సబ్ ఫీచర్

తరగతి గది.. చలనరాశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తాడు. అదే మాదిరిగా విద్యార్థి తన గురువు చుట్టూ తిరుగుతుంటాడు. గురువు తరగతి గదిలో ప్రతి విద్యార్థి చుట్టూ తిరుగుతుంటాడు. ప్రతి మనిషీ తన కక్ష్య చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ప్రతి మనిషీ భూమండలం వేగాన్ని తీసుకుంటాడు. మనం చూస్తున్నది సాపేక్షవేగం. అది యదార్థమైన వేగం కాదు. అదే మాదిరిగా మనం చూస్తున్నది కూడా ఇతర బింబాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువును చూడటానికి వెలుగు కారణం. సూర్యుడు కూడా తన కక్ష్య చుట్టూ తాను తిరుగుతున్నాడు. అందుకే మనకు కార్తెలు, ఋతువులు ఏర్పడుతున్నాయి. ప్రతి విద్యార్థి చుట్టూ ఉపాధ్యాయుడు, ప్రతి విద్యార్థి చుట్టూ గురువు తిరుగుతుంటాడు. అందుకే గురువు ఒక కాలంలో ఒక తరగతిలో చెప్పింది అంతటా సమానమైన ప్రభావం చూపటం అసంభవం. గురువుకూడా విద్యార్థి చుట్టూ తిరుగుతాడు కాబట్టి ఒక తరగతిలో చెప్పిన పాఠం మరో తరగతిలో చెప్పినా ఒకేలా ఉండదు. ఒకే రకమైన ప్రభావం చూపించదు.
బోధన, సాధన అనే రెండు అంశాలూ విద్యార్థి, ఉపాధ్యాయునిపై ఆధారపడి ఉంటాయి. లెర్నింగ్ కూడా ఇతరులపై ఆధారపడి ఉంటుంది. అది సాపేక్ష జ్ఞానం. కాబట్టి ఈ యుగం సాపేక్ష యుగం. ప్రతి శాస్త్రం పరిశోధనలో ఏర్పడే నిర్ణయాలు కూడా సాపేక్షమైనవే. భూమండలం నుంచి చూస్తే వచ్చే పరిజ్ఞానం, చంద్రమండలం నుంచి చూసే పరిజ్ఞానం భిన్నంగా ఉండవచ్చు. ఇది ఏ సమయంలో ఆ ప్రయోగం చేశారన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. టీచింగ్, లెర్నింగ్, తరగతి స్వభావం అంతా చలనరాశే. అదికూడా నిత్యం చలిస్తూ ఉంటుంది. ఒక సంవత్సరం వచ్చిన పరీక్షా ఫలితాలు ఎప్పటికీ అలాగే రావు. అదే తరగతిలో అదే టీచర్ బోధించినా భిన్న ఫలితాలు రావచ్చు. గురుశిష్య సంబంధాలు కూడా ఫలితాలు మారటానికి కూడా కారణాలు అవే అవుతాయి. తరగతి గది చలనరాశి.
మారిన విద్యారంగం స్వరూపం...
21వ శతాబ్దం జ్ఞానాన్ని విశ్వీకరణ (గ్లోబలైజేషన్) చేసింది. దీనివల్ల విద్యారంగం స్వరూపం, నిర్వచనం మారిపోయాయి. ప్రపంచంలో ప్రజాస్వామికీకరణను కూడా గ్లోబలైజ్ చేయాలి. విశ్వవ్యాప్తంగా ప్రజాస్వామికీకరణ బాధ్యతను కూడా విద్యారంగమే తీసుకుంది. డెమోక్రసీ ఒక జీవన విధానం కావాలి. దానిని బాల్యం నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. దాన్ని కేంద్రంగా చేసుకునే విద్యారంగాన్ని రూపొందించుకోవాలి. కరిక్యులమ్‌లో మార్పులు, బోధనలో మార్పులు, పాఠశాల నిర్వహణలో మార్పులు చివరకు పరీక్షల్లోకూడా మార్పులు తీసుకురావాలి. అన్ని రంగాల్లో మార్పులు తేవాలి. అవన్నీ ప్రజాస్వామికీకరణ చెందాలి.
చదువంటే కేవలం పరీక్షలు కాదు. గ్రంథస్థం చేసిన చదువుచదువే కాదు. మనిషి ఆలోచనలను సర్జరీ చేయాలి. ఈ బాధ్యతను పాలనా రంగానికిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించే పని పాలనా యంత్రాంగానిదే. జ్ఞానం అందరి సొంతమయినప్పుడు దాని ఫలితాలు కూడా అందరి సొత్తు కావాలి. సమత్వం అంటే అందరికీ ఓటు హక్కునివ్వటమే కాదు, జ్ఞానం ఫలితాలను అందరికీ అందజేయటం. అందుకే 21వ శతాబ్దం తరగతి గది పరిధిని మాత్రమే పెంచలేదు. బాధ్యతలను కూడా పెంచింది. 21వ శతాబ్దంలో విద్య సామాజీకరణ చెందాలి. ఫలితాలు ఎప్పుడూ సమానంగా ఉండవు. ఫలితాలు సమానంగా వచ్చినా అందరిలో సమానమైన జ్ఞానం రాదు. గత నాగరికత ప్రభావం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టే ఈ అంతరాలను తగ్గించవలసిన బాధ్యత పాలకులకు అప్పగించటం జరిగింది.
ఆకాశమే హద్దు...
21వ శతాబ్దపు జ్ఞానయుగం నాలుగు గోడలకే పరిమితం కాలేదు. తరగతి గది విశ్వరూపం ధరించింది. ఒకనాడు జ్ఞానం తరగతి గదిలో జరిగే ప్రక్రియకే పరిమితం. సమాచార యుగం జోడించటం వల్ల తరగతి గది గ్లోబల్ స్థాయికొచ్చింది. ఉపాధ్యాయుడు చేసే పని గ్రామాల్లోఉండే పత్రికా విలేకరి దగ్గర్నుంచి విశ్వంలో వ్యాపించివున్న సమాచార వ్యవస్థ జ్ఞాన ప్రసారానికి భాగస్వామి అయ్యింది. ఒకప్పుడు ఉపాధ్యాయుడికి పాఠ్య పుస్తకాలు సహాయకారిగా ఉండేవి. ఈనాడు తరగతి గదికి సహాయకారి పత్రికలు, టీవీ ఛానల్స్, సెల్‌ఫోన్‌లు.. ఇలా ఒకటేమిటి..? తరగతి గదిని అలంకరించని వ్యవస్థే లేదు. గతంలో బడిలోని స్ట్ఫారూమ్, ప్రయోగశాల, ప్లేగ్రౌండ్స్ జ్ఞానానికి కార్యక్షేత్రమైతే ఈనాడు ప్రతి టీవీ చానల్, ప్రతి పత్రిక ప్రసార నిలయాలు అయిపోయాయి. ప్రతి పౌరుడిలో విద్యార్థి పరకాయ ప్రవేశం చేశాడు. ఆ విద్యార్థుల ఆసక్తే జ్ఞాన సముపార్జనకు మార్గం. దానికి హద్దులు లేవు కానీ, ప్రతిదీ జ్ఞానం కాకపోవచ్చు. ప్రతి విద్యార్థికి తాను నచ్చిన అంశాన్ని ఎన్నుకొనే అవకాశం ఉంది.
డిజిటల్ విప్లవం, ఆధునిక టెక్నాలజీ సాయంతో ఎక్కడ కావాలంటే అక్కడ జ్ఞానం వికసిస్తుంది. 40 మంది ఉన్నా తరగతి గది నేడు లక్షలాది మంది విద్యార్థులున్నట్టు కళకళలాడుతుంది. జ్ఞాన సముపార్జనకు ఆకాశమే హద్దు. టీచింగ్, లెర్నింగ్ పసిపిల్లలకే కాదు, 90 ఏళ్లపైబడ్డ నాకు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని అవగాహన అయినట్లు చెబుతున్నది. 21వ శతాబ్దం 3 విప్లవాల పరిణామం. 1. సమాచార విప్లవం, 2.డిజిటల్ విప్లవం, 3. సామాజిక విప్లవం.
దీనివల్ల విద్య సమష్టి కార్యక్రమంగా మారిపోయింది. తరగతి గదికున్న గోడలను పగులగొట్టింది. ఉపాధ్యాయునికున్న స్వరూపాన్ని ఊహించలేనంతగా విస్తరించింది. తరగతి విశ్వరూపం ధరించింది. ప్రతిక్షణం లెర్నింగ్, టీచింగ్ జరుగుతూ ఉంటాయి.

-చుక్కా రామయ్య