సబ్ ఫీచర్

వర్ష కవచాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత ఎండనైనా తట్టుకోవచ్చు, ఎంత చలిగా వున్నా భరించవచ్చు. ఎండలో, చలిలో మన పనులు మనం చేసుకోవచ్చు. కానీ ఒంటిమీద చినుకుపడితే తట్టుకోలేం. వానలో తడుస్తూ ఏ పనీ చేయలేం.. చాలా ఇబ్బందిగా వుంటుంది. ఇంట్లోనుండి కాలు బయటపెడదామంటే ఎంతో కష్టంగా వుంటుంది. అయితే ఒకప్పుడు దాదాపు రెండు దశాబ్దాల క్రితంవరకూ కూడా రెయిన్‌కోట్స్ అందరికీ అందుబాటులో వుండేవి కావు. రెయిన్‌కోట్స్ ముందు గొడుగులు ఉపయోగించేవారు. తల, శరీరం తడవకుండా, స్కూల్, కాలేజీలకు వెళ్ళేవారు పుస్తకాల బ్యాగులు తడవకుండా గొడుగులు బాగా ఉపయోగపడేవి.
ఒకప్పుడు వ్యవసాయ పనులు చేసుకునేవాళ్లు ప్లాస్టిక్ / పాలిథీన్ కవర్లను తలపైనుండి మోకాళ్ళవరకు వానలో తడిసిపోకుండా కప్పుకుని నాట్లు వేయడం, కలుపు తీయడం, దుక్కి దున్నడం చేసేవారు. ఈ పాలథీన్ కవర్లు పనిచేయడానికి అడ్డుగా వుండేవి కాదు. అయితే గొడుగులు ఇటు వర్షాకాలం, అటు ఎండకాలంలో ఎండ వేడిమినుండి రక్షించేవి. ఒకప్పుడు గొడుగు క్రింద ఇద్దరు వ్యక్తులు తడవకుండా ఉండేవారు. అలాంటిది ఇపుడు కేవలం ఒక మనిషి వాడుకునే విధంగా తయారవుతున్నాయి. రంగుల విషయం తీసుకున్నట్లయితే ఒకప్పుడు ఒక్క నలుపు రంగు మాత్రమే వాడుకలో వుండేది. ఇపుడేమో పదుల సంఖ్యలో రంగు రంగుల డిజైన్లతో మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. పిల్లలనుండి విద్యార్థులు, ఆఫీసుకువెళ్ళేవారికి ఒక్కోరకమైన రంగులు, డిజైన్‌ల గొడుగులు అందుబాటులోకి వచ్చేసాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో గొడుగుకి ఒక గొప్ప హుందాతనం వచ్చేది. అది ఎలాగంటే వ్యవసాయ పొలాల దగ్గరికి భూస్వామిగాని, వారి కుటుంబ సభ్యులుగాని వెళ్లినపుడు యజమాని అయితే తెల్లని ధోవతిలో, తెల్లని చొక్కాతో తలపాగా చుట్టుకుని గొడుగును పట్టుకుంటే హుందాగానే ఉంటుంది. జీతగాడు పట్టుకుని నిలబడితే ఎంతో డాబుగా, దర్పంగా వుంటుంది.
ఇక ఇప్పుడేమో వాటి స్థానంలో జర్కిన్‌లు వచ్చేసాయి. తలకు టోపీలు, చొక్కాలు, ప్యాంట్లు, కాళ్లనుండి తల వరకు డిజైన్లతో చేసినటువంటి జర్కిన్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. వర్షాకాలం మొదలయ్యిందంటే చాలు ఈ జర్కిన్‌లను ఎగబడి ఖరీదు చేస్తున్నారు. ఇందులో అన్ని వయస్సులవారికి తగ్గట్లు పదుల సంఖ్యలో రంగులు, డిజైన్లలో లభ్యమవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు, మున్సిపాలిటీ కార్మికులకు కూడా సంబంధిత శాఖాధికారులు స్పందించి జర్కిన్‌లు, టోపీలు లాంటివి అందజేస్తున్నారు. ఎందుకంటే వారంతా వర్షం కురిసినా, పిడుగులు పడినా తమ తమ డ్యూటీలు చేయాల్సిందే కదా!

- పర్వతాల శ్రీనివాస్ 90149 16532