సబ్ ఫీచర్

హిందువుల సంయమనంతో సమగ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు అతివాద హిందువులు మన దేశంలో ముస్లింలు తదితర మైనారిటీలపై దాడు లు చేస్తున్నారని ఇటీవల ప్రచారమవుతోంది. ఈ వార్త అమెరికాలోని ‘మత స్వేచ్ఛా సంస్థ’ వార్షిక నివేదికలో ప్రముఖంగా వచ్చింది. విదేశీ సంస్థలు మన గౌరవాన్ని భంగపరిచాయన్న నిజాన్ని విస్మరించి, ఇలాంటి తప్పుడు నివేదికలను ‘సెక్యులరిస్టుల’ ముసుగులో కొందరు నేతలు స్వార్థానికి వాడుకుంటున్నారు. జాతీయవాదాన్ని వినిపిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. మన దేశంలో మత కలహాలను ప్రేరేపించేలా ఢిల్లీలో పురాతన అమ్మవారి ఆలయాన్ని గత నెల 30న ఇతర మతస్థులు ధ్వంసం చేశారు. ఈ విధ్వంసక చర్య మీడియాకు, సెక్యులరిస్టులకు హిందువులపై దాడిగా కన్పించలేదు. హిందూ బాలికలపై అత్యాచారాలు జరిగితే- ఇవన్నీ సాధారణ సంఘటనలే అనేది సెక్యులరిస్టుల, నాస్తికుల, ధర్మద్రోహుల ఆలోచన. హిందువులపై జరిగే దాడులు మానవ హక్కుల సంఘాల వారికి కనిపించవు. మైనారిటీల ముసుగులో కొందరు చేస్తున్న అరాచకాలను ఎవరూ ఖండించరు. ‘కాషాయ తీవ్రవాదం’ అని హిందువులపై విషం కక్కే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తరఫున ఎన్నికల ప్రచారం చేసే స్వామి అగ్నివేష్‌కు ఢిల్లీలోని హిందూ దేవాలయాన్ని ముస్లింలు ధ్వంసం చేస్తే కంఠం మూగబోతుంది.
‘హిందూ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రిని నేనే.. యజ్ఞాలు చేసే అసలైన హిందువుని నేనే.. నరేంద్ర మోదీ యజ్ఞాలు చేయడు..’- అని చెప్పే తెలంగాణ సీఎం కేసీఆర్‌కి- ఢిల్లీలో ధ్వంసమైన అమ్మవారి దేవాలయం గురించి పార్లమెంటులో ప్రస్తావించాలని తన పార్టీ ఎంపీలకు చెప్పే తీరిక లేదా? ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మలు, బోనాల ఉత్సవాలు జరుపుతారు కదా? అటువంటప్పుడు ఢిల్లీలో ఆలయ విధ్వంసంపై మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఈ విషయమై తాను మాట్లాడితే మజ్లిస్ అధినేత ఓవైసీకి తాను దూరమవుతానేమో అన్న ఆందోళన కేసీఆర్‌లో ఉందా?
అయోధ్యలోని రామజన్మభూమిలో అత్యంత పురాతమైన రామమందిరాన్ని బాబర్ ప్రతినిధి మీర్‌బాకి ధ్వంసం చేసి, దానిపై బాబర్ పేరున మసీదు నిర్మించాడు. ఆ కట్టడాన్ని తొలగించేందుకు దాదాపు ఐదువందల సంవత్సరాల నుండి వేల మంది హిందువులు బలిదానమైనారు. ఆ వివాదాస్పద స్థలంలో ఏనాడూ ముస్లింలు నమాజు చేయలేకపోయినారు. చివరకు 1992 డిసెంబర్ 6న హిందువులు సంఘటితులై రామజన్మభూమి మీద ఉన్న కళంకాన్ని తొలగించారు. దానికి ప్రతీకారంగా కుహనా సెక్యులరిస్టులు, కమ్యూనిస్టుల అండదండలతో మతోన్మాదులు దేశవ్యాప్తంగా మారణ హోమం సృష్టించారు.
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో జాతీయవాదుల చేతిలో కంగుతిన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు కనుమరుగుకావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మైనారిటీలకు అండదండలనిస్తున్న రాజకీయ పార్టీల బలహీనతలను జీర్ణించుకోని ముస్లిం మతోన్మాదులు మతకలహాలు సృష్టించి కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలన్నది ఓ కుతంత్రం. ఆర్‌ఎస్‌ఎస్ లాంటి జాతీయ స్వచ్ఛంద సేవాసంస్థలను రెచ్చగొట్టి దోషిగా ప్రపంచం ముందుంచాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని హిందూ దేవాలయాన్ని కొందరు ధ్వంసం చేశారు. కాని హిందువులు సంయమనం కోల్పోకుండా, అమాయక ముస్లింలపై, వారి వ్యాపారాలపై ఎలాంటి దాడులు చేయలేదు. రెండు మతాల మధ్య విద్వేషాగ్ని రగిలించలేదు. విధ్వంసానికి పాల్పడ్డవారిని శిక్షించాలనేదే దేశ ప్రజల ఆకాంక్ష. దేశంలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి వాటి స్థానంలో ముస్లింలు మసీదులను నిర్మించారు. కాని అధిక సంఖ్యాకులైన హిందువులు ఏనాడు మసీదులను ధ్వంసం చేయలేదు.
మోదీ నాయకత్వంలోని జాతీయ ప్రభుత్వానికి ప్రపంచ దేశాలన్నీ బ్రహ్మరథం పడుతున్నాయి. కాని స్వదేశంలో ఏర్పాటువాదులకు మద్దతునిచ్చే మణిశంకర్ అయ్యర్, తుకుడే తుకుడే గ్యాంగ్ కన్హయకుమార్ లాంటివారు, అర్బన్ నక్సలైట్స్ విధ్వంసకారులను ప్రోత్సహిస్తుంటారు. కాని జాతీయవాదుల ముందు, దేశభక్తుల ముందు వీరి ఆటలు సాగవనేది గుర్తించాలి. కుహనా సెక్యులరిస్టుల కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతున్నారు. విదేశీ భావజాలం సిద్ధాంతాలకు పాతర వేస్తున్నారు. హిందువుల స్వాభిమానానికి నిదర్శనం అయోధ్యలో రామ మందిర నిర్మాణం. దీని నిర్మాణం జాతీయ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యవౌతుంది. సెక్యులర్ ప్రభుత్వాలతో మతసామరస్యం ఎండమావిగానే మిగులుతుంది. 2024నాటికి అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణవౌతుందనేది ప్రజల నమ్మకం. ఢిల్లీలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఉదంతాన్ని ముస్లింలు ఖండించి, దేశ సమగ్రతలో తాము కూడా భాగస్వాములమనే నమ్మకాన్ని కల్పించాలి.

-బలుసా జగతయ్య 90004 43379