సబ్ ఫీచర్

చిరుతపైకి సివంగిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరుత తన బిడ్డను తీసుకెళుతుంటే తల్లిడిల్లిపోయింది ఆ తల్లి. ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ఆ చిరుతపైకి దూకింది. బిడ్డను ప్రాణాలతో దక్కించుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇరవై సంవత్సరాల దీపాలీది థోల్‌వాడ్ గ్రామం. పుణెకు తొంభై కిలోమీటర్ల దూరంలోని ఓట్టూరు సమీపంలో జున్నార్‌కు దగ్గరగా ఉండే గ్రామం థోల్‌వాడ్. ఇది చెరకు పండించే గ్రామం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూలీ కోసం చాలా కుటుంబాలు వలస వెళుతుంటాయి. అలా దీపాలీ భర్త దిలీప్, ఏడాదిన్నర కొడుకు థానేశ్వర్ మాలితో కలిసి పుష్పవతి నదీతీర ప్రాంతానికి చేరుకుంది. గత శనివారం బయట నిద్రపోతున్న దీపాలీకి అర్ధరాత్రి ఏదో చప్పుడు విని కళ్లు తెరిచి చూసింది. ఒక్కసారి నిర్ఘాంతపోయింది. ఎదురుగా చిరుత. ఆమె నోట్లో తన కొడుకు తల.. అంతే అపర కాళిలా మారిపోయింది. ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా చిరుతపైకి తెగబడింది. చేతిలో ఆయుధం ఉందా, లేదా అని కూడా చూసుకోలేదు. చేతులతో పులిని కొట్టడం ప్రారంభించింది. వెంటనే చిరుత బిడ్డను వదిలేసి దీపాలీపైకి దూకింది. దీపాలీ దాన్ని కొడుతూ గట్టిగా అరవడం ప్రారంభించింది. ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లందరూ అక్కడకు చేరుకున్నారు. వారి చూసిన చిరుత భయపడి దీపాలీని వదిలేసి అడవిలోకి పారిపోయింది. చిరుత దాడిలో పిల్లాడి తలకు గాయమైంది. దీపాలీ చేతులకు బాగా గాయాలయ్యాయి. ఈ గాయాల బాధ కంటే ప్రాణాలకు తెగించి బిడ్డను కాపాడుకున్న ఆనందమే ఎక్కువగా ఉంది దీపాలీకి. ఇప్పుడు ఆ తల్లీకొడుకులిద్దరూ యస్వంత్రోఛావన్ మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.