సబ్ ఫీచర్

పాండిచ్చేరి ఆశాకిరణం కిరణ్ బేడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాండిచ్చేరికి కిరణ్‌బేడీ లెఫ్టినెన్స్ గవర్నర్‌గా 2016లో నియమితులయ్యారు. అంతకుముందు ఢిల్లీ రాజకీయాలలో ప్రయత్నించి విఫలమైన బేడీ, మోదీ సూచన మేరకు పాండిచ్చేరి వెళ్ళడం, పనిమంతురాలిగా, ప్రజల గవర్నర్‌గా రాణిస్తుండడం చెప్పుకోవాల్సిన విషయం. సుపరిపాలన విషయమై ఏనాడూ కథనాలు రాసే అలవాటు లేని మీడియా రాజకీయాల రొచ్చుతోనే రసాస్వాదన చేస్తుంటుంది. 2014 ముందు మోదీలా ఆమె ‘టి’ లేకుండా పని మొదలెట్టదు. టిఇఎలో టి అంటే ట్రస్ట్ (నమ్మకం), ఇ అంటే ఎమ్‌పవర్‌మెంట్ (సాధికారత), ఎఅంటే ఎకౌంటబిలిటీ (జవాబుదారీతనం). వీధుల్లో చెత్తను, కాలువల్లో చెత్తను శుభ్రంచేసే పనినుంచి ఆరోగ్య కార్యకర్తలతో, పనివారలతో మమేకమై బస్సు స్టాపుల పరిస్థితిని మార్చడం, ఆక్రమణలు చేసే షాపులను మూయించడం- యిలా అనేక పనులు ఆమె రోజువారీ చక్కబెడుతుంటుంది. నేరప్రవృత్తి తగ్గింది. గూండాయిజం, రౌడీయిజం తగ్గుముఖం పట్టాయి. మామూళ్ళు, దందాలు తగ్గాయి. పోలీసు శాఖ చాలా అప్రమత్తమైంది. రాజకీయ నాయకులంతా ఆమె దృష్టిలో బందీలయ్యారు. వారి మాటలు చెల్లుబాటు కావడంలేదు. బాలన్ లాంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆమెతో స్వచ్ఛ్భారత్ విషయమై గొడవ పడ్డారు కూడా. కిరణ్‌బేడీ ఆమె పట్టు విడువలేదు. కేంద్రానికి జరుగుతున్న వాస్తవాలు నివేదిక పంపుతానని చెప్పింది. పిల్లలతో ఆమె ఫుట్‌బాల్ ఆడుతుంది. వాళ్ళకి ఆటలో మెళకువలు నేర్పుతుంది. ప్రతివారం ఆమె 40 మంది ప్రజలను కలుసుకుంటుంది.
రాజ్‌నివాస్‌లో ముందు వచ్చేవారు 40 మందిని ఇందుకు అనుమతిస్తారు. పాఠశాల అడ్మిషన్లు, భూతగాదాలు వంటి సమస్యలెన్నో ప్రజలు ఆమె ముందు ప్రస్తావిస్తారు. ఓ మంచి పాలనాధికారిగా ఆమె తనకు తాను రుజువు చేసుకోవాలనుకున్నారు. కేవలం పెయింటింగ్ ప్రదర్శనశాల ప్రారంభానికి, ఎన్‌సిసి ప్రదర్శనల ఆతిథ్యానికి ఆమె పరిమితం కాదల్చుకోలేదు. సామాజిక మాథ్యమాలను ఆమె సమర్థవంతంగా వాడుకుంటారు. ఒక స్లమ్ ఏరియాలో పిల్లల పార్కు సిద్ధమవ్వడాన్ని పబ్లిక్ వర్క్ డిపార్టుమెంటు అక్కడ స్వచ్ఛ్భారత్ చేయడాన్ని ఆమె సామాజిక మాథ్యమాల్లో ఉటంకిస్తారు. అంతేకాదు సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా పాండిచ్చేరిలో స్వచ్ఛ్భారత్ కోసం రమ్మని ఆహ్వానిస్తారు. అందరినీ కలిపే కళ ఆమె సొంతం. అవినీతిపై ఫిర్యాదులకు 131కు కాల్ చేయమని ఆమె ట్విట్టర్‌లో ప్రజలకు పిలుపునిస్తారు. బేడీకి 71 లక్షల మంది ట్విట్టర్ అనుచరులుంటే, సి.ఎం నారాయణస్వామికి 200 మంది కూడా లేరు. అంతర్జాతీయ యోగ దినోత్సవం నాడు నారాయణస్వామి కనబడరు. బేడీ అందరికంటే ముందుగా హాజరవుతారు. బేడీ సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని నారాయణస్వామి వర్రీ అయిపోతుంటాడు. ప్రభుత్వానికి చెందిన 39 పథకాలకు బేడీ మోకాలడ్డుతోందంటారు.
కిరణ్‌బేడీ ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్, సామాజిక కార్యకర్త, ఓ రోల్ మోడల్ అయిన మహిళ. సావిత్రీ బాయి పులే, శారదామాత, ఐశ్వర్యారాయ్, ఇందిరాగాంధీ, కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్, మేరీకోమ్ లాంటి మహిళల వ్యక్తిత్వాలను మరచిపోలేం. కిరణ్‌బేడీ ఇండియన్ పోలీస్ సర్వీసులో చేరిన మొదటి మహిళా ఆఫీసర్. 9 జూన్ 1949 పంజాబ్‌లోని అమృత్‌సర్ ప్రకాశ్‌లాల్ పెషావరియా, ప్రేమలత దంపతులకు పుట్టిన కిరణ్‌బేడీ తల్లిదండ్రుల ప్రోత్సాహంమేరకు చదువుల్లో, క్రీడల్లో బాగా రాణించింది. 1972లో బ్రిజ్‌తో ఆమె వివాహమయింది. ఆయన గొప్ప టెన్నిస్ ఆటగాడు, టెక్స్‌టైల్ ఇంజనీరు. 2016లో ఆయన చనిపోయారు. 1973 సామాజిక శాస్త్రంలో ఐఐటి ఢిల్లీ నుంచి ఆమె డాక్టరేటు పుచ్చుకున్నారు. ఆమె కూడా గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి. 1972లో ఆమె పోలీసు శిక్షణ ప్రారంభించింది. మొదటి ఐ.పి.ఎస్. ఆఫీసర్ అయింది. ఆడపిల్లలకు ఆదర్శప్రాయురాలైంది. 9వ ఏసియన్ గేమ్స్‌లో ఢిల్లీలో మొత్తం ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత స్వీకరించింది. 2007లో ఆమె నవజ్యోతి ఢిల్లీ ఫౌండేషన్ ప్రారంభించింది. సుమారు 25,000మందిని మాదకద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తం చేసింది. మహిళల సమాన హక్కుల కోసం ఆమె ఉద్యమించింది. వీధి బాలలు, ఉపేక్షిత బస్తీ పిల్లల కోసం 200 ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, కౌన్సిలింగ్ కేంద్రాలు ప్రారంభించింది. 35 ఏళ్ళపాటు ఆమె ఐ.పి.ఎస్. ఆఫీసర్‌గా సేవలందించిన తరువాత సామాజిక రాజకీయ క్షేత్రంలోకి ప్రవేశించింది. బహిరంగ మల విసర్జనలేదని రుజువుచేస్తే తప్ప బీద కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీ చేయవద్దని ఆమె హుకుం జారీచేశారు. ఉద్దేశం మంచిదే! కాని ప్రతిపక్షాలు రాజకీయం చేశారు.
ఐక్యరాజ్యసమితిలో ఆమె కొనే్నళ్ళు భారత శాంతిదళంలో పనిచేసింది. ఆసియాలోనే మొద టి మహిళా మెగసెసే అవార్డు గ్రహీత ఆమె. తీహార్ జైలులో ఖైదీలలో సంస్కారం తెచ్చేందుకు ప్రయత్నించింది. చండీగఢ్‌లో ఆమె పోలీసు శాఖలో నియామకం అయిన రోజుల్లో విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆడపిల్లలను ఏడిపించడాన్ని కట్టడి చేసింది. 1988లో న్యాయవాదులపై జరిగిన లాఠీఛార్జిని వాధ్వా కమిషన్ తప్పు పట్టలేకపోయింది. ఆమె మనసుకు నచ్చిందే ఆవిడ చేస్తుందని అపవాదు వుంది. ఎవరి మాటా ఆవిడ వినదని అంటుంటారు. కాని ఆమె పదవిని వాడడం, పదవిని తప్పుడు పనులకు వాడడం మధ్య వివేకం పాటించేవారు. ఆ వివేకంతో అపుడపుడూ వివాదాల్లోకి, సంఘర్షణల్లోకి లాగబడేవారు. అనేక చిన్న చిన్న విషయాల్లో కూడా కిరణ్ బేడీ ప్రజలతో కలిసిపోయి క్రమశిక్షణను అమలుచేయాలని తపించడం ఆశ్చర్యం కల్గిస్తుంది. ఒక్కరోజు ఆమె ట్రాఫిక్ పోలీస్ కలిసి ప్రయాణికులు హెల్మెట్ ధరించకపోయినా, ఇద్దరికంటే ఎక్కువ టూవీలర్‌లో ప్రయాణిస్తున్నా ఆపేసి ప్రజలను ప్రశ్నిస్తారు. ఓ రోజు రాత్రి ఆవిడ టూవీలర్‌మీద ముసుగు కప్పుకుని ఒక మహిళ వెనుక కూర్చుని రాత్రిపూట పాండిచ్చేరి వీధుల్లో ప్రశాంతత ఎలా వుందో చూడడానికి బయలుదేరింది. మెడికల్ సీట్ల పంపిణీలో ప్రభుత్వం లాభాలు చూసుకోవడాన్ని బేడీ అడ్డుకుంది. గవర్నర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌కు గల తేడాను గుర్తించాలి అంటుంది బేడీ. ఆర్థిక వ్యవహారాలు, పాలనా వ్యవహారాలు, పాలసీ వ్యవహారాలు లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలంటుంది బేడీ. వివిధ విభాగాల మధ్య అనుసంధానాన్ని సాధించగలిగారామె. ఇండియా టుడే ఎన్‌క్లేవ్ 2017లో సీనియర్ జర్నలిస్టు రాయల్ కన్వాల్‌కు బేడీ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆమె మనోధైర్యాన్ని, పాలనా నిబద్ధతను తెలియజేస్తుంది. ప్రభుత్వ ఖర్చు లేకుండా కోటిన్నరతో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఖర్చుచేసి పాండిచ్చేరిని శుభ్రం చేసుకున్నారు. దానికి బేడీ చొరవే కారణం. కుర్చీలో కూర్చోడం కంటే కార్యక్షేత్రంలో పనిచేయడంలో ఆమె ఎక్కువ శ్రద్ధ కనబరచేవారు. తీహార్ జైలులో ఆమె చేపట్టిన నిశ్శబ్ద క్రాంతి జైలు వాతావరణంలో ఆశ్రమ సంస్కారం నింపింది. ఆమె తీహార్ జైలు అనుభవాల గురించి చక్కటి పుస్తకం రాసింది.
లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఏ మాత్రం భద్రత లేకుండా బేడీ ఒక్కరే సైకిలుమీద వెళ్లిపోతుంటారు. నలుగురు ఆడపిల్లల గురించి కిరణ్‌బేడీ తల్లిదండ్రులు కన్న కలలు నిజమయ్యాయి. ఆడపిల్లలైనా కేవలం ఇంటిపట్టునుండకూడదని, సమాజంలోని వివిధ రంగాలలో రాణించాలని ఆమె తల్లిదండ్రులు కోరుకున్నారు. కిరణ్‌బేడీ జీవితంలో అదే కలను సాకారం చేసేందుకు ప్రయత్నించింది.
రాజకీయాలకు ముందు అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. లోక్‌పాల్ కోసం ఉద్యమించారు. బిజెపిలో చేరుతూనే ఆమెకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం లభించింది. ఏ మాత్రం డబ్బు ఖర్చుపెట్టేందుకు ఆమె సిద్ధపడలేదు. కేజ్రీవాల్‌తో కలిసి పనిచేసినా ఆమె ఆ రాజకీయాన్ని వ్యాపారం చేయలేదు. ఓ ఆటోగ్రాఫ్ ఇచ్చినా, ఓ ఫొటో ఆప్ ఇచ్చినా, ఓ భోజనం చేసినా, ఓ ప్రకటన ఇచ్చినా కేజ్రీవాల్ డబ్బులు దండిగా వసూలు చేసుకున్నాడు. అపుడున్న రాజకీయ శూన్యంలో కేజ్రీవాల్ గెలిచినా తరువాత ప్రతిసారీ ఆయన ఓడిపోయాడు. కిరణ్ బేడీ ఆ ఎన్నికల్లో ఓడినా పుదుచ్చేరి వెళ్లి ఆమె ప్రజల మనసును గెల్చుకున్నారు.

-తాడేపల్లి హనుమత్‌ప్రసాద్ 96761 90888