సబ్ ఫీచర్

పరమాత్మపైనే కరుణాశ్రీలు కురిపించిన ‘కరుణశ్రీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(జూన్ 21న కరుణశ్రీ వర్ధంతి సందర్భంగా..)
*
పుట్టబోయెడి బుల్లి బుజ్జాయికోసమై పొదుగు గినె్నకు పాలు పోసీపోసీ- పాపం- అలిసిపోతున్నాడు- ఆయన. అంతటితో ఆగుతాడా? ఊహూ- లేదే! అందాల వెనె్నల్ని చిందించే చలువదోసిళ్లతో లతలకు మారాకుల్ని అతుకుతునే ఉన్నాడు. ఇంకా పూల కంచాలలో తుమ్మెదలకు రేపటి భోజనాన్ని సిద్ధపరుస్తూనే ఉన్నాడు. తాను నిద్రపోకుండా- లోకం తెలవారకుండానే మొగ్గలలోకి ఎలా చొరబడతాడో తెలీదు మరి - వింత వింత రంగుల్ని వేస్తూనే ఉన్నాడు. ఆయనదో విశ్వసంసారం. పాపం- తీరికే లేదాయనకు. అది గమనించారొక ఆధునిక కవి. ఒక నిమిషం సేపు విశ్రాంతి తీసుకుందువు గాని- రా! మా కుటీరం తలుపు తెరిచానంటారు. ఇంతకీ ఇలా శ్రమచేసే వ్యక్తి ఎవరనుకున్నారు? నామ గుణ రూప భేదాలకతీతమైన, అన్నీ ఆయనే అయిన పరమాత్మ.
పరమాత్మకు గుణ రూపాల్ని కల్పించి, అనేక భావాలతో, అలంకారాలతో వర్ణించిన కవులనేకులున్నారు. కానీ- ఆ పరమాత్మయొక్క సర్వజగద్రక్షకత్వంలోని నిర్విరామ కృపారూప కార్యభారాన్ని అనగా కరుణాశ్రీ తత్త్వాన్ని నిశితంగా, విశిష్టంగా, శిష్టంగా, ఇష్టంగా, విలక్షణంగా పరిశీలించి, అక్షరాక్షరంలోనూ అత్యంతార్ద్రంగా, ఆకర్షణీయంగా జాలిని ప్రదర్శించి, సేదదీర్చిన కవులు ఎవరైనా ఉన్నారా? ఆలోచించకండి. ఒక్క ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్ర్తీగారు తప్ప-మరొకరు కనిపించరే!
ఈ కరుణశ్రీ కోరికను ఆ కరుణశ్రీ పరమాత్మ ఆలకించాడేమో! వస్తున్నాడన్న భావనతో కంగారుగా పులకించిపోయారు- ఈ కరుణశ్రీ. కనీసపు అతిథి సత్కారాలయినా చేయాలి గదా! ఆ చింతనతో సంభ్రమానికి గురయ్యారు- కవిగారు. వెంటనే- ‘‘కూర్చుండ మా యింట కుర్చీలు లేవు- నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటిన’’ని అన్నారు. ఆయన దగ్గర పన్నీరు లేదట- కాళ్లు కడగడానికి. మరి- ఆనందబాష్పాలే ఉన్నాయట. పూజకోసం మా వీధిలో పూవులు లేవన్నారు- ఈ ‘పుష్పవిలాప’ కవి. నా ప్రేమాంజలినే సమర్పిస్తున్నానన్నారు. నేవైద్యం పెట్టడానికి నారికేళం లేదు గానీ- నా హృదయానే్న సమర్పిస్తాను- లోటురానివ్వనన్నారు. నీ పాద ముద్రల్లోనే కోటి స్వర్గాలను మొలిపించుకుంటానన్నారు.
వచ్చాడు- తాననుకున్నట్లుగా పరమాత్మ. ఆ జాలి రూపమే కనిపిస్తోంది- ఈ కవిశ్రీకి- కాదు- కరుణశ్రీకి. ‘‘లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక, జగతిపై పడవచ్చు జలరాశి కెరటాలు మామూలు మేరకు మడవలేక, పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారముల కీలు కదపలేక, అందాలు చిందు నీలాకాశ వేదిపై చుక్కల ముగ్గులు చెక్కలేక ఎంత శ్రమపడుచుంటివో!’’ అని సానుభూతి వాక్యాలు పలికారు. హృదయ పుష్పాంజలిని సమర్పించారు. పరమాత్మ దైవలోక కార్యక్రమ వినిర్వహణ దక్షతలో ఒకానొక అనుపమాన కరుణాత్మక దృశ్యాల్ని తాము చూడడమేకాకుండా- పఠితలకుగూడా చూపి, అటువంటి సానుభూతినీ, రసానుభూతినీ కల్గించారు. ఇటువంటి కవులెవరైనా ఉన్నారా? చెప్పండి. ఎవ్వరూ లేరు- ఒక్క కరుణశ్రీ తప్ప. ‘ఉదయశ్రీ’ మొదటి భాగంలోని ఈ ‘అంజలి’తో కరుణశ్రీ- తమ అల్లుడు చింతపల్లి నాగేశ్వరరావు ద్వారా ‘్హఖౄఇళ యచిచిళూజశ’’ అన్న ఫేరుతో ఆంగ్ల కవితానువాద రూప ‘స్మితశ్రీ’ అయినారు. నాగేశ్వరరావుగారికి ‘స్మితశ్రీ’ అన్న కలం పేరుకు ఏర్పరచినవారు కరుణశ్రీగారే! నాగేశ్వరరావుగారు కరుణశ్రీగారి ‘ఉదయశ్రీ’లోని సుమారుగా ముప్ఫై కవితా ఖండికలను 1992లో ఆంగ్ల కవితలుగా అనువదించారు. అంతేకాక-తెలుగులో అనేక కావ్యాలను రచించారు. వీరి ‘నర్మదాపురుకుత్సీయము’ అన్న చంపూ ప్రబంధానికి 2011లో ‘నది’ మాసపత్రిక- అగ్రిగోల్డ్ మల్టీ మీడియా వారి పోటీలలో తృతీయ బహుమతిని పొందింది.
ఇలా - ఆ పరమాత్మ తత్త్వాన్ని కరుణాత్మకంగా ప్రదర్శించే శక్తి కలిగిన కవి గొప్పవాడా? లేక ఇటువంటి సత్కవిని మనకు ప్రసాదించిన ఆ పరమాత్మ గొప్పవాడా? ఏమో? ఆ నిర్ణయాన్ని పాఠకులకే వదిలేస్తున్నాను. మొత్తంమీద పరమాత్మనెలా (సం)భావన చేయలో పఠితలకు నేర్పినవారు కరుణశ్రీ కవీంద్రులొక్కరే!

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ 9866944287