సబ్ ఫీచర్

ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మానిదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారత యుద్ధం ప్రారంభం కాబోయే ముందు కౌరవ పక్షంలోని అతిరథ మహారథ యోధులందరూ భీమార్జునులను సంహరించటానికి అనేక అస్తశ్రస్త్రాలు, దేవతల వరాలు పొంది ఉన్నాము. కనుక భయపడవద్దని వారు దుర్యోధనుడికి భరోసా ఇచ్చారు. యుద్ధంలో విజయం కోసం ప్రయత్నించకుండా తమ దృష్టి అంతా భీమార్జునులమీదనే కేంద్రీకరించడం మూలంగా తమ ఓటమికితామే కారకులయ్యారు. పాండవ పక్షంలోని రాజులు సామాన్య వీరులయినా కలసికట్టుగా ధైర్యసాహసాలతో పోరాడి కౌరవులపై విజయం సాధించారు. ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల రణరంగాన్ని గమనిస్తే ఈ విషయం గుర్తుకువస్తుంది.
ప్రతిపక్ష కూటములలోని ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ భారతీయ జనతాపార్టీలోని ఇతర రాజకీయ నాయకులను వదిలి కేవలం నరేంద్ర మోదీ, అమిత్‌షాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని తమ విమర్శనాస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వీరిద్దరినీ కట్టడి చేస్తే ఇక భాజపా పని అయిపోయినట్లే అని పగటికలలు కంటున్నారు. ‘దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది. నరేంద్ర మోదీ పాలనలో మైనారిటీలకు రక్షణ కరవైంది. మతతత్వం నానాటికీ పెరిగిపోతోంది.’ అని తమ నోటికివచ్చిన ఆరోపణలను ప్రతిపక్ష సభ్యులు చిలకపలుకులుగా పలుకుతున్నారు.
పెద్దనోట్ల రద్దువల్ల కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పటికీ దీర్ఘకాలంలో మంచి ఫలితాలు కలిగాయి. ఎన్నో డొల్ల కంపెనీల బండారాలు బయటపడి ప్రజల ధనం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఉగ్రవాద చర్యలకు నిధులు దొరక్క ముష్కరమూకలు తోకలు ముడుచుకొని పారిపోయాయి. జీఎస్టీ వల్ల దేశమంతా ఒకే విధమైన పన్ను విధానం అమలులోకి రావడంతో దళారుల దోపిడీలు తగ్గి ప్రజలకు ఊరట కలిగి తక్కువ ధరలకే వినియోగదారులకు సేవలు అందుతున్నాయి. గత ఐదేళ్ళుగా జనధన్, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా మొదలైన పథకాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాలలోకి డబ్బు జమకావడంతో కోట్లాదిమంది లబ్ధిపొందారు. భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిధుల దుర్వినియోగంపై ఎలాంటి అభియోగాలు లేవు. నరేంద్ర మోదీ 15 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా పని చేసినా ఆయనపై ఒక్క కుంభకోణానికి సంబంధించి కూడా ఆరోపణలు రాలేదు. ఆయనకు ఎలాంటి అక్రమ ఆస్తులు గాని, అక్రమ సంపాదన గాని లేవు. కనీసం ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా తన కర్తవ్యాన్ని చేస్తున్న నిజాయితీగల వ్యక్తి. తన కుటుంబం వారికి కాని, తన బంధువులకు కాని ఎటువంటి ప్రభుత్వ పనులను అప్పగించని నిస్వార్థ నాయకుడు నరేంద్ర మోదీ.
ఇక, ప్రతిపక్ష కూటములలోని ముఖ్య రాజకీయ నాయకులు అందరూ ఏదో ఒక కుంభకోణంలో చిక్కి ఉన్నవారే. వారిలో కొందరు కోర్టుల చుట్టూ తిరుగూ ముందస్తు బెయిల్‌పై ఉన్నవారు, మరికొందరు దోషులుగా నిరూపించబడి జైలుశిక్షలు అనుభవించినవారు. విపక్ష నేతల్లో చాలామందికి ప్రధానమంత్రి పదవిపై వ్యామోహం తప్పితే పరిపాలనను నీతిగా, నిజాయితీగా అందించాలనే తపన లేదు. అత్యాశతో, దుర్భుద్ధితో తెలివితక్కువ ఆరోపణలు, ప్రకటనలు చేసి ప్రజల దృష్టిలో విపక్ష నేతలు నానాటికీ చులకనైపోతున్నారు.
రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో అసత్య ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు రాఫెల్‌పై ఇచ్చిన క్లీన్ సర్ట్ఫికెట్ చంపపెట్టుగా తగిలింది. అయినా కిమ్మనకుండా ఉండకుండా ప్రధానమంత్రి మాట్లాడే ప్రతి మాటకు విపరీత అర్థాలను అంటగడుతూ తన హుందాతనాన్ని ప్రజలవద్ద రాహుల్ తక్కువ చేసుకొంటున్నాడని అనిపిస్తున్నది. రెండు సర్జికల్ స్ట్రైక్‌తో పాకిస్థాన్‌కు బుద్ధిచెప్పి, వైమానిక దాడులతో బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ శిక్షణ శిబిరాన్ని ధ్వంసం చేయటాన్ని ప్రతిపక్ష నేతలు జీర్ణించుకోలేని ప్రభుత్వ విజయం. ప్రతి దాడులకు ఆధారాలు చూపించమని అడుగుతున్న ప్రతిపక్ష నేతలైన మమతాబెనర్జీ, చంద్రబాబు మన సైన్యం వీరోచిత పోరాట పటిమను తక్కువచేసి మాట్లాడుతున్నట్లు అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. ఇది చాలా శోచనీయం. పూల్వామా దాడిలో 42 మంది సీఆర్‌పీఎఫ్ జవానులు దుర్మరణం పొందడం ఒక మానవ తప్పిదంగా పరిగణించాలని కొత్తకోణంలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మానసిక ఆరోగ్య విషయంలో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి.
నాలుగున్నర సంవత్సరాల పాటు ఏపీకి ప్యాకేజి ముద్దు.. ప్రత్యేక హోదా వద్దు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ నరేంద్ర మోదీ వెంట తిరిగిన చంద్రబాబు యూటర్న్ తీసుకొని, ప్రధాని మోదీ ఎందుకూ పనికిరానివాడని బాకా ఊదటంలో ఆంతర్యాన్ని జనం గ్రహించాలి.
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు పనిచేసినంత కాలం మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు తమ మద్దతును రాజకీయ డ్రామాగా చూపుతూ, కోట్ల రూపాయలు సంపాదించి కశ్మీర్‌ను భారతదేశానికి బూచిలా చూపించడంలో సఫలీకృతులయ్యారు. ఇప్పుడు కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది కనుక దిక్కుతోచక చేతులుకట్టుకొని చతకిలబడ్డారు. ఏవైనా ఉగ్రవాద కార్యకలాపాలు, మతవిద్వేషాలు జరిగితే వాటిని నివారించటానికి బదులు తమ పలుకుబడిని, ప్రాముఖ్యతను పెంపొందించుకోవటానికి తమవంతు విష పూరిత వ్యాఖ్యలను ఆజ్యంగా పోస్తూ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా అయ్యప్పస్వామి ఆలయ సనాతన సాంప్రదాయాలకు విరుద్ధంగా హిందూ సంప్రదాయాలను నాశనం చెయ్యటానికి కంకణం కట్టుకొన్నారు. వేల మంది హిందూ ధర్మపరిరక్షకులను అంతమొందిస్తూ హత్యారాజకీయాలకు పాల్పడుతున్నాడు. ప్రకృతి బీభత్సాలతో అతలాకుతలమైన కేరళకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఆర్థిక వనరులు పొందుతూ సమయం వచ్చినప్పుడు ప్రధాని మోదీపై అసత్య ఆరోపణలను చేస్తున్నాడు. ఇక, తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతన శక్తియుక్తులతో పాలనను సాగిస్తున్నారు. రాష్ట్ర వాటాకు సంబంధించిన ఆర్థిక మొత్తాలను కేంద్ర ప్రభుత్వం నుంచి తెలివిగా రాబడుతున్నారు. భాజపా మతతత్వ పార్టీ అని అమిత్‌షాలు, ప్రధాని మోదీలు తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని తాజాగా ఎన్నికల సభల్లో కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలలో తన 16 ఎంపీలతో ఫెడరల్ ఫ్రంటు కూటమిని ఏర్పాటు చేస్తానంటూ వాగ్దానాలు చేస్తున్నారు. ఇది తోక గుర్రాన్ని ఊపిన చందంగా ఉన్నది. ఏమో గుర్రం ఎగరావచ్చు. ఏదైనా ప్రజలే నిర్ణయిస్తారు.
జనసేన అధిపతి పవన్‌కల్యాణ్ ఉత్తరప్రదేశ్‌కు పోయి బిఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధానమంత్రి అవుతుందని అంటే, ‘నువ్వు కాబోయే ఆంధ్ర ముఖ్యమంత్రివి’ అంటూ ఆమె కితాబుఇచ్చింది. ఇది అహో రూప మహాధ్వని: అన్నట్లు గాడిదె-ఒంటె కథలో పరస్పర ప్రశంసల భావం గుర్తుకువస్తుంది.
మన దేశంలో ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్య్రం పుష్కలంగా ఉన్నాయి. అలనాడు కాంగ్రెస్ హయాంలో ఉండగా ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రజలందరూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. కాని ప్రతిపక్షాలు మాత్రం కడుపుమంటతో ఆక్రోశిస్తూ గగ్గోలు పెడుతున్నాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ, అమిత్‌షాల ప్రభంజనంతో మరొక్కమారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే తమ నామరూపాలు లేకుండాపోతాయని విపక్ష నేతలు బెంగపెట్టుకొన్నారు. మోదీని అడ్డుకొనటానికి విలువలు మరచి శత్రుదేశాల సహకారాన్ని కోరుతున్నారు. దాదాపు 85% మీడియాను విదేశీశక్తుల సహకారంతో దుష్ప్రచారాన్ని సాగిస్తున్నారు. దేశ ప్రజలందరూ ఇలాంటి అరాచక రాజకీయాలను పూర్తిగా అర్థం చేసుకొని ఓటు అనే బ్రహ్మాస్త్రంతో సరైన నిర్ణయం తీసుకొని యోగ్యుడైన వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకొంటారనడంలో సందేహం లేదు. నేటి సాంకేతిక సమచార వ్యవస్థతో ప్రజలు అప్రమత్తతతో మెలుగుతున్నారు.
ఆనాటి మహాభారత యుద్ధంలో మాదిరి ఈనాటి ప్రజాసైన్యం మహారథులు, అర్థరథులు లాంటి ప్రతిపక్ష రాజకీయ నాయకుల గర్వాలను అణచి ఎన్నికల సమరంలో నామరూపాలు లేకుండా ఓడించే తరుణం ఆసన్నమయినది. కలియుగ భారత ఎన్నికల సమరంలో కూడా ధర్మానికి, న్యాయానికి విజయం చేకూరడం ఎంతో అవసరం.

-జొన్నాభట్ల నరసింహ ప్రసాద్ 7995 900 497