సబ్ ఫీచర్

మేకప్‌తో మాయ చేసేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేకప్ ద్వారా డైగ్నల్ లైన్ ఆకృతిలో షేడ్స్ వేయడం ద్వారా బుగ్గలు సన్నగా ఉన్నాయనే భ్రాంతిని కలిగించవచ్చు. మేకప్‌తో కళ్లను పెద్దగా కనిపించేలా చేయడం ద్వారా మిగిలిన ముఖం చిన్నదిగా కనిపిస్తుంది. ఇలా మేకప్ ద్వారా సాధ్యమే.. అందుకే మేకప్ లేకుండా ప్రముఖుల ఫొటోలను చూస్తే మనం ఆశ్చర్యానికి గురవుతాం. ఇంతలా కాకున్నా ఇంట్లో పాటించే చిన్న చిన్న చిట్కాల ద్వారా ముఖాన్ని సన్నగా, అందంగా కనిపించేలా మార్చుకోవచ్చు.
* చర్మం రంగుకన్నా ఎక్కువ రంగులో ఒకటి లేదా రెండు కాంటూర్ రంగులు లేదా మాట్ బ్రోంజర్ షేడ్స్‌ను.. ఒంటి రంగు కంటే తక్కువగా ఉండే హైలైటర్స్‌ను ఎంచుకోవచ్చు.
* మేకప్‌లలో క్రీమ్ లేదా పౌడర్స్‌లను ఏదైనా ఎంచుకోవచ్చు. లేదా రెండింటి కలయికను కూడా ఎంచుకోవచ్చు. వీటిని ఉపయోగించే ఫార్ములాతో సంబంధం లేకండా, మేకప్ బ్రష్‌ను ఉపయోగించి సరిగ్గా కలపాలి. ఎందుకంటే చారలుగా వచ్చే కాంటౌర్ మేకప్ అందంగా రాకపోవడానికి ఒక ప్రధాన కారణమవుతుంది.
* చెంపను కేంద్రంగా చేసుకుని చెవికి పైన డైగ్నల్ లైన్‌లో కాంటౌర్ షేడ్స్‌ను వేయాలి. సెల్ఫీస్ దిగేటప్పుడు ముఖం ఎలా పెడతారో అలా బుంగమూతి పెట్టడం ద్వారా చెంపపై షేడ్స్ వేయడానికి ఒక ఖచ్చితమైన స్థలాన్ని గుర్తించవచ్చు, వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. కాంటౌర్ షేడ్స్‌ను ఎక్కువగా వేసుకోవడం వల్ల దవడ ఎముకలు పదునుగా కనిపిస్తాయి. దవడ ఎముకల పైభాగమంతటా హైలైటర్‌ను స్వైప్ చేస్తూ కాంటౌర్ బయటకు తీసుకురావాలి.
* ముక్కు సన్నగా కనిపించడానికి ముక్కు మధ్య భాగం వంతెనకు ఇరుపక్కల కాంటౌర్ పౌడర్‌ను దిగువకు స్వైప్ చేయాలి. దీనిని ముక్కు పుటాల వద్ద ఆపేయాలి. ముక్కు మధ్య భాగ వంతెనపై హైలైటర్‌ను దిగువవైపుకు వేయాలి.
* పదునైన గవద భాగం కోసం ఆ ప్రాంతం మొత్తం బ్రోంజర్‌ను వేసుకోవాలి. కాంటౌర్ షేడ్ అతుకులు లేకుండా రావడానికి మిశ్రమాన్ని సరిగా కలపాలి.
* కళ్లు, కనుబొమ్మలను హైలైట్ చేయాలి. కళ్లను ఐ లైనర్, షాడో, మస్కారాలతో పెద్దగా చేయడంతో ముఖం చిన్నగా కనిపిస్తుంది. అలాగే ముఖం నిండుదనాన్ని సమతుల్యం చేయడానికి కనుబొమ్మల వంపు అధికంగా ఉండేట్లు చేయాలి.
* పెదవులు లావుగా ఉంటే ముఖం నిండుగా కనిపిస్తుందని ఉద్ఘాటించి చెప్పచ్చు. పెదవులు సహజంగా కనిపించేలా లేతరంగు టామ్ లేదా గ్లోస్ పెట్టుకుని వదిలేయాలి.
* ముఖం మధ్య భాగాన్ని, కనుబొమ్మల మధ్య భాగాన్ని ముక్కు మధ్య భాగాన వంతెన లాంటి ప్రాంతాన్ని, ఎగువ పై పెదవి భాగాన్ని, గవద భాగాన్ని హైలైట్ చేయాలి. ఇది ముఖం వెడల్పు తక్కువగా కనిపించేలా చేస్తుంది.
* తరువాత నుదురు, కళ్లు, చెవులు మధ్య గల స్థలంలో కలిపి ఉంచిన కాంటౌర్ షేడ్స్‌ను వేయడం మరిచిపోకూడదు. ఇలా చేయడం వల్ల ముఖం చిన్నగా ఉండి అందర్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తారు. *