సబ్ ఫీచర్

బుద్ధుడు- ఉంగరాల జుట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేనిపైనా వ్యామోహం కూడదని, చివరికి తల జుట్టుపై కూడా వ్యా మోహం వద్దని బౌద్ధ సన్యాసుల తల జుట్టు తీసేస్తారు. కాషాయ వస్త్రాల్లోని గౌతమ బుద్ధుడు మాత్రం ఉంగరాల జుట్టుతో రాజసంతో కనిపిస్తాడు. మరి బౌద్ధ సన్యాసులకు జుట్టు ఉండరాదు ఎందుకు? ఈ వాదన- ‘కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా ఉంద’ని కొందరికి అనిపించినా, ఏదైనా విషయంలోని డొల్లతనం ఇలాంటి సూక్ష్మ విషయాల్లోనే తేటతెల్లమవుతుందని గ్రహిస్తే.. అలాంటి అభ్యంతరాలకు తావుండదు.
సిద్ధార్థుడు బుద్ధుడిగా ఓ కొత్త ధర్మం- మతం ప్రతిపాదించినప్పుడు ఆ ‘ధర్మం’ అందరికీ సమానంగా వర్తించాలని కదా? బుద్ధుని తలనిండా ఉంగరాల జుత్తు కనిపిస్తే, ఆయన శిష్యుల, అనుయాయుల తలలు బోడిగా కనిపిస్తాయి. ఏ చిత్రంలో చూసినా, ఏ విగ్రహాన్ని పరిశీలించినా బుద్ధుని తలనిండా ఉంగరాల జుట్టు కనిపిస్తుంది. 80 ఏళ్ల వయసులోనూ, మహా నిర్వాణ సమయంలోనూ బుద్ధుని తలనిండా జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. రాజసం ఉట్టిపడుతుంది. విచిత్రమేమిటంటే ఆయన శరీరంలో ఎలాంటి వృద్ధాప్య ఛాయలు కనిపించవు, శరీర సౌష్టవంలోనూ పెద్దగా తేడా కనిపించదు. మరి అదెలా సాధ్యం? పైగా అతని తల చుట్టూ ‘ఆరా’ తప్పక దర్శనమిస్తుంది.
తానొకటి పాటిస్తూ ఇతరులకు మరొకటి బోధించిన బుద్ధుడిని ‘్భతిక వాది’ అని, తొలి భారతీయ భౌతికవాది అని గొప్పలు పోవడం భావ్యమా? తల వెనుక ‘ఆరా’ ఉండటం, చిన్ముద్రలో, అర్ధనిమీలిత కన్నులతో, ధ్యానంలో మునిగి, దేనిపైనా మోహం ఉండరాదని, చివరకు జుట్టుపై కూడా మోహం ఉండరాదని చెప్పడం భౌతికవాది లక్షణమవుతుందా? కనుబొమలు సైతం తీసేసి, బోడిగా ఉండడం బౌద్ధ సన్యాసుల్లో కనిపిస్తుంది. ఈ రకమైన విపరీత ధోరణులు భౌతికవాదుల కర్తవ్యాలా?
వైశాలి నగరం దగ్గర బుద్ధుడు చివరి ‘బోధ’ (ప్రవచనం) చేశాక ఖుషినాగ దగ్గర రెండున్నర వేల సంవత్సరాల క్రితం నిర్యాణం చెందాడని చెబుతారు. ఆ సందర్భాన్ని చిత్రిక పడుతూ అక్కడే ఓ భారీ విగ్రహాన్ని రూపొందించారు. మహావిష్ణువు సేద తీరుతున్న విధంగా బుద్ధుని ‘మహా నిర్వాణ ముద్ర’ కనిపిస్తుంది. ఆ సమయంలోనూ విషాహారం తిన్న ఛాయలు గాని, డస్సిపోయిన శరీరం గాని, వృద్ధాప్యపు ముడతలు గాని ఏవీ కనిపించకుండా మెరిసిపోయేలా బంగారు రంగులో అక్కడి విగ్రహం, ఇతర చిత్రాలు దర్శనమిస్తాయి. ఇదంతా అతిశయంగా ఎవరికి అనిపించక పోవడం విడ్డూరమే! హిందూ ధర్మాన్ని తప్పుపడుతూ, ఆ ధర్మానికి కీలకమైన నారాయణుడిని అనుకరిస్తూ శయనించడం, ఆ ‘ముద్ర’ను అతని అనుయాయులు, అనుచరులు ఎంతో పవిత్రమైనదిగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం వింతగానే కనిపిస్తుంది. బోధగయలో పాలసముద్రం లాంటి కొలనులో సర్పం నీడలో బుద్ధుడు కూర్చున్న విగ్రహం కనిపిస్తుంది.
బుద్ధుని అంతిమ సంస్కారాలపైనా అనేక వివాదాలున్నాయి. సమాధి అయ్యారని కొందరు, మహాపరి నిర్వాణమంటే ఈ భౌతిక కాయాన్ని పంచభూతాల్లో కలపడమని ఇంకొందరు వ్యాఖ్యానిస్తారు. అయితే బుద్ధుడు తన 80వ ఏట, శరీరం ఇక సహకరించక, జీర్ణక్రియలు మార్పులు చోటుచేసుకున్నాక పుట్టగొడుగుల ఆహారాన్ని లేదా పంది మాంసాన్ని పూర్తిగా జీర్ణించుకోలేక కన్నుమూస్తే ‘‘శాక్యవంశ’’ ఆచారం ప్రకారం బుద్ధుని శరీరానికి దహన సంస్కారాలు చేశారని చాలా మంది విశ్వసిస్తారు. బుద్ధుడు మరణించే సమయానికి బౌద్ధం విస్తృతి చెందలేదు. వౌర్య చక్రవర్తి అశోకుడు బౌద్ధ బోధనల పట్ల ఆకర్షితులయ్యాకనే జాతీయ- అంతర్జాతీయ స్థాయిలో ఆ ‘్ధర్మం’ విస్తరణ జరిగింది. అంటే బుద్ధుని మరణం అనంతరం 150 సంవత్సరాల తరువాతనే బౌద్ధ ధర్మవ్యాప్తి, విస్తరణ కనిపించింది. మరి బుద్ధుని దహన సంస్కారాలు ‘హిందూధర్మం’ మార్గదర్శనంలో జరిగాయా? లేక బుద్ధుని అనుచరులు వారికి తోచిన రీతిలో అంతిమ సంస్కారాలు చేశారా? ఈ అంశంపై అంత స్పష్టత లేదు. బుద్ధుని అస్తికలు, బూడిద వివిధచోట్ల స్తూపాల కింద నిక్షిప్తమై ఉన్నాయని బౌద్ధులు చెబుతారు. ఆయా ప్రాంతాలను పవిత్రంగా భావిస్తారు.
బుద్ధుని అస్తికలు, వెంట్రుకలు, అతనికి చెందిన మరికొన్ని వస్తువులు ఇతర దేశాల్లోనూ ఉన్నాయని చెబుతారు. అస్తికలు, పళ్లు, వెంట్రుకలు.. అతి పవిత్రంగా చూసే, చూపించే సంస్కృతి గత రెండు వేల సంవత్సరాలుగా కొనసాగుతోంది. అనేక మట్టి కలశాలు తవ్వకాల్లో బయటపడ్డాయని అంటారు.
బుద్ధుడు మరణించిన వంద, వంద యాభై ఏళ్ళవరకు బౌద్ధానికి ఆనాటి పాలకుల నుంచి గొప్పగా ఆదరణ లభించలేదు. జైనం, బౌద్ధం సమానంగా విస్తరిస్తున్న సమయమది. అంతకు పూర్వం వేల సంవత్సరాలుగా సనాతన (హిందూ) ధర్మం ఆచరణలో ఉండనే ఉంది. సనాతన ధర్మంలో శాఖలు సైతం కనిపిస్తాయి. ప్రజలు వారే.. పాలకులు వారే... ఇన్ని ధర్మాలను పోషించాలి.. వారి అవసరాలు తీర్చాలి.. ఆదరించాలి... దేవాలయాలు, ఆరామాలు, మఠాలకు మద్దతు తెలపాలి. కాబట్టి బౌద్ధ ధర్మానికి అంతంత మాత్రమే ఆదరణ కనిపించింది. ఒక దశలో జైనం వైపు ప్రజలు ఎక్కువ సంఖ్యలో మొగ్గు చూపారని, వారి జిన్నులను ఆదరించారని చివరికది ఉత్తర భారతం నుంచి దక్షిణ పథాన ఉన్న ఇప్పటి తెలుగు ప్రాంతాలకు ఆరోజుల్లోనే పాకిందంటే జైనం ఎలాంటి ప్రభావం చూపిందో తేటతెల్లమవుతోంది.
మగధ, వైశాలి, పాటలీపుత్ర తదితర రాజ్యాలు వౌర్యుల వశమయ్యాక, అశోకుడు కళింగ యుద్ధం చేశాక, అక్కడి బీభత్సాన్ని చూసి, చలించి మానసిక పరివర్తనతో, తనలోని రాజ్యకాంక్ష, యుద్ధపిపాసకు చరమ గీతం పాడి, ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అన్నాక బౌద్ధమతం విస్తృతి నల్లేరుపై నడకలా సాగింది. బౌద్ధాన్ని ఆయన అధికార మతంగా ప్రకటించారు. చివరికి అశోకుని సంతానం సైతం ఆ మత రాయబారులుగా దూర తీరాలకు వెళ్ళారు. బుద్ధునికి జ్ఞానోదయం కలిగినచోట గల రావిచెట్టు (బోధివృక్షం) కొమ్మను శ్రీలంకకు పంపి అక్కడ చెట్టుతో పాటు ఆ మతాన్ని వెళ్ళూనికునేలా చేశారు.
ఆగ్నేయాసియా దేశాలు.. శ్రీలంక, గాంధార దేశం, సిల్క్ రూట్ ద్వారా పర్షియా ప్రాంతాలకు బౌద్ధం భారీఎత్తున తరలినా... బుద్ధుని ఉంగరాల జుట్టు గల వర్ణ చిత్రాలు, విగ్రహాలు, ధ్యాన ముద్రలోని బుద్ధుని ప్రతిమలు పంపి కాషాయ వస్త్రాల ‘డ్రెస్ కోడ్’ సూచించి, కనుబొమలతో సహా తల జుట్టుపై వ్యామోహం వదులుకుంటే ‘చిత్తం’ ప్రశాంతంగా ఉంటుందని ప్రచారం చేసినా, ‘్ధ్యన’ అభ్యాసం చేయించినా మరి బుద్ధుని తలపై ఆ ఉంగరాల జుట్టు ఎందుకుంది?... అన్న ప్రశ్న ఎవరి మదిలో మెదలకపోవడం విడ్డూరం. ఓ ‘ట్రాన్స్’లోకి వెళ్ళిపోయి, బుద్ధ భగవానుడుని ప్రశ్నించడమా?... జ్ఞానోదయం కలిగి ఒక కొత్తమతం అందించిన వ్యక్తి తల జుట్టు గూర్చి మాట్లాడటమా?... అని ప్రజలు జంకి ఉంటారు? భయపడి ప్రశ్నించకపోయి ఉంటారు... లేదా ఆ విషయమే వారి దృష్టికి రాకపోవచ్చు. ఏది ఏమైనా ఇది సబబు కాదు, సమంజసం అసలే కాదు. ఆచరించి చూపే వాడే గురువు అన్న మాట చిరకాలంగా సమాజంలో వినిపిస్తోంది. మరి బుద్ధు
డు దాన్ని ఉల్లంఘించినట్టే కదా? ఇది ద్వైదీభావమే అవుతుంది కదా? ద్వంద్వ ప్రమాణమే కదా? ఆలోచించండి, బౌద్ధ అనుయాయులు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ప్రశ్న ఎప్పుడూ, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగం ప్రబలంగా చొచ్చుకుపోతున్న సమయంలో ఎంతో శక్తిమంతమైనది! కాదంటారా?

-వుప్పల నరసింహం 99857 81799