సబ్ ఫీచర్

ఎండల్లో హాయ్.. హాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలు మండే వేళ.. హాయినిచ్చే కాటన్ దుస్తులు భలే సౌకర్యంగా ఉంటాయి. అయితే నేటితరం మహిళలు సౌకర్యంతో పాటు కొత్తదనాన్ని కూడా కోరుకుంటూ ఉంటారు. అందుకే చేనేత వారు కొత్త చేవ తెచ్చుకుని సంప్రదాయ వస్త్రశ్రేణిలోనే కాదు, ట్రెండీగానూ రకరకాల దుస్తులను డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా చేనేతలో వెస్ట్రన్, ఫ్యూజన్ వేర్‌ల ట్రెండ్ నడుస్తోంది. యువత కూడా ఎక్కువగా వీటినే ఎంచుకుంటున్నారు. రోజువారీ వాడకంతో పాటు పెళ్లిళ్లు, విందులు, విహారయాత్రలు.. ఇలా ఒకటేమిటి.. అన్ని సందర్భాలకూ అనుకూలంగా ఉండే వివిధ రకాల కాటన్‌లు కొలువుతీరుతున్నాయి. చేనేతతో పాటు నూలు, లెనిన్, పోచంపల్లి ఇకత్, మంగళగిరి, పొందూరు, గద్వాల్.. ఇలా ఒకటేమిటి? ప్రాంతానికో ప్రత్యేకత, నేతకో శైలితో కాటన్ డ్రెసెస్ ఆకట్టుకుంటున్నాయి. ఈ వస్త్రశ్రేణి కొత్త కొత్త హంగులు అద్దుకుని కనికట్టు చేస్తోంది. చేనేత రకాలు నేటితరంలో.. ఆడంబరాన్నీ, హుందాతనాన్ని కలగలిపి మెప్పిస్తున్నాయి. ఇవి రకరకాల సందర్భాలకు నప్పేలా కొత్త కొత్త డిజైన్లలో మార్కెట్లో కొలువు తీరుతున్నాయి. నేటితరం అమ్మాయిలు కూడా సీజన్‌ను అనుసరించి కొత్త కొత్త ఫ్యాషన్లలో ట్రెండీగా, సౌకర్యంగా ఉండే దుస్తులనే ఎంచుకుంటున్నారు.
* కాలేజీ అమ్మాయిలు ఏది కట్టుకున్నా కొత్తగా కనిపించాలనుకుంటారు. ఇలాంటివారికి చేనేత కొత్తందాలను తెచ్చిపెడుతోంది. వాటిల్లో ఇప్పటి ఫ్యాషన్ అయిన ఇకత్‌దే హవా. బోట్‌నెక్, కాలర్డ్‌నెక్ వంటి రకరకాల్లో కుర్తీలను కుట్టించుకుంటే ఆ అందమే వేరు. అలాగే బోట్‌నెక్, కాలర్డ్‌నెక్ జాకెట్లను కూడా కుట్టించుకుని దానిపై కాటన్ చీరను సొగసుగా కట్టుకోగలిగితే ఆ అందమే వేరు.
* బొద్దుగా ఉండేవారు చేనేత, నూలు వస్త్రాలు కట్టుకుంటే కాస్త లావుగా కనిపిస్తాము అనుకునేవారికి రాజస్థాన్ కోటా చీరలు బాగుంటాయి. వీటి నేత పలుచగా ఉండటమే ఇందుకు కారణం.
* కాటన్‌తో ర్యాప్ ర్యాంగ్ స్కర్టులూ, పలాజోలు, కుర్తీలు, జంప్‌సూట్లు వంటివి కుట్టించుకోవచ్చు. ఇకత్‌లో మెర్సిడైజ్డ్ కాటన్, కాటన్ సిల్క్, మంగళగిరి నూలు, కలంకారీ ప్రింట్లు, ఖాదీ వస్త్రాన్ని కూడా కుర్తీలు, స్కర్టులు, టాప్‌లుగా కుట్టించుకోవచ్చు.
* పార్టీవేర్‌గా చేనేత వస్త్రాన్ని ఎంచుకున్నట్లయితే పెద్దంచు డిజైన్‌లు, వాటికి కాంట్రాస్ట్ దుప్పట్టా, ప్రత్యేకమైన జాకెట్‌ను ఎంచుకున్నట్లయితే అందరూ అద్భుతః అనక మానరు. పార్టీలో మీరే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచిపోతారు.
* నేడు లెనిన్ చీరలు ఆహ్లాదకరమైన రంగుల్లో సందడి చేస్తున్నాయి. ఇవి ఆఫీసులకు కూడా హుందాగా ఉంటాయి.
* కాలేజీ అమ్మాయిలు, వయసులో చిన్నవారు చేనేత చీరలు ఎంచుకునేటప్పుడు సింగిల్ బార్డర్‌లో కాకుండా మల్టీకలర్‌లో ప్రయత్నించొచ్చు.
* హ్యాండ్‌లూమ్ డ్రెస్‌లు, చీరలు కూడా హాయిగా ఆనందంగా ఉంటాయి. వీటిపైకి బ్లాక్ ప్రింట్‌లు చాలా బాగుంటాయి.
* ఇకత్, కలంకారీ, మధుబనీ, టై అండ్ డై వంటి వాటిని హ్యాండ్‌లూమ్ కాటన్‌పై వేయించుకుని డ్రెస్‌లు కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. నేటితరం అమ్మాయిలు వీటినే ఇష్టపడుతున్నారు.
* కాటన్ సిల్క్ డ్రెస్‌పై టిష్యూ డిజైన్‌ను వేయించుకుని చిన్న చిన్న విందులకు వేసుకోవచ్చు. దీనికంటే కాస్త భిన్నంగా కనిపించాలనుకుంటే మల్‌కాటన్, మంగళగిరి నేత వస్త్రాలపై బ్లాక్ ప్రింట్ వేయించుకుని కూడా వేసుకోవచ్చు.
* కొంతమంది తేలిగ్గా గాల్లో తేలిపోయినట్లు, మెత్తగా, పలుచగా ఉండే జార్జెట్లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటివారు త్రెడ్‌వర్క్, పెద్ద పెద్ద పూలు, ఆబ్‌స్ట్రాక్ట్ డిజైన్లను ధరిస్తే అందంగానే కాకుండా ఆహ్లాదకరంగా కూడా ఉంటారు.
* కంచి కాటన్ చీరల్ని ఎంచుకునేటప్పుడు దానితో పాటు మరో చేనేత రకాన్ని కూడా కలిపితే అందంగా ఉంటుంది.
* పటోలా వస్త్రంతో పరికిణీ రూపొందించినా, స్ట్రెయిట్‌కట్ ప్యాంటులా కుట్టించుకున్నా చాలా బాగుంటుంది. అలాగే ఇకత్‌తో లాంగ్ స్కర్ట్స్ మతులు పోగొడతాయి.
* ఇప్పుడు రా సిల్క్ ట్రెండ్ నడుస్తోంది. ప్యూర్ రా సిల్క్ క్రాప్‌టాప్‌గానూ, బ్లవుజ్‌గానూ కూడా మెప్పిస్తుంది.
* పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు చేనేతను ఎంచుకునేట్లయితే బార్డర్ లేని చీరల్ని ఎంచుకోవాలి. ఇప్పుడదే ఫ్యాషన్ కూడా. బార్డర్ లేకపోయినా కొంగు భారీగానే కనిపిస్తుంది. కాబట్టి కాస్త హెవీ వర్క్‌తో రూపొందించిన జాకెట్ అయితే సరిగ్గా సరిపోతుంది. వీటికి నప్పేలా నగలు కూడా ఎంచుకుంటే చూసేవాళ్లు అవాక్కవ్వాల్సిందే..
* చీరలే కాదు పరికిణీ ఓణీలకు, క్రాప్‌టాప్‌లకు ఇప్పుడు గద్వాల్ రకాలు బాగుంటాయి. వీటిపైకి బాందిని, లెహేరియా, కోటా రకాల్లో ఓణీలు వావ్ అనిపిస్తాయి. మరెందుకాలస్యం వేసవిలో మీకు నచ్చిన రకాన్ని ఎంచుకుని పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో హాయిగా, ఆనందంగా మెరిసిపోండి మరి!