సబ్ ఫీచర్

దివ్యపథానికి దారి ప్రేమ! ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా, అలా మీ మనసు మీకు రోజూ దూరమవుతూ, ఏదో ఒకరోజు పూర్తిగా అదృశ్యమవుతుంది. అప్పుడు మీరు మీ శరీరానికో, మరేదానికో పరిమితమై పోకుండా, నిర్మలమైన సువిశాల విశ్వంగా మారతారు. అలా మారడమే దివ్యత్వాన్ని సంతరించుకోవడమంటే. దానికి మార్గం, మాధ్యమం కేవలం ప్రేమ ఒక్కటే. ఆ దారి చివరిలో దేవుడుంటాడు. నిర్మలమైన, అనంతమైన, సువిశాల విశ్వతత్వమే దేవుడంటే.
భయపడే వ్యక్తులకు అద్భుతంగా ప్రేమించే సామర్థ్యముంటుంది. ఎందుకంటే, ప్రేమకు ప్రతికూల రూపమే భయం. కాబట్టి, ప్రేమ ప్రవాహాన్ని మీరు నిరాకరిస్తే అది భయంగా మారుతుంది. అంగీకరిస్తే ఆ భయం మీనుంచి పూర్తిగా అదృశ్యమవుతుంది. ప్రేమించే సమయంలో ప్రేమికులకు ఎలాంటి భయాలు ఉండవు. అందుకే వారు మృత్యువు ఎదురైనప్పుడు కూడా నిర్భయంగా, నిశ్శబ్దంగా మరణించగలరు.
మీరు ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా భయపడడం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. నిజానికి, ప్రేమించే సామర్థ్యం స్ర్తిలకు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పురుషులకన్నా స్ర్తిలే ఎక్కువ భయపడతారు.
మీ ప్రేమను నిజంచేసుకునే అవకాశాలు ఈ ప్రపంచంలో చాలా తక్కువ. అందుకే అది మిమ్మల్నే పట్టుకుని మీచుట్టూ వేలాడుతూ వెనక్కితిరిగి అసూయగా, స్వాధీనతాభావంగా, చివరికి ద్వేషంగా కూడా మారుతుంది. అయితే అవన్నీ మీ భయంలోని భాగాలే. మీరు ఎలాంటి నిబంధనలులేని ప్రేమతో, వీలైనన్ని మార్గాలలో అత్యధికంగా ప్రేమిస్తూనే ఉండండి. ప్రేమించేందుకు అనేక లక్షల మార్గాలున్నాయి. మీ దారిలో ఎదురైన అపరిచితుడికి కూడా ఎలాంటి కారణం లేకుండా మీరు ప్రేమించగలరు. ఈ విషయాన్ని మీరు అతనితో చెప్పకపోయినా పరవాలేదు, చెప్పవలసిన అవసరమూ లేదు. మీలో ఆ ప్రేమ భావన ఉంటే చాలు. అలాగే మీరు చెట్లను, పక్షులను, జంతువులను, ఆకాశాన్ని, నక్షత్రాలను, తల్లిని, తండ్రిని, స్నేహితుడిని, భార్యను, భర్తను-ఇలా అందరిని, అన్నింటిని అనేక లక్షల మార్గాలలో ప్రేమించగలరు.
కేవలం భయం లేనంత మాత్రాన ధైర్యమున్నట్లు కాదని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. భయం లేని వ్యక్తిని ధైర్యవంతుడు అనలేము. యంత్రాలు భయపడవు. అంతమాత్రాన వాటికి ధైర్యముందని చెప్పలేము కదా! ధైర్యం ఒక చిన్న దీవిలా భయమనే సముద్రంలో మాత్రమే ఉంటుంది. లోపల భయమున్నప్పటికీ ప్రమాదానికి ఎదురు నిలవడమే ధైర్యమంటే.
ఎవరైనా చీకటిలోకి అడుగుపెట్టేందుకు భయపడతారు. అయినా కొందరు ఒకపక్క భయపడుతూనే చీకటిలోకి అడుగుపెడతారు. ధైర్యమంటే అదే. అంత మాత్రాన మీకు భయంలేదని కాదు. లోపల మీకు చాలా భయముంటుంది. అయినా మీరు దాని గుప్పిట్లో చిక్కుకోరు.
మీరు ప్రేమలోకి అడుగుపెట్టగానే అతిపెద్ద సమస్య తలెత్తుతుంది. వెంటనే భయం మిమ్మల్ని ఆక్రమిస్తుంది. ఎందుకంటే, ప్రేమించడమంటే ప్రేమలో మరణించడమే. అది మామూలు మరణంకన్నా ఘోరమైనది. ఎందుకంటే, మామూలు మరణంలో కేవలం శరీరంమాత్రమే నశిస్తుంది. కానీ, ప్రేమలో మరణిస్తే మీ అహం పూర్తిగా నశిస్తుంది.
కాబట్టి, ఎన్ని సమస్యలెదురైనా, ఎన్ని భయాలు చుట్టుముట్టినా, ఎన్ని ప్రమాదాలెదురైనా ‘ప్రేమలోకం’లోకి అడుగుపెట్టాలంటే ఎవరికైనా చాలా దమ్ములుండాలి. ఆ ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉంటే మీ ఎదుగుదల కూడా అంతతీవ్రంగా ఉంటుంది.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.