సబ్ ఫీచర్

ఆదివాసీ బతుకుల్లో కొత్త వెలుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవిబిడ్డల ఆకాంక్షలకు అనుగుణంగా ‘బాక్సైట్ మైనింగ్ ఉత్తర్వు-97’ను రద్దు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించడం హర్షణీయం. బహుళ జాతి సంస్థలకు మేలు చేసేందుకు ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్‌కు గత ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బాక్సైట్ మైనింగ్ వల్ల అటవీ ప్రాంతం ధ్వంసమవుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళనలు చేస్తూ గిరిజనులకు అండగా నిలిచారు. తక్కువ బరువు, దృఢత్వం కలిగివుండే అల్యూమినియం విమానాలు, రాకెట్లు, బాంబులు వంటివి యుద్ధరంగానికి ఎంతో అవసరం. తూర్పు కనుమలలో నిక్షిప్తమై ఉన్న బాక్సైట్‌ను వెలికితీస్తే సహించేది లేదని సుమారు రెండు దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు.
తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో నివసించే ఆదివాసీలు చైతన్యవంతమైన సంఘటిత ఆందోళనలు నిర్వహించి తమ అస్తిత్వం కాపాడుకోవటం ఆషామాషీ కాదు. 1997 నుంచి ఎన్ని ప్రభుత్వాలు కొలువుతీరినా, బాక్సైట్ అంశంపై ఆదివాసీలు తీవ్ర ఆందోళనలు చేసే పరిస్థితులు తలెత్తుతూనే వున్నాయి. బాక్సైట్‌ను వెలికితీసే ప్రయత్నంలో ముఖ్యమంత్రులు గతంలో ప్రతిపక్షంలో వుండగా వ్యతిరేకత, అధికారంలో వుండగా అనుకూలత ప్రదర్శించటం ఆదివాసీలకు అనుభవంలోకి వచ్చిన అంశమే.
భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, అడవుల విధ్వంసం, భూగర్భంలోని ఖనిజాల వెలికితీత వంటి పర్యావరణ విఘాత చర్యలు శ్రుతి మించితే ఆదివాసీల జీవితాలలో అంతులేని సంక్షోభం సృష్టిస్తాయి. తరాల నుండి బతికే ప్రాంతాల నుండి తరలివెళ్ళే నిర్వాసితుల వేదన, కొంపాగోడు కోల్పోయి బతుకుకోసం వలసలువెళ్ళే సంక్షోభం, కాలుష్యం కోరలలో చిక్కుకొనే దుర్భర జీవనం, జల కాలుష్యం వంటి ఎన్నో ప్రత్యక్ష దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.
ఖనిజాలను వెలికితీసి, అడవులను ధ్వంసం చేస్తే ఆదిమతెగలు అంతరించే దుస్థితి తప్పదు. సహజ వనరులను కొల్లగొట్టకపోతే- కనీస వౌలిక సదుపాయాలు కల్పించగల అవకాశాలు ప్రభుత్వాలకు ఉండవు. బహుళజాతి కంపెనీలు ప్రభుత్వాలను ప్రలోభపెట్టి, పలురకాలుగా చేసే ఒత్తిడి అంతాయింతాకాదు. ఇలాంటి సామాజిక, రాజకీయ పరిణామాలలో ఆదివాసీలు అణచివేతకు గురికావలసి వస్తుంది.
విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి అటవీ పరివాహక ప్రాంతంలో సుమారు 3వేల ఎకరాల అటవీ భూములలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ 2015 నవంబరు 5న నాటి ప్రభుత్వం హడావుడిగా ఉత్తర్వులిచ్చింది. దీంతో సర్వత్రా ఉద్యమాలు ఊపందుకొని ప్రతిపక్ష పార్టీలు, ఆదివాసీ సంఘాలు, గిరిజన యువజన, ఉద్యోగ సంఘాల ఉద్ధృత ఆందోళన కారణంగా పది రోజులకే జీవో నంబరు 97ను ఉపసంహరించుకొంటున్నట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించి ఊపిరి పీల్చుకొంది. కాని జీవో రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీకాలేదు. ప్రైవేట్ కార్పొరేటు కంపెనీలు గిరిజన ప్రాంతాలలో గనుల తవ్వకాలు చేపట్టాలంటే భూబదలాయింపు చట్టం (1/70)లో మార్పులు అవసరమని ఆదివాసీ ఎమ్మెల్యేలతో కూడిన గిరిజన సలహామండలి తీర్మానించింది. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. అప్పటి రాష్ట్ర గవర్నర్ రంగరాజన్ సలహా మేరకు 2000 సెప్టెంబరులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదనలను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు.
1970లో ప్రభుత్వరంగ సంస్థ మెకాన్ విస్తృత అధ్యయన నిర్ధారణ ప్రప్రథమంగా బాక్సైట్ వెలికితీత అంశాన్ని వెలుగుచూసినా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా తవ్వకాల పట్ల అనుకూల, ప్రతికూల అభిప్రాయాలకు తలఒగ్గారు. అందువలన ఎప్పటికైనా తవ్వకాలు తప్పవనే అనుమానం పొంచి వుంది. ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వ ఖనిజాభివృద్ధిసంస్థ కూడా తెరపైకి వచ్చింది.
సుప్రీం తీర్పు...
బాక్సైట్ నిల్వలున్న ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలు పరిధిలోకి వస్తాయి. గిరిజన గ్రామ సభలనుంచి తవ్వకాలకు అనుమతి పొందాలని ‘పీసా’చట్టం నిర్దేశిస్తోంది. ఆదివాసీ శాసనసభ్యులతో ఏర్పాటైన గిరిజన సలహామండలితో ప్రభుత్వం సంప్రదించాలని అయిదవ షెడ్యూలు నిబంధనలు పేర్కొంటున్నాయి. 1997లో సుప్రీం కోర్టు యిచ్చిన ‘సమత’ తీర్పుప్రకారం షెడ్యూలు ప్రాంతంలో గిరిజన సహకార సంఘాలు, ప్రభుత్వరంగ సంస్థలే తప్ప కార్పొరేటు బడా కంపెనీలు ఖనిజాల తవ్వకాలు చేపట్టే వీలులేదు. అయిదో షెడ్యూల్ రాజ్యాంగ నియమాల ప్రకారం రాష్ట్ర గవర్నర్ గిరిజన ప్రాంతాల ఏకైక శాసనకర్త. రాష్ట్రం లేదా కేంద్రం చేసిన ఏ చట్టం అయినా గిరిజన ప్రాంతాలలో అమలుకాకుండా మినహాయిస్తూ తన విచక్షణాధికారంతో గవర్నర్ శాంతియుత సుపరిపాలనకు అనుగుణంగా ఏ సందర్భంలో అయినా నిర్ణయం తీసుకోవచ్చు. కాని ఈ విశిష్ట అధికారాలు మరుగునపడిపోతున్నాయి.
2004 నుంచి నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో కొనసాగిన బాక్సైట్ తవ్వకాల అనుమతుల ప్రక్రియ, గిరిజన ప్రాంతాలలో శాంతి భద్రతల సమస్యగా పరిణమించింది. మైనింగ్ లేదా సంబంధిత పరిశ్రమలను స్థాపించేటప్పుడు రాజ్యాంగంలోని గిరిజన హక్కులను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం, ఏ పార్టీ ఆధిపత్యమైనా గుర్తించక తప్పదు.
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి బాక్సైట్ మైనింగ్‌వ ల్ల రాష్ట్రానికి లభించే ఆదాయం కంటే, ఆదివాసీల బతుకులలో శాంతి, సుహృద్భావం నెలకొల్పాలని భావించారు. ఇక, మావోయిజం వైపు ఆదివాసీలు ఆకర్షితులు కాకుండా గత ముఖ్యమంత్రులు చేసింది అంతగా లేదు. ప్రభుత్వం పట్ల ఆదివాసీలకు విశ్వసనీయత కలిగేలా బాక్సింగ్ మైనింగ్ జీవోను రద్దు చేయడం సరైన చర్య అని పర్యావరణ నిపుణులు ప్రశంసిస్తున్నారు.

-జయసూర్య సెల్- 9440664610