సబ్ ఫీచర్

సర్వేల ప్రభావం ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకానొక సర్వే ప్రకారం ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందనే వార్త ప్రధాన పత్రికలలో బ్యానర్‌గా వస్తుంది. మరుసటిరోజున- ఇంకో పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని మరో సంస్థ సర్వే ఫలితాలు ప్రధానంగా వస్తాయి. జాతీయ మీడియా సంస్థలుగా పేరున్న సంస్థల పేరిట వచ్చే సర్వేలు, వాటి ఫలితాల్లో గందరగోళ పరిస్థితులు ఉండటం వల్ల ఆయా సంస్థల విశ్వసనీయతపై జనంలో సందేహాలు నెలకొంటున్నాయి.
ఎలాంటి పొంతన లేకుండా, ఫలితాలను అయోమయంగా అంచనా వేసి ఈ పార్టీకి ఇన్ని సీట్లు, ఆ పార్టీకి అన్ని సీట్లు అంటూ కొన్ని సంస్థలు ప్రకటిస్తున్న ఫలితాలు, తద్వారా జరుగుతున్న ప్రచారాలు కొంత అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. సామాజిక మాధ్యమం విస్తృతి పెరిగి గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రతి ఒక్కరికి స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడం, తామర తంపరగా నెట్‌లోనూ చానళ్లు పెరగడం, వాటి మధ్య పోటీ పెరిగింది. కొన్ని వెబ్ చానళ్లు, యూ ట్యూబ్ చానళ్ళు మసాలా జోడించి మరీ సొంత వ్యాఖ్యానాలు చేయడంతో కొంత గందరగోళానికి దారితీస్తున్నాయి.
అభ్యర్థులెవరన్నది తెలియక ముందే ఫలానా నియోజకవర్గంలో ఫలానా పార్టీ గెలుస్తుందని, సిట్టింగ్ అభ్యర్థి ఓడిపోతున్నాడని నియోజకవర్గాల పేర్లతో సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సర్వే టిఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తాయంటే, మరొక సర్వే కాంగ్రెస్ 70 సీట్లు వస్తాయని ‘ఫలితాల’ను తేల్చేయడం తెలిసిందే. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తాను చేయించిన సర్వేలో టిఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తాయని చెప్పగా, తాము చేయించిన సర్వేలో మహాకూటమికి 70-80 సీట్లు ఖాయమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢంకా భజాయించి మరీ చెప్పారు. ఈ సందర్భంగా ఒక జాతీయ మీడియా సంస్థ పేరిట పత్రికల్లో వచ్చిన సర్వే వివరాలు చూస్తే ఎంత బాధ్యతారహితంగా, కనీస అవగాహన లేకుండా సర్వే ఫలితాలు ప్రకటించారో అర్థమవుతుంది.
119 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 125-130 స్థానాలకు ఫలితాలను ప్రకటించారు. మీడియా పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లే విధంగా హడావుడిగా, ఏదో ఆశించి ఫలితాలు ప్రకటించినట్లు అర్థమవుతుంది. ‘లగడపాటి సర్వే’ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత అయోమయాన్ని సృష్టించిందో, చివరికి ఫలితం ఎలా వచ్చిందో మనమందరం చూశాము.
బాధ్యత కలిగిన మీడియా సంస్థలు కాకిలెక్కలు చెప్పడం ఎంతవరకు సమంజసం? తమకు నచ్చిన పార్టీకి కొమ్ముకాయడం కోసం ఎవరికి తోచిన విధంగా వారు సర్వే వివరాలు ప్రకటించడం సరికాదు. అయినా ఎవరు అడిగారు వీళ్ళను సర్వేలు చెయ్యమని? ఫలితాలు ప్రకటించమని?
వివిధ మీడియా సంస్థలు విభిన్న రకాలుగా సర్వే చేస్తాయి. ఎవరికి తోచినట్లుగా వారు సర్వే జరిపించి, ఇష్టారీతిన ఫలితాలు ప్రకటించి ప్రజలను గందరగోళ పర్చాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి విఘాతకరం. సర్వేల పేరిట ప్రజలపై తమ సొంత అభిప్రాయాలు రుద్దేందుకు ‘్థట్ పోలీసింగ్’ విధానం సమంజసం కాదు. రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు ఒక్క విషయాన్ని గమినించాలి. ప్రజలు తాము ఎవరికి ఓటు వేయాలనే విషయంలో స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారు. వారి అభిప్రాయాన్ని సర్వేలు మార్చలేవు. ప్రతిష్టాత్మక జాతీయ మీడియా సంస్థలు చేసిన అంచనాలు సైతం తలకిందులయ్యేలా ఓటర్లు తీర్పు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఓటర్లను సర్వేలు ప్రభావితం చేయలేవని పలుమార్లు స్పష్టమైంది.
-స్నేహిత గుణ