సబ్ ఫీచర్

బలమైన శిరోజాల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిరోజాలు పట్టులా మెరిస్తే అందంగా కనిపిస్తాం. అయితే వాటి కుదుళ్లు కూడా బలంగా ఉండాలి. నల్లగా నిగనిగలాడే శిరోజాల కోసం వంటింట్లో చాలా పదార్థాలు అందుబాటులో ఉంటాయి. వాటితో కొన్ని చిట్కాలు..
* జుట్టు బలంగా, ఆరోగ్యంగా నాలుగు కాలాలపాటు ఉండాలంటే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. సాధారణ వెంట్రుకలు ఉండేవాళ్లు చేపలు, చికెన్, పప్పులు, మొలకలు బాగా తినాలి.
* బిరుసు వెంట్రుకలు ఉన్నవారు పచ్చికూరగాయలు, పప్పు ధాన్యాలు, దంపుడు బియ్యం, నట్స్, విటమిన్- ఇ కాప్యూల్స్ తీసుకోవాలి.
* జిడ్డు వెంట్రుకలు ఉన్నవారు ఆకుకూరలు, సలాడ్స్, తాజాపళ్లు, పెరుగు తినాలి.
* వెంట్రుకలు అందంగా ఉండాలంటే మనం వాడే షాంపూ విషయంలోనూ జాగ్రత్త పడాలి. పొడి జుట్టులోని ఆయిల్స్ పోకుండా మైల్డ్ షాంపూలను వాడాలి. పొడిజుట్టుకు ఎక్కువ షాంపూ వాడకూడదు. షాంపూ హెయిర్ కండిషనర్ కాదని గుర్తించాలి.
* వెంట్రుకలకు బెస్ట్ కండిషనర్ గుడ్డు. పచ్చసొనలోని పోషకాలు, ఫ్యాట్స్ బాగా ఉంటాయి. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. గుడ్డులోని తెల్లసొన వెంట్రుకల్లో ఉన్న జిడ్డును పోగొడుతుంది. పచ్చసొన పొడి జుట్టుకు, తెల్లసొన జిడ్డు వెంట్రుకలకు బాగా ఉపయోగపడతాయి.
* తల దురద పెడుతుంటే రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం, ఆలివ్ నూనె మిశ్రమంతో తలకు మసాజ్ చేసుకుని ఇరవై నిముషాల తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి.
*