సబ్ ఫీచర్

ప్రపంచం చూపు.. అంతరిక్షం వైపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు ఉద్దేశించిన ‘స్పేస్ ఎక్స్’ సంస్థ కార్యక్రమం విజయవంతమైంది. అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి మార్చి 2న ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా పంపిన వ్యోమగాముల ‘కాఫ్యూల్’ వారంరోజులపాటు అంతరిక్షంలో పరిభ్రమించిన అనంతరం మార్చి 8న విజయవంతంగా అట్లాంటిక్ సముద్రంలో దిగింది. ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్ సుదీర్ఘకాలంగా ఈ విషయంలో ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తోంది.
తాజా ప్రయోగంలో అంతరిక్ష నౌకలో మనిషిని పోలిన ఆకారాన్ని (డమీని) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపింది. ఆ డమీకి ‘రిప్లే’ అన్న పేరు పెట్టారు. గ్రహాంతర వాసులపై తీసిన ఓ చిత్రంలోని పాత్ర పేరు అది కావడం విశేషం. ఈ ప్రయోగ ప్రధాన ఉద్దేశం వాహక నౌక విశ్వసనీయతను, వాస్తవిక సమయంలో దాని సురక్షితను తెలుసుకోవడం. ఈ రెండు అంశాల్లో స్పేస్-ఎక్స్ పాజిటివ్ ఫలితాలనే సాధించింది. దీంతో అంతరిక్షంలోకి మనుషుల రాకపోకలు మరింత సులువుకానున్నాయి.
60వ దశకంలో అపోలో ద్వారా అమెరికన్ వ్యోమగాములు అంతరిక్షం వెళ్లి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే! దాదాపు అదే ప్రక్రియ ప్రస్తుతం జరిగింది. అయితే ఇలాన్‌మస్క్ అనే బిలియనీర్... పారిశ్రామికవేత్త ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ ద్వారా ఇప్పుడు జరగడం విశేషం. అంటే నాసా లాంటి ప్రభుత్వ సంస్థలే కాదు, ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష యాత్రలు జరిపే వాతావరణం ప్రపంచంలో ఏర్పడుతోంది. ఇది గొప్ప పరిణామంగా భావించాలి. అంతరిక్ష యాత్రల ప్రైవేటీకరణలో భాగంగా ఈ విజయాన్ని భావిస్తున్నారు. దీంతో అంతరిక్ష రంగంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది.
ఇలాన్‌మస్క్ ఆధ్వర్యంలోని ఈ స్పేస్‌ఎక్స్ సంస్థ అంతరిక్ష ప్రయాణానికయ్యే ఖర్చును... వ్యయాన్ని గణనీయంగా తగ్గించింది. చాలాకాలంగా జరుపుతున్న పరిశోధనల ఫలితంగా ఇది సాధ్యమైంది. భవిష్యత్‌లో మనుషులను అంతరిక్షంలోకి తీసుకెళ్ళే లక్ష్యంతోనే, అక్కడ కాలనీలు నిర్మించాలనే భావనతోనే ఈ పరిశోధనలు చోటుచేసుకున్నాయి. అందులో ఆ సంస్థ చాలావరకు విజయం సాధించింది. గతంలో ఎన్నో వైఫల్యాలను చవిచూసినా, గుణపాఠాలు నేర్చుకుని విజయ తీరాలవైపు అడుగువేసింది. ‘నాసా’ ప్రాజెక్టుకన్నా స్పేస్-ఎక్స్ ప్రాజెక్ట్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో భవిష్యత్‌లో స్పేస్-ఎక్స్ మరిన్ని ‘‘అంతరిక్ష ప్రయాణాలు’’ చేపట్టనున్నది.
ఇది ఇలా ఉంటే... జపాన్‌లో టూయోటా సంస్థ జపాన్ అంతరిక్ష సంస్థతో కలిసి సంయుక్తంగా చందమామపైకి వెళ్ళే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టయోటా మోటారు వాహనాలను తయారుచేసే సంస్థ అని అందరికీ తెలుసు. ఇప్పుడు చందమామపై నడిచే ‘‘రోవర్’’ను సిద్ధం చేయబోతోంది. అంతరిక్ష పరిశోధనల్లోకి ఈ కార్ల సంస్థ తొలిసారిగా పాదం మోపుతోంది. ఇప్పటికే ఈ సంస్థ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేసే ‘‘రోబో’ను పంపింది. తాజాగా చంద్రునిపై తిరిగే వాహన తయారీలో తలమునకలైంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)తో కలిసి, టొయోటా చందమామపై దిగేందుకు యత్నిస్తోంది. ఇంతవరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే చందమామను చేరుకున్నాయి. ఇటీవలనే ఇజ్రాయిల్ ఒక అంతరిక్ష నౌకను చందమామపైకి పంపింది. భారతదేశ ‘చంద్రయాన్’ కార్యక్రమం రూపుదిద్దుకుంటోంది.
అలాగే భారతదేశంలో తొలి ప్రైవేట్ అంతరిక్ష వాహన కేంద్రం బెంగుళూరు సమీపాన దేవనహళ్లిలో త్వరలో ప్రారంభం కానున్నది. దేశ అంతరిక్ష ప్రధాన కేంద్రం బెంగుళూరులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అదే నగరంలో అంతరిక్ష నౌకల తయారీ కేంద్రం ప్రైవేట్ రంగంలో రానుండటం విశేషం. ఈ కేంద్రంలో రెండు వేల కిలోల ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్, కమ్యూనికేషన్ అంతరిక్ష నౌకను తయారుచేయబోతున్నారు. ‘‘అనంత టెక్నాలజీస్ లిమిటెడ్’’ సంస్థ ఈ బృహత్ కార్యాన్ని చేపట్టనున్నది. ఇది హైదరాబాద్‌కు చెందిన తెలుగువారిది కావడం గర్వించదగ్గ మరో అంశం. దేశంలో ఉపగ్రహాల అసెంబ్లీ, ప్రయోగం చేసే తొలి ప్రైవేట్ సంస్థ తమదేనని ఆ సంస్థ డైరెక్టర్ అనురూప్ పావులూరి చెప్పారు. ఈ సంస్థ ఆకాశ్, బ్రహ్మోస్ లాంటి క్షిపణులకు అవసరమయ్యే ‘‘సిస్టమ్స్’’ను తయారుచేయనున్నది. ఇంకా అధునాతన అంతరిక్ష నౌకల తయారీకి ఉపకరించే వాటికి రూపకల్పన చేస్తోంది. ‘ఇస్రో’కు సరఫరాదారుగా నిలుస్తోంది.
మొబైల్ కాంగ్రెస్
అంతరిక్షంలోని ఉపగ్రహాల ఆధారంగా పనిచేస్తూ ప్రజాజీవితాన్ని విప్లవీకరించే 5జి (ఐదవ తరం) స్మార్ట్ఫోన్లు పెద్దఎత్తున ప్రపంచాన్ని ముంచెత్తనున్నాయి. త్వరలో బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మడతపెట్టే స్మార్ట్ సెల్‌ఫోన్లు ఇతర విప్లవాత్మక గాడ్జెట్లు ప్రదర్శించనున్నారు. భవిష్యత్ ఎటువైపున పయనిస్తుందో తెలిపే దిక్సూచిగా ఈ ‘కాంగ్రెసు’ కొనసాగనున్నది. ఇందులో మడతపెట్టే స్మార్ట్ వాచ్-్ఫన్ సైతం వెలుగు చూడగలదని భావిస్తున్నారు. ఇప్పటికే వాచ్ (చేతి గడియారం) స్మార్ట్ ఫోన్‌పై అనేక అంచనాలున్నాయి. ప్రజలను ఆకర్షించడమే గాక జీవితాలను విప్లవీకరించే ఎన్నో అక్కడ కొలువుదీరబోతున్నాయని భావిస్తున్నారు.
శామ్‌సంగ్, గ్జియామి, ఎల్.జి., నోకియా లాంటి సంస్థలు కూడా 5జి టెక్నాలజీ ఆధారంగా స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెడుతున్నాయి. కృత్రిమమేధ కొత్త రూపాలు సైతం అక్కడ కనిపించబోతున్నాయి.
గ్రహాంతరవాసులు
మానవులకన్నా తెలివైన జీవులు ఇతర గ్రహాల్లో ఉండవచ్చునన్న అభిప్రాయం చాలాకాలంగా ఉంది. ఇప్పుడు ఇతర గ్రహాల (చంద్రగ్రహం.... అంగారక గ్రహం) వైపు మనం ఎలా పయనమవుతున్నామో వేల సంవత్సరాల క్రితమే ఇతర గ్రహాల్లో ఉన్న తెలివైన వారు జీవులు.... భూగోళంపైకి వచ్చారని విశ్వసించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాంటి వారిని ‘‘అనునాకీ’’లని గ్రహాంతర వాసులని పిలుస్తున్నారు. యుఎఫ్‌ఓ (ఎగిరే పళ్లాలు)లు వారివేనని చెబుతారు. వారి ‘టెక్నాలజీ’ ఆధారంగానే ఈజిప్టులో పిరమిడ్లు కట్టారని సుమేరియా నాగరికత వెల్లివిరిసిందని, ఆనాడే అద్భుత నగరాలు వెలిశాయని చెబుతారు. ఆ ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. పుష్పక విమానాల్లాంటి విమానాల చిత్రాలు, మానవ ఆకారాలకు భిన్నమైన ఆకారాలు గల చిత్రాలు అనేకచోట్ల ఇప్పటికే లభ్యమయ్యాయి. వారి అవసరాల కోసం భూగోళంపైకి వచ్చారని వారినే అనునాకీలని అంటున్నారు. వర్తమానంలో మనుషులు వారి పాత్రను పోషిస్తున్నారు. అంటే ఇతర గ్రహాలపై కాలనీలను నిర్మించబోతున్నారు.
ఇలా టెక్నాలజీకి, నాలెడ్జికి గరిష్టమైన గౌరవం- గుర్తింపు లభిస్తున్న ఈ తరుణంలో వీటి నేపథ్యంలో నాగరికత అభివృద్ధి చెందుతున్న సందర్భంలో భారతదేశంలో మావోయిస్టుల, ఉగ్రవాదుల సంస్కృతి పూర్తిగా ఖండనీయం. ముఖ్యంగా వర్తమాన వ్యవస్థను కూకటి వేళ్ళతో కూల్చివేయాలని బోధించే మావోయిస్టుల వ్యవహారం పూర్తిగా అనాగరికం. ఇతర గ్రహాలవైపు మానవులు పరుగులు తీస్తున్న తరుణంలో ఇలా అసంబద్ధ వైఖరితో మరణ మృదంగం మోగిస్తే అది మానవాళికి ఏ విధంగా ఆమోదనీయమవుతుంది?.... ప్రపంచం అంతరిక్షం వైపు చూస్తుంటే మావోలు దండకారణ్యం వైపు చూస్తే ఎలా?....

- వుప్పల నరసింహం