సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాధి తత్త్వము
921. పిట్ట తన గూడు ధ్వస్తమైనప్పుడు ఆకాశమున కెగిరిపోవును. అట్లే శరీర స్ఫురణము బాహ్య ప్రపంచ స్ఫురణము నశించినంతనే జీవాత్మ పరమాత్మాకాశమున కెగిరిపోయి సమాధి స్థితియందు లయముగాంచును.
922. దివ్యత్వము ప్రాప్తించుటకుముందు మానవత్వము సమసిపోవలయును. ఆనందమయియగు ‘బ్రహ్మమయి’ (జగజ్జనని) సాక్షాత్కరించుటకు ముందు ఈ దివ్యత్వము సమసిపోవలయును. నశించినట్టి దివ్యత్వము (అనగా శివుని)యొక్క ఱొమ్ముమీద గదా ఆ యానందమయి తన భవ్యనాట్యమును సల్పుచున్నది!
923. కర్పూరము వెలుగునపుడేమియు మిగులదు. నిత్యానిత్య వస్తువిచారము పరిసమాప్తమై ఉత్తమ సమాధి ప్రాప్తించునపుడు, ‘నీవు’ ‘నేను’ ‘ప్రపంచము’నను స్ఫురణయే యుండదు, ఏలన, అపుడు అంతఃకరణము బ్రహ్మమున లయించును.
924. అహంకారము నిర్మూలమైనంతనే జీవత్వము నశించును; అంతట సమాధి స్థితిలో బ్రహ్మసాక్షాత్కారమగును. కావున బ్రహ్మానుభవమునొందునది బ్రహ్మమే కాని జీవుడు కాడు.
925. ‘‘యతో వాచోనివర్తనే్త అప్రాప్య మనసా సహ’’యనునట్లు బ్రహ్మము అవాఙ్మనస గోచరమని యొక భక్తుడు వాదింప, శ్రీ గురుదేవుడిట్లు విమర్శించి పలికెను: ‘‘అది సరికాదు. పరిమితమగు మనస్సుచే భగవంతుని దెలిసికొనజాలమనుట నిజము, సందియము లేదు. కాని శుద్ధ మనస్సుచే వానిని దెలిసికోవచ్చును. శుద్ధ మనస్సనినను శుద్ధబుద్ధియని నను ఒక్కటియే. మఱియు నిరుపాధికమగు నాత్మయు శుద్ధబుద్ధియు నొక్కటియే. కామినీ కాంచనముల యందలి మోహనమువలన ఇంద్రియ బద్ధమగు సంకుచితబుద్ధిచే, లేక పరిమితము, సాపేక్షమునగు మనస్సుచే వానిని గ్రహింపజాలమనుట నిజము. మనస్సు సాధనచే ఇంద్రియ లోలతను బాపుకొని శుద్ధముకాగలదు. విషయ వాసనలను. కోరికలనూ-మోహరాగములను- తొలగించుకొని అఖండాత్మతో నైక్యము నొందవచ్చును. పూర్వము మహర్షులు భగవత్సాక్షాత్కారము నొందినది ఈ విధముననే కదా?
926. మనస్సును బుద్ధియు మలినములై ఇంద్రియబద్ధమై యున్నంతవఱకు భగవంతుడు వానికి అతీతుడగనే యుండును; కాని యవి పరిశుద్ధమైనంతనే భగవంతుడు వానికి సాక్షాత్కరించును. కామ లోభములు చేరి మనస్సును మలినముచేయుచున్నవి. హృదయమున అవిద్య రాజ్యము చేయుచున్నంతవఱకు మనోబుద్ధులు ఎన్నటికిని పరిశుద్ధము కాజాలవు, సాధారణముగా మనస్సును బుద్ధియు పరస్పర భిన్నములని చెప్పుటకలదు. కాని యవి పరిశుద్ధమైనపుడు ఏకమై చైతన్యమున లయించును.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి