సబ్ ఫీచర్

శ్రీలంకలోనూ బౌద్ధ సన్యాసుల హింస!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు దశాబ్దం క్రితం వరకు అంతర్యుద్ధంతో అతలాకుతలమైంది. ఆ రావణకాష్టం చల్లారిందనుకున్న సమయంలో మయన్మార్‌లోని ‘దృశ్యాలు’ శ్రీలంకలోనూ పునరావృతం కాసాగాయి. 2010 సంవత్సరం తర్వాత శ్రీలంకలో మత విద్వేషాలు పెరిగాయి. ఇందులో ముస్లిం మత ఛాందసవాదులు తమ ఆధిక్యతను చాటుకోవడానికి ఆగ్నేయాసియాలో అనుసరించిన విధానాలను శ్రీలంకలో ప్రవేశపెట్టడంతో రావణకాష్టం మరోసారి రాజుకుంది. మెజార్టీ ప్రజలైన సింహళీయులు బౌద్ధ ధర్మాన్ని శతాబ్దాలుగా ఆచరిస్తున్నారు. శాంతి-అహింసా పద్ధతుల్లో వారు జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘ఇస్లాం రాడికల్స్’ ఆగ్నేయాసియాలో రెచ్చిపోయినట్టు శ్రీలంకలో తమ ‘ప్రతాపం’ ప్రదర్శించసాగారు. తమ జనాభాను పెంచుకోవడానికి మత మార్పిడులకు పెద్దఎత్తున పాల్పడటం, అన్యమత స్ర్తిలను ముస్లిం మగవారు వివాహమాడటం, తమ ప్రార్థనా మందిరాలను ఎలాంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో కట్టడం, పరమత సహిష్ణుత పాటించక పోవడం, ముఖ్యంగా తాలిబన్ల చర్యలకు ప్రభావితమై ఆ రకంగా మిలిటెన్సీ ఆలోచనలు చేయడం.. వారి ప్రసంగాల్లో అవి వ్యక్తం కావడం, ప్రతిఫలంగా ఘర్షణలు జరగడం ఇదొక ‘మాడ్యూల్’గా కొనసాగడంతో మెజార్టీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సింహళీయ బౌద్ధులు సహించలేక పోయారు. దాంతో కొలంబోలో ‘బోడు బాలసేన’ అనే బౌద్ధ సన్యాసుల సంస్థ పురుడుపోసుకుంది. బౌద్ధాన్ని, బౌద్ధ ప్రజల్ని రక్షించుకునే జాతీయవాదులుగా తమను తాము ప్రకటించుకున్నారు. ఆ సంస్థ నాయకుల్లో ఒకరు బౌద్ధసన్యాసి జ్ఞానసార. ఈయన ఉపన్యాసాలు తీవ్ర స్వరంతో ఉంటాయి. ధారాళంగా మాట్లాడి ప్రజలను ఆకర్షించే లక్షణం గలవాడు. 2014 సంవత్సరంలో ఓ సింహళ జాతీయుడైన డ్రైవర్ ముస్లింల దాడిలో మరణించడంతో జ్ఞానసార ఆగ్రహోదగ్రుడై బౌద్ధులను ‘‘జాగృతం’’ చేశాడు. అనంతరం కొన్నిచోట్ల బౌద్ధ సన్యాసులు- పౌరులు ముస్లిం సముదాయానికి చెందిన ఇళ్లు- వ్యాపారాలపై దాడులు చేయగా ముగ్గురు ముస్లింలు మరణించారు. దీని పర్యవసానంగా కొన్నిచోట్ల అల్లర్లు జరిగాయి. ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ప్రజాజీవితం అల్లకల్లోలమైంది. అనంతర కాలంలో ముస్లింలు కొందరు ప్రతీకార దాడులు చేశారు.. ఇలా ఒక సముదాయంపై మరో సముదాయం దాడులు జరుపుకుంటూనే ఉన్నాయి. మతపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ సందర్భంలో జ్ఞానసారను కొందరు జాతీయ, అంతర్జాతీయ పత్రికా ప్రతినిధులు కలిసి ఈ విషయమై ప్రశ్నించగా- ‘శతాబ్దాలుగా ప్రశాంత జీవనం గడుపుతూ అహింసే పరమావధిగా కొనసాగుతున్న ప్రజలను ముస్లింలు రెచ్చగొడుతున్నారు.. ముస్లింలతో సమస్యలేని దేశం ఏదైనా ఉంటే చూపండి?’..అని ఎదురు ప్రశ్నించారు. తన ఎదురుప్రశ్నలోనే సమాధానముందని, ముస్లింల వ్యవహారం గ్లోబల్ సమస్యగా మారిందని ఆయన ఎంతో తార్కికంగా పేర్కొన్నారు.
‘ముస్లింలు తమను తాకితే అదే వారికి ఆఖరి రోజవుతుంది’ అని కూడా ఆయన మీడియా ముందు పదే పదే హెచ్చరించారు. దీంతో శ్రీలంక బౌద్ధసన్యాసుల ‘స్వర తీవ్రత’ ఎలామారిందో తెలుస్తోంది. తమ మతానికి, దేశానికి ముస్లిం మత ఛాందసవాదుల నుంచి ‘ప్రమాదం’ పొంచి ఉందని శ్రీలంక బౌద్ధసన్యాసులు బలంగా నమ్ముతున్నారు. దానే్న తమ ఉపన్యాసాల్లో వెల్లడిస్తున్నారు. ప్రపంచంలోని పరిస్థితులు ముఖ్యంగా పొరుగునే ఉన్న ఆగ్నేయాసియా దేశాల్లో రాడికల్ ముస్లింల చర్యలు, పద్ధతులు ఆ మాటలకు ఊతం ఇస్తుండటంతో సాధారణ బౌద్ధ ప్రజలు సైతం రాడికల్ బౌద్ధ సన్యాసులు చెబుతున్న దాంట్లో ‘వాస్తవం’ ఉందని గ్రహించి దాడుల్లో పాల్గొంటున్నారు. ఎంతో ప్రశాంతంగా ధవళ వస్త్రాలతో ‘బుద్ధ భగవానుడి’ సేవలో తరించాలని భావించే ప్రజలు కాస్త తమ ధర్మాన్ని రక్షించుకునేందుకు దాడులకు సైతం సిద్ధపడుతున్నారు. మరణాన్ని సైతం లెక్కచేయడం లేదు. అలాంటి వారికి బోడు బాలసేన (బిబిఎస్) నాయకత్వం వహిస్తోంది. మార్గదర్శనం చేస్తోంది. బౌద్ధ సన్యాసులు ఆ విధంగా వీధుల్లోకొచ్చి ఆందోళనల్లో ముందుంటున్నారు.
మయన్మార్‌లో మాదిరిగానే బ్రిటీషువారి ‘విభజించి పాలించు’ అనే సూత్రంతో గతంలో తామెంతో నష్టపోయామని శ్రీలంక బౌద్ధనాయకులు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. తమ మందిరాలను గతంలో నేలమట్టం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆధారాలు చూపుతున్నారు. ఆరోజుల్లో మాదిరి వర్తమానంలో నిష్క్రియాపరత్వంతో ఉంటే శ్రీలంక దేశాన్ని ముస్లింలు స్వాధీనం చేసుకుంటారని ఆరోపిస్తున్నారు. తమ దేశాన్ని, మతాన్ని కాపాడుకోవలసిన అవసరం, బాధ్యత తమకుందని బౌద్ధ సన్యాసులు బహిరంగంగానే చెబుతున్నారు.
2018 మార్చిలో కాండీ పట్టణంలో బుద్ధిస్టులు జరిపిన దాడిలో ఒక ముస్లిం మరణించాడు. దాంతో మరోసారి పరిస్థితి విషమించింది. మత ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రభుత్వం పది రోజులపాటు అత్యవసర పరిస్థితిని విధించింది. దీంతో అక్కడి పరిస్థితులు ఎంతటి తీవ్ర స్థాయికి చేరుకున్నాయో ఊహించవచ్చు.
మయన్మార్ (బర్మా)లోని ‘బర్మీస్ బుద్ధిస్ట్ బిన్ లా డెన్’గా పేరొందిన అశిన్ విరాతును శ్రీలంక బౌద్ధసన్యాసులు ఆదర్శంగా తీసుకుని ఫాసిస్టులుగా వ్యవహరిస్తున్నారని ముస్లిం నాయకులు ఆరోపిస్తున్నారు. బౌద్ధ సన్యాసులపై అనేక కేసులు నమోదయ్యాయని, వారి వ్యవహారశైలి ఎలాంటిదో దీనివల్ల అర్థమవుతోందని అంటున్నారు. తాము తీవ్రవాదులం కాదు.. జాతి విద్వేషాలను రెచ్చగొట్టడం లేదు, కేవలం బౌద్ధ్ధర్మాన్ని, సింహళీయులను రక్షించుకుంటున్నాం, మేం జాతీయవాదులం. జాతీయవాదమెప్పుడూ నేరం కాదే?.. అని బౌద్ధ సన్యాసులు ముఖ్యంగా బిబిఎస్ నాయకులు అంటున్నారు.
ఇది ఇలాఉంటే.. అన్ని మతాల మధ్య ఐక్యత కోసం కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. సదస్సులు నిర్వహిస్తున్నారు. టెలివిజన్ చానళ్లు చర్చాగోష్ఠులు చేపడుతున్నాయి. సహ జీవనం, సామరస్యత, సహిష్ణుత కీలకమని అన్ని మతాల్లోని రాడికల్స్‌కు చెబుతున్నారు. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంక్షేమం కోరే మేధావులు పాటుపడుతున్నారు. ‘బుద్ధిస్టు రిలిజియన్ ఎఫైర్స్ మినిస్ట్రీ’’ (మంత్రిత్వశాఖ) సైతం తన వంతు ప్రయత్నం చేస్తోంది. తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలతో గ్రామ దేవాలయాల్లో క్రతువులు కొనసాగేలా, పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకునేలా ప్రోత్సహించేవారు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇందులో చాలామంది బౌద్ధ సన్యాసులు పాల్గొనడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈస్టర్ పండగ రోజు ముస్లిం ఉగ్రవాదులు జరిపిన ‘నరమేధం’తో మొత్తం ప్రపంచం నివ్వెరపోయింది. వందలాది మంది అమాయకులు కన్ను మూయడం, మరెంతోమంది తీవ్రంగా గాయపడటం, ఎన్నో ఆస్తులు బుగ్గిపాలుకావడంతో టెర్రరిజానికి ‘మ తం’లేదు అన్న మాట మరోసారి రుజువైంది. మత సహిష్ణుత పెంపొందించాల్సిన తరుణంలో శ్రీలంకలో ఈ తాజా పరిణామం కోలుకోని రీతిలో మత విద్వేషాలను రెచ్చగొడుతోంది. ముస్లింలపై ఎంతో సానుభూతి ఉన్నవారు సైతం ఈ ఘటనతో కంగుతిన్నారు. చివరికి చాలామంది ముస్లిం పెద్దలు ఇది ఇస్లాంకు వ్యతిరేక చర్య అని బహిరంగంగానే ఖండిస్తున్నారు. జరగాల్సిందంతా జరిగాక ఇప్పుడు ఖండిస్తే ఏం ప్రయోజనమని క్రైస్తవులు, బుద్ధిస్టులు ప్రశ్నిస్తున్నారు.

-వుప్పల నరసింహం 99857 81799