సబ్ ఫీచర్

స్టార్టప్‌ల స్వర్గం.. టీ-హబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉన్న ‘టీ-హబ్’ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని రతన్‌టాటా లాంటి వాణిజ్య దిగ్గజాలు కొనియాడారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ లాంటివారు సందర్శించి ప్రపంచస్థాయి ఇంక్యుబేటర్ అని ప్రశంసించారు. దాంతో అక్కడి స్టార్టప్‌ల పని సంస్కృతిలో గుణాత్మకమైన మార్పు కనిపిస్తోంది. దేశం నలుమూలల నుంచి ఎందరో యువతీ యువకులు తమ స్టార్టప్‌లతో అక్కడ ఎదిగేందుకు కృషిచేస్తూ వున్నారు.
పెరిగిన డిమాండ్ కారణంగా అవసరాల రీత్యా, ప్రతిష్టాత్మకమైన టీ-హబ్ ఫేజ్-2లో పనిచేసేందుకు ఇప్పుడు వివిధ కార్పొరేషన్‌లను, స్టార్టప్‌లను ఆహ్వానిస్తున్నారు. టీ-హబ్ సీఈఓ రవి నారాయణ్ ‘ల్యాబ్-32’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ టీ-హబ్‌లో స్థలాన్ని- సౌకర్యాలను మార్కెట్ ధరకన్నా చాలా చౌకగా అందిస్తున్నామని, నాణ్యమైన సేవలు సమకూరుస్తున్నామని అన్నారు. కొత్త స్టార్టప్‌లకు అవసరమైన మెంటార్లను పరిచయం చేస్తూ, ‘కనెక్ట్’కావడానికి మార్గాలు చూపిస్తామన్నారు. ‘ల్యాబ్- 32’ కోసం దేశవ్యాప్తంగా 500 దరఖాస్తులు వచ్చాయని అందులో 45 స్టార్టప్‌లను ఖరారు చేశామని వీటిలో అధికంగా హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌లేనని చెప్పారు.
కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీలకు చెందిన స్టార్టప్‌లు సైతం వచ్చాయి. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగం, విద్యారంగం, స్మార్ట్ సిటీస్, రవాణా తదితర రంగాల స్టార్టప్‌లూ ఉన్నాయి. ఆయా కార్పొరేషన్లకు టీ-హబ్ సృజనాత్మక కేంద్రంగా నిలుస్తుందని, వివిధ కార్పొరేట్ సంస్థలు తమ కేంద్రాలను ‘హబ్’లో నెలకొల్పాలని రవి నారాయణ్ ఆహ్వానిస్తున్నారు. భారీస్థాయిలో పరిశోధన కేంద్రాలను, ల్యాబ్‌లను ఏర్పాటుచేసుకోవలసిందిగా కోరుతూ ఆయా బడా సంస్థలను, స్టార్టప్ సంస్థలను కోరుతున్నామన్నారు. ఆ ‘అడుగు’తో ఆయా సంస్థలకు వినూత్న ఆవిష్కరణలకు హబ్ ఆలంబనగా నిలుస్తుందని చెప్పారు. స్టార్టప్ సంస్థలకు టీ-హబ్‌ను మించినచోటు మరొకటి లేదన్న రీతిలో సకల సదుపాయాలు, విస్తరణావకాశాలు, మార్కెట్ పరిచయాలు మరెన్నో అంశాలు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు.
కాగా, హైదరాబాద్‌లోని ఐఐటీ ఓ కొత్త ప్రయోగానికి తెరలేపింది. ఎం-2 స్టార్ట్ ప్రాజెక్టు పేర కాలుష్య నివారణకు సరికొత్త నివారణ మంత్రం సూచిస్తోంది. ఇందుకు అవసరమైన ‘యాప్’కు రూపకల్పన చేసింది. రద్దీగా ఉండే రహదారులపై సీసీటీవీ కెమెరాలు, వివిధ రకాల సెన్సర్లు అమర్చి ఆ ప్రాంతంలోని కాలుష్యాన్ని నిరంతరం తెలుసుకుంటూ ఆ సమాచారాన్ని యాప్ ద్వారా ప్రయాణికులకు అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఆ సమాచారం అందుకున్న ప్రయాణికుడు కాలుష్యం ఎక్కువగా ఉండే రహదారి నుంచి గాక ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ప్రయాణించే వీలుంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ విధమైన ప్రయోగాలు అహ్మదాబాద్ నగరంలో కొనసాగాయి. దీనివల్ల ఏయే వాహనాల వల్ల ఎంతెంత కాలుష్యం వెలువడుతున్నదో తెలుసుకునే అవకాశం లభించింది. భవిష్యత్‌లో ఈ ప్రణాళికను అన్ని నగరాలకు విస్తరించి ప్రయాణికులు కాలుష్యం బారిన పడకుండా కాపాడటమే గాక కాలుష్యంపై అవగాహన పెంచడానికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రొఫెసర్లు, విద్యార్థులు భాగస్వాములుగా నిలిచారు. జపాన్‌కు చెందిన నిహాన్ విశ్వవిద్యాలయ సహాయ సహకారాలు ఈ ప్రాజెక్టుకు లభిస్తున్నాయి. ఐఐటీ ప్రాంగణంలోని ‘టెస్ట్‌బెడ్’కు సమకూరిన సమాచారమంతా బిగ్‌డేటా, మెషిన్ లెర్నింగ్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విశే్లషించి సమాచారాన్ని యాప్ ద్వారా తెలుపుతారు.
బ్లాక్‌చైన్ పాలసీ
తెలంగాణ ప్రభుత్వం బ్లాక్‌చైన్ పాలసీ ముసాయిదాను సిద్ధం చేసింది. ప్రపంచంలోని 10 బ్లాక్ చైన్ నగరాలలో హైదరాబాద్‌ను ఒకటిగా నిలిపేందుకు వీలుగా ఈ ముసాయిదాను తీర్చిదిద్దారు. భారతదేశంలో తొలి బ్లాక్‌చైన్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు సంబంధిత వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. ప్రపంచంలో అత్యుత్తమ బ్లాక్‌చైన్ టెక్నాలజీ వ్యవస్థను హైదరాబాద్ నగరంలో ప్రవేశపెట్టనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకునేందుకు ముసాయిదాను రూపొందించింది. ఈ బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్ ప్రపంచస్థాయి బ్లాక్‌చైన్ కంపెనీలకు ‘ఇంక్యుబేటర్’గా పనిచేయనున్నదని భావిస్తున్నారు. పరిశోధనలకు, ఆవిష్కరణలకు పరిశ్రమల మధ్య సహకారం కొనసాగేందుకు ప్రపంచస్థాయి సౌకర్యాలను ఏర్పాటుచేసేలా సూచనలను ఈ ముసాయిదాలో పొందుపరిచారు.
అసలు ‘బ్లాక్‌చైన్’ అంటే ఏమిటన్న ప్రశ్న చాలామంది మదిలో మెదులుతూ ఉంటుంది. క్రయవిక్రయాలను, లావాదేవీలను తెలిపే ఒక ‘డిజిటల్ లెడ్జర్’ ఇది. టెక్నాలజీ ఆధారంగా వినియోగదారుల డేటాను, సమాచారాన్ని పొందవచ్చు. ఈ సమాచారాన్ని, డేటాను ఆన్‌లైన్‌లో సరిదిద్దడం కుదరదు కాబట్టి పూర్తి విశ్వసనీయ సమాచారాన్ని ఆ లెడ్జర్‌లో తిలకించవచ్చు. అనేక కంప్యూటర్లు సమాచారాన్ని భద్రపరుస్తాయి కాబట్టి హ్యాక్ చేస్తారన్న ఆందోళన అవసరం లేదు. ఈ వర్తమాన టెక్నాలజీ ఇప్పుడు బహుళ ప్రాచుర్యంలో ఉంది. అందుకే దీన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషిజరుగుతోంది. విస్తృత పరచడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని గమనించి టెక్నాలజీ పట్ల ముందుండే తెలంగాణ ప్రభుత్వం ఈ పాలసీకి రూపకల్పన చేసింది. అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ బ్లాక్‌చైన్ కంపెనీలకు సరైన సౌకర్యాలు, మానవ వనరులు ఒకేచోట అందించడం వల్ల ప్రయోజనముంటుందని అందుకే ‘బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్’ ఏర్పాటుకు పూనుకుంటున్నారు. స్టార్టప్ సంస్థలు సైతం రానున్నాయి, వౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సమాచార మార్పిడికి అవసరమైన విధానాల వల్ల ఈ డిస్ట్రిక్ట్ విజయవంతం కాగలదని విశ్వసిస్తున్నారు. కొత్తగా వచ్చే కంపెనీలకు సబ్సిడీలు, కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని ముసాయిదాలో సూచించారు. ఇంకా ఇతర అనేక రాయితీలు సైతం స్టార్టప్‌లకు ఇవ్వనున్నారు. దాంతో బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్ త్వరగా పుంజుకుని అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించగలదన్న ఆశాభావంతో రాష్ట్ర ఐటీ శాఖ ఉన్నది. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో దూసుకుపోతున్న తెలంగాణ ఆధునిక బ్లాక్‌చైన్ టెక్నాలజీ సేవల్లోనూ అగ్రభాగాన నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్మార్ట్‌సిటీ వరంగల్
వరంగల్ నగరంలో స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా వివిధ పనులు కొనసాగుతున్నాయి. 2016 ఏప్రిల్‌లో వరంగల్ స్మార్ట్‌సిటీగా రూపొందించేందుకు ఎంపికైంది. రూ.2,861 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. రూ.2,242 కోట్ల విలువైన 74 పనులు కొనసాగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ పనులను పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల నిర్మాణానికి, మురికినీటి కాలువల ఆధునీకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. వివిధ జంక్షన్లలో ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక పద్ధతులను అవలంబించనున్నారు. పార్క్‌లు,బస్టాండ్లను శరవేగంగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే వడ్డేపల్లి చెరువువద్ద బ్రహ్మాండమైన పార్క్ నిర్మాణానికి పనులుచేపట్టారు. ఫైబర్ ఆఫ్టిక్-కేబుల్ వేసే పనులు సైతం జరగనున్నాయి. వౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలోనేగాక ఆధునిక టెక్నాలజీ ఆధారంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం ఈ స్మార్ట్ సిటీ పథకంలో అంతర్భాగం.
డ్రైవర్ లేని ట్రక్కు
స్వీడన్‌లో ఇటీవల డ్రైవర్ లేని ట్రక్కు రోడ్లపై పరుగులు తీసింది. ఈ ఎలక్ట్రిక్ భారీ వాహనాన్ని తొలిసారి ప్రయోగాత్మకంగా పారిశ్రామిక ప్రాంతంలో కొంత దూరం నడిపారు. కెమెరాలు, రాడార్లు, 3డి సెన్సార్ల సహాయంతో ఈ ట్రక్కు రోడ్డుపై పరుగుతీసింది. ఇది సరికొత్త విప్లవం. ముఖ్యంగా బొగ్గు పులుసువాయువు నియంత్రణకు, ఎలక్ట్రిక్ కార్లు, ట్రక్కులు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. వేగానికి ఏమాత్రం తక్కువకాదని అంటున్నారు.
అమెరికాకు చెందిన ‘టెస్లా’కంపెనీ సైతం స్వయంచోదిత ఎలక్ట్రిక్ కార్లను తయారుచేస్తోంది. మరికొన్ని సంస్థలుకూడా ఈ ఆధునిక టెక్నాలజీ ఆధారంగా పరిశోధనలు జరుపుతున్నాయి. భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) రూపకల్పన చేస్తున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’కోసం వాయుసేనతో ఇటీవల ఒక ఒప్పందం కుదుర్చుకుంది. యాత్రా అభ్యర్థులకు వాయుసేన శిక్షణ ఇవ్వనున్నది. ఇంత విప్లవాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో రెండున్నర వేల కిందటి భావాలకు మాన్యత, మనుగడ ఉంటుందా?

-వుప్పల నరసింహం