తర్వాత క్రమంగా బానిసలై లైక్‌లు, కామెంట్లు రాకపోతే తీవ్రమైన మనోవేదనకు గురవుతుంటారు. కుంగుబాటుకు గురవుతారు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు. ఏదో కోల్పోయిన బాధ వారిలో కన్పిస్తోంది.
సమాచారణ సేకరణ, మార్పిడికోసం సామాజిక మాధ్యమాలు వినియోగించుకుంటే తప్పులేదు. అదేపనిగా వీటిని వినియోగించడంవల్ల ఒక వ్యసనంగా మారుతోంది. ఒక సామాజిక మాధ్యమాన్ని ఆరేడు గంటలకన్నా ఎక్కువ వాడుతున్నట్లయితే అతను బానిస అయినట్లేనని నిపుణులు చెబుతున్నారు. దీనిని వాడుతున్నంతసేపు శరీరంలో డోపిమైన్ అనే ద్రవం విడుదలవుతుంది. ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతో ఒక్కసారిగా ఆనందం, ఉత్సాహం కల్గుతాయి. ఉద్యోగులు, విద్యార్థులు, యువతులు, గృహిణుల అదేపనిగా అందులో మునిగితేలుతుంటే మాత్రం.. వెంటనే బయటపడటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. లైక్‌లు, కామెంట్ల కోసం ప్రమాదాలను లెక్కచేయకుండా వీడియలు రూపొందిస్తున్నారు. ఎత్తుపైనుంచి దూకడం, రోడ్లపై వేగంగా వెళ్లడం, రైళ్లపైనుంచి దూకడం లేదంటే అడ్డంగా వెళ్లడం లాంటి ప్రమాదకరమైన వీడియోలు తీసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
కాగ్నెటివ్ బిహేవియర్ థెరపీ
పిల్లలనుండి పెద్దలవరకు రోజంతా ఎవరి పనులతో వారు బిజీబిజీగా గడుపుతుంటారు. కుటుంబ సభ్యులంతా రోజులో కొంత సమయం స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉంటూ ఆత్మీయ స్పర్శను పంచుకోవాలి. సామాజిక మాధ్యమాలకు బానిసలయినవారిని నెమ్మదిగా అందులో నుంచి బయటపడేయాలి. సైకాలజిస్ట్‌లను సంప్రదిస్తే అన్ని విధాలుగా వారిని పరిశీలించి కాగ్నటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) కౌన్సిలింగ్ ద్వారా ఈ వ్యసనం నుండి బయటపడవచ్చును.

- డా॥ అట్లశ్రీనివాస్‌రెడ్డి 97039 35321