సబ్ ఫీచర్

సృజనను గుర్తించండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృజనాత్మకత అనేది పుట్టుకతోనే అబ్బుతుందని చాలామంది భావిస్తారు. ఇది పూర్తిగా నిజం కాదు. పిల్లల్లో కొందరికి తెలివితేటలు ఎక్కువగా, కొందరికి తక్కువగా ఉన్నట్టుగానే కొందరిలో సృజనాత్మకశక్తి ఎక్కువగా, కొందరిలో తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్నంత మాత్రాన కొత్తగా ఆలోచించే తత్త్వం లేదని కాదు. సృజనాత్మకశక్తి అనేది పెద్దవాళ్ల ప్రోత్సాహంతో, ఆసరాతో పెంపొందే నైపుణ్యం. ఇలా ప్రోత్సహించడం వల్ల వారిలో ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది. సృజనాత్మకత కేవలం లలిత కళలకే పరిమితమయ్యే అంశం కాదు. సమయానికి అనుగుణంగా నడుచుకునేలా.. సవాళ్లను, సమస్యలను పరిష్కరించేలా మనిషిని తీర్చిదిద్దే సాధనం కూడా. అందుకే పిల్లలకు సమయానికి అనుగుణంగా నడుచుకునేలా, సవాళ్లను, సమస్యలను పరిష్కరించేలా తీర్చిదిద్దాలి. నిజానికి మనం పిల్లలకు సృజనాత్మకత ఇవ్వలేకపోవచ్చు. కానీ పిల్లల్లో సృజనాత్మక దృష్టితో చూసే గుణాన్ని మాత్రం కచ్చితంగా పెంపొందించవచ్చు. కాకపోతే అందుకు తగిన అవకాశాలను కల్పించాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల ఏకాగ్రత, ఆశావహ దృక్పథం, పోటీతత్త్వం వంటివి మెరుగవుతాయి. మరి పిల్లల్లో సృజనాత్మకత పెంపొందాలంటే ఏం చేయాలో చూద్దాం..
* వినూత్నంగా, కొత్తగా ఆలోచించే పిల్లలు ఇతరుల కన్నా కాస్త భిన్నంగా కనిపిస్తుంటారు. వారు తమదైన శైలిలో పనులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
* పిల్లలు సృజనాత్మకతతో ఏదైనా పని చేసుకునేటప్పుడు కసురుకోవడం, తప్పు పట్టడం మంచిది కాదు. దీంతో పిల్లలు చిన్నబుచ్చుకుంటారు. తాము చేస్తున్నది తప్పేమో అనే అయోమయంలో మళ్లీ సృజనాత్మకత జోలికి వెళ్లకుండా అయోమయంలో పడిపోతుంటారు. అందువల్ల పిల్లలకు తమ కళ్లతో లోకాన్ని చూసే అవకాశాన్ని కల్పించాలి. సొంతంగా ఆలోచించుకునే వెసులుబాటు ఇవ్వాలి.
* పెద్దల అభిప్రాయాలను, దృక్పథాలను పిల్లలపై రుద్దటం సమంజసం కాదు. చిన్నారులకూ ఒక వ్యక్తిత్వముంటుంది. అది వయసుతో పాటు బలపడుతూ వస్తుంది. దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెద్దవాళ్లు అండగా నిలబడాలి. ఇది భిన్నంగా ఆలోచించే నైపుణ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుంది.
* పిల్లలకు కొత్తవాటిని మొదలుపెట్టిన కొద్దిరోజులకే మొహం మొత్తుతుంది. త్వరగా విసుగు తెచ్చేసుకుంటారు. అప్పటి వరకు ఆడుకున్న పిల్లలు వెంటనే బొమ్మలు వేయాలనుకుంటారు. కాసేపటికి అది కూడా బోర్ కొడుతుంది. నిజానికి పిల్లలు ఇలా చేయడం కూడా మంచిదే. ఇది కొత్త కొత్త విషయాల గురించి ఆలోచించేలా మనసును పురికొల్పుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలతో మమేకమయ్యేలా చేస్తుంది. తమ లోపల ఉన్న ప్రపంచాన్ని, బయట ఉన్న ప్రపంచాన్ని తరచి చూడటానికి పిల్లలకు కొంత ఖాళీ సమయమూ అవసరమేనని తల్లిదండ్రులు గుర్తించాలి. ఇది సృజనాత్మకతను పెంపొందడానికి తోడ్పడుతుంది.
* పిల్లలు బొమ్మలు గీసినప్పుడో, ఏదైనా ప్రాజెక్టు చేసినప్పుడో అవి ఎలా ఉన్నాయో చెప్పమని తల్లిదండ్రులను అడుగుతుంటారు. ఇలాంటప్పుడు పిల్లలను నిరాశ పరచడం తగదు. మొత్తం పూర్తయ్యాక చెబుతాలే అని కసురుకోకూడదు. ఆ బొమ్మలను చూసి పిల్లలు ఆయా పనుల్లో ఎంతగా నిమగ్నమయ్యారో, అవి వారికెంత సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయో గమనించాలి. ఇలాంటి గుణాలే పిల్లలను కొత్త విషయాలపై ఆకర్షణకు గురయ్యేలా చేస్తాయి.
* పిల్లల్లో సృజనాత్మకత పెంచడానికి రకరకాల ప్రయోగాలకు పిల్లలను ఉత్సాహపరిచినప్పటికీ.. వాటిని రోజూ ఒకే సమయంలో చేసేలా చూసుకోవాలి. ఇందుకోసం పిల్లలకు ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించాలి. దీంతో ఆటలు ఆడుకోవడం, బొమ్మలు వేయడం, ప్రాజెక్టులు చేయడం వంటి పనులు చేసుకుంటూ, పూర్తయ్యాక ఆ వస్తువులు ఒకే దగ్గర ఉంచుకోవచ్చు.