సబ్ ఫీచర్

‘ఐపీఎల్ మత్తు’ వదలాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్ద కాలానికి పైగా మన దేశంలో ఏటా వేసవిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పేరిట క్రికెట్ పోటీలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ ధోరణి దేశీయ ఆటలపైన, క్రీడా సంస్కృతిపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వివిధ నగరాలలో దాదాపు 45 నుండి 50 రోజులపాటు ఈ పోటీలను చూసేందుకు చిన్నా పెద్దా అనే తేడాలేకుండా ఎగబడి టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నో ఘనవిజయాలు సాధించినప్పటికీ ఇతర క్రీడాకారులను పట్టించుకోకపోవడం దారుణం.
‘కొడితే ఫోర్.. లేదంటే సిక్సర్.. ప్రతి బంతి కూడా గాలిలో తేలాల్సిందే.. నరాలు తెగే ఉత్కంఠ. ఒక్క బంతిలో ఫలితం మారిపోయే మ్యాచ్‌లు. చీర్‌గర్ల్ చిందులు, బంతి బంతికీ బెట్టింగ్‌లు.. ఈ జూదంలో లక్షలు, కోట్లు కోల్పోయే జనం. కాంప్లిమెంటరీ పాస్‌లకు ఎగబడే రాజకీయ, చిత్రరంగ ప్రముఖులు, వివిధ హోదాలలో ఉండే అధికారులు, క్రీడారంగం సెలబ్రిటీలు. ఐపీఎల్ మ్యాచ్‌లను చూడకుంటే ఏదో కోల్పోయినట్లు భావించడం, క్రికెట్ మాత్రమే ఏకైక క్రీడ అన్నట్లుగా వ్యవహరించడం బాధాకరమైన అంశం.
నిజమైన క్రీడాస్ఫూర్తిని ఐపీఎల్ దెబ్బతీస్తోంది. అన్ని క్రీడల్లానే క్రికెట్‌కు ఆదరణ ఉండాల్సిందే కాని మ్యాచ్‌లను వ్యాపార వస్తువుగామార్చి తమ మార్కెట్ విస్తరణకు ఒక సాధనంగా కార్పొరేట్ సంస్థలు క్రికెట్ వ్యామోహాన్ని ప్రజల్లోకి ఎక్కిస్తున్న వైనాన్ని, తద్వారా జరుగుతున్న పరిణామాలన్నింటిపైన క్రీడారంగ మేధావులు దృష్టిసారించాలి. ఐపీఎల్ చాలామంది ఔత్సాహిక క్రికెట్ క్రీడాకారులకు అవకాశాలు కల్పించింది. యువ క్రికెటర్లకు భవిష్యత్ ఇచ్చింది. మరెంతో మందికి ఉపాధి ఇచ్చింది. సంతోషమే! కాని అదే సమయంలో ఈ మ్యాచ్‌లకు సంబంధించి పరిమితులను అదుపులోపెట్టాలి.
ప్రపంచంలో అతిపెద్ద క్రీడల పండుగ ఒలింపిక్స్. వందలాది దేశాలు వివిధ క్రీడాంశాలలో పాల్గొనే ఈ పోటీలలో మనం ఏ స్థానంలో ఉంటున్నామో గమనించాలి. ఒలింపిక్స్‌లో చాలా క్రీడాంశాలలో కనీసం అర్హత కూడా సంపాదించలేని స్థితి! బ్రెజిల్ ఒలింపిక్స్‌లో పి.వి.సింధు సాధించిన రజత పతకం తప్ప మరొక పతకం మనకు దక్కలేదు. 2018లో గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో మూడోస్థానంలో నిలిచాం. జనాభా ప్రతిపాతిపదికన కామన్‌వెల్త్ దేశాలన్నింటిలోనూ అతి పెద్ద దేశం మనది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్రతిసారి అగ్రస్థానానికి పోటీపడుతుంటే మనం ఇప్పటివరకు ఒక్కసారి కూడా అగ్రస్థానంలో నిలవలేక పోతున్నాము.
జాతీయ క్రీడల మంత్రిత్వశాఖ, వివిధ రాష్ట్రక్రీడాశాఖలు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. శిక్షణ కేంద్రాలు, శిక్షకులు, క్రీడా సామాగ్రి, క్రీడా పోటీల పేరిట పెడుతున్న ఖర్చుకు, సాధిస్తున్న ఫలితాలకు పొంతన లేదు. రాబోయే ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, వివిధ ప్రపంచ స్థాయి పోటీల్లో ఎక్కడెక్కడ మనకు అవకాశాలు ఉన్నాయి? ఏ అంశాలపై దృష్టి సారించాలి? అనే విషయాలపై సమీక్ష కూడ లేదేమో అనిపిస్తుంది. కనీస కార్యాచరణ కూడా లేదనిపిస్తుంది. ముందుగానే దృష్టి సారించి పతకాల సాధనే ధ్యేయంగా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందాలి. పాఠశాల స్థాయి నుండే క్రీడలకు రోజువారీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలి. పాఠ్యాంశాల్లో క్రీడాంశాలను జోడించాలి. నిర్బంధ వ్యాయామ విద్య తప్పనిసరి. పాఠశాలల్లో క్రీడాసదుపాయాలు తప్పనిసరి చేస్తూ నిబంధనలు ఉండాలి. ఐపీఎల్ మత్తులో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పిల్లలు ఆ మ్యాచ్‌ల గురించి చర్చిస్తుంటే పొంగిపోవడం కాదు. క్రికెట్ మాత్రమే క్రీడ కాదు అనే ఆలోచన రావాలి. మన దేశంలో సమగ్ర క్రీడాభివృద్ధికి ప్రణాళికలు లేవనే విషయాన్ని బాధకరమైనా ఒప్పుకోక తప్పదు. పతకాలు సాధించిన తర్వాత నజరానాలు ప్రకటించడం కాదు, పతకాలు సాధించేలా ప్రోత్సాహకాలు ఇచ్చేలా క్రీడావిధానాలు రూపొందించాలి.
గ్రామీణ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ, జిల్లాస్థాయిల్లో రాణించిన వారు రాష్టస్థ్రాయిలోకి వెళ్లలేని స్థితిని గమనించాలి. ఐపీఎల్ పేరిట మన దేశంలో చొరబడ్డ దుష్టసంస్కృతి ఇతర క్రీడాంశాలపై విష ప్రభావాన్ని చూపుతోంది. ఈ పరిస్థితి నుండి మనం బయటపడాలి. ప్రపంచంలో ఏ మూల క్రీడాపోటీలు జరిగిన మన జాతీయ జెండా రెపరెపలాడాలి. మన జాతీయ గీతం మారుమోగాలి. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచనలు చేయాలి.

-సురేష్ కాలేరు