సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

911. సగుణబ్రహ్మసాక్షాత్కారము తఱచు దివ్యరూపమున గలుగును. ఆ దివ్యరూపము వినిర్మల హృదయులకు మాత్రమే గోచరించును. అనగా ఆ రూపములు ఈశ్వరుడు ప్రసాదించు భాగవత తనువునకు సంబంధించిన దివ్యేంద్రియులకు మాత్రమే గోచరించును. కావున ఈ దివ్యరూపములను సిద్ధపురుషుడే చూడగల్గును.
912. ‘్భగవత్ సాక్షాత్కారమునొందువారు భగవంతుని తమ చర్మచక్షువులతోడనే చూతురా?’యని యొకరు ప్రశ్నింప శ్రీగురుదేవుడిట్లు సమాధానమొసగెను: ‘‘చూడరు ఈ చర్మచక్షువులతో- ఈ భౌతిక నేత్రములతో- భగవంతుని జూడజాలము. సాధన దశలో నీలో ‘ప్రేమ శరీరము’ నిర్మితమగును. దాని కన్నులును చెవులును ‘ప్రేమ మయములే’ వానితో నీవు భగవానుని జూచి వానితో సంభాషింపవచ్చును.
913. అనాహతధ్వని సదా దానంతటదియే సాగుచున్నది. అదియే ప్రణవ నాదము (అనగా ఓంకార ధ్వని.) అది పరబ్రహ్మమునుండి వెలువడుచున్నది, దానిని యోగులు మాత్రమే వినగలరు. సాధారణులగు లౌకికజనులు దానిని వినజాలరు. ఒకవైపున నాభిప్రదేశమునుండియు, మఱియొక వైపున పరబ్రహ్మమునుండియు ఆ నాదము వెలువడుచున్నట్లు యోగులు గ్రహింపగలరు.
సమాధి: బ్రహ్మజ్ఞానము
914. సమాధి దశలో మనఃస్థితి యెటులుండును? నీటినుండి కొంతసేపు వెలుపలనుంచి మఱల నీట విడువబడిన చేప యెట్టి యానందస్థితి ననుభవించునో (మనసు) అట్టి స్థితిలో నుండును.
915. గురువనియు శిష్యుడనియు భేదమును పాటింపని యా దివ్యస్థితి యెంత మహిమాన్వితము! గురుశిష్యభేదమే అపుడు గోచరింపదు!
916. వేయి సంవత్సరములనుండియు అంధకార బంధురమైయునన్న గదిలోనికి దీపమును దెచ్చినంతనే అది దానిని ప్రకాశింపజేయునట్లు జ్ఞాన తేజము యుగముల తరబడిగానున్న అజ్ఞానాంధకారమును నశింపజేసి జీవుని ప్రకాశింపజేయును.
917. ‘సమాధి స్థితిలో తమకు దృశ్యప్రపంచ స్ఫురణముండునా?’’ యని యొకరు ప్రశ్నింప, శ్రీగురుదేవుడిట్లు సమాధానమొసగెను?’’యని యొకరు ప్రశ్నింప, శ్రీగురుదేవుడిట్లు సమాధానమొసగెను: ‘‘సముద్రములోపల గుట్టలు, పర్వతములు, కనుమలు, లోయలు నుండునుగాని యవి పైకి గనబడవు. ఇట్లే సమాధి స్థితియందు అపారమగు సచ్చిదానంద సాగరము మాత్రమే గోచరించును. జీవభావము దానిలో అణగిపోయి అవ్యక్తముగానుండును.’’
918. నిజమైన జ్ఞానమున అహంకారము లేశమైన నుండదు- దాని జాడయైనను కానరాదు. సమాధి స్థితి లభింపనిదే(తత్త్వ) జ్ఞానమెన్నటికిని కలుగదు. జ్ఞానము మధ్యందిన మార్తాండుని వంటిది- అందు నరునకు తన నీడయే కానరాదు. అటులనే నరుడు జ్ఞానమును లేక సమాధి స్థితిని బొందినంతనే అహంకారమను నీడ యిక నిలువజాలదు. ఏలయన, ఒకవేళ మిగిలియున్నను అది విద్యామయమని నిశ్చయముగా నెఱుంగుడు. అది యెంతమాత్రము అవిద్యాసంజనితము కాదు.
919. ‘బుద్ధుడు నాస్తికుడా?’యని యొకరు ప్రశ్నింప, శ్రీగురుదేవుడిట్లు సమాధానమొసగెను: ‘‘కాడు, అతడు నాస్తికుడు కాడు, తన యనుభూతులనాతడు వెల్లడింపజాలకపోయెను. అంతేకాని మఱయొకటి కాదు. బుద్ధుని యభిప్రాయమేమో నీకుదెలియునా?- గాఢమగు ధ్యానముచే ‘బోధ’తో, చిత్స్వరూపముతో, ఐక్యమునొందుట- చిత్స్వరూపమేయగుట. అస్తిత్వమని కాని నాస్తిత్వమని కాని చెప్పుటకు వీలులేని- అస్తిత్వనాస్తిత్వములకు నడుమనుండు- ఒకానొక మహోత్కృష్టావస్థ బ్రహ్మసాక్షాత్కారము. ఈ ‘యస్తిత్వ నాస్తిత్వములు’ ప్రకృతి వికారములు. తత్త్వము ఈ రెంటికిని అతీతము.’’
- ఇంకాఉంది