సబ్ ఫీచర్

కాశ్మీరు సమస్యకు పరిష్కారం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిబ్రవరి 16వ తేదీ కాశ్మీరులోని పుల్వామా ప్రాంతంలో పాకిస్తాన్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 45 మంది భారత వీర జవాన్లు (సిఆర్‌పిఎఫ్) ప్రాణాలు కోల్పోయారు. ఈ కారు బాంబు దాడికి పాకిస్తాన్ రూపకల్పన చేసింది. మహబూబాముఫ్తీ ప్రత్యక్షంగా సహకరించింది. బారికేడ్లు తొలగించి, సైనిక మార్గంలో సామాన్యుల (సివిలియన్) కార్లు ప్రయాణం చేసేందుకు ఈమె వీలుకల్పించింది. ఇదే ప్రమాదానికి కారణమయింది. మేము ప్రతీకారం తీర్చుకుంటాం అని భారత ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. అలాగే 12 రోజుల తర్వాత ఆక్రమిత కాశ్మీరులోని ఉగ్రవాద శిబిరాలపై భారత ప్రభుత్వం ప్రత్యక్షంగా వ్యూహాత్మక దాడి తెల్లవారుజామున జరిపించింది.
భారత్‌కు చెందిన మిరేజ్ సుఖోయ్ యుద్ధవిమానాలు 26 ఫిబ్రవరి 2019నాడు ఆక్రమిత కాశ్మీరులోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను మూడింటిని ధ్వంసంచేసి 350 మంది ఉగ్రవాదులను వారి కమేండోలను హతమార్చారు. ఇది బాలాకోట్, ముజఫరాబాద్, చకోట్ ప్రాంతాల్లో (ఖైబర్ ఫక్తూన్‌ఖాన్ ప్రాంతంలో) టెర్రరిస్టు అజర్ మైసూద్ నిర్వహిస్తున్న శిబిరాలివి. 2016 యూరీ దాడిలో(పఠాన్‌కోట) భారతదేశం నష్టపోగా అప్పుడు పాక్ హెలీపాడ్‌పై ఒక దాడి చేయటం గుర్తుంచుకోవాలి.
ఈ సంఘటన జరిగిన తర్వాత దేశంలోని వివిధ రాజకీయ పక్షాలు కేంద్రానికి మద్దత్తు ప్రకటించాయి. ఈ సందర్భంలో మనం కాశ్మీరు సమస్య పూర్వాపరాలు కొద్దిగా గమనించాలి.
1947 భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు సమస్యాత్మకంగా మారాయి. కాశ్మీరు రాజు హరిసింగ్ కాశ్మీరును ఇండియన్ యూనియన్‌లో కలిపివేశాడు. ఐతే పాకిస్తాన్ బలవంతంగా కాశ్మీరులోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. దీనినే అజాద్ కాశ్మీరు-(పాక్ ఆక్రమిత కాశ్మీర్) అన్నారు. అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఈ సమస్యను ఐక్యరాజ్యసమితికి సమర్పించాడు. పాకిస్తాన్ మాత్రం ఇండియా అధీనంలో ఉన్న కాశ్మీరు కూడా తమదేనని వాదిస్తున్నది. కాశ్మీరులో మూడు ప్రాంతాలున్నాయి. ఒకటి జమ్మూ. ఇది హిందూ మెజారిటీ ప్రాంతం. రెండవది కాశ్మీరు. ఇందులోని లోయలో 5 జిల్లాలు మాత్రమే సమస్యాత్మాక ప్రాంతాలు. ఇక్కడ జమామసీదు- హజరత్‌బాల్ వంటివి ఉన్నాయి. ఈ ప్రాంతం తాము ఇండియాలో అంతర్భాగం కాదని భావిస్తున్నది. వీరిలో రెండు వర్గాలున్నాయి.
1) స్వతంత్ర కాశ్మీర్ దేశం కావాలని కోరేవారు.
2) పాకిస్తాన్‌తో కలిసిపోవాలని భావించేవారు.
ఇక మూడవ ప్రాంతం లఢక్. ఇది బౌద్ధమతస్థుల కేంద్రం. దీనిని క్రమంగా చైనా ఆక్రమిస్తున్నది. అక్కడ సరిహద్దులో ఎవరికీ తెలియకుండా అతిపెద్ద భూగర్భ సొరంగాన్ని నిర్మించి, అందులో క్షిపణులను సైనికులను దాచిపెట్టింది. నెహ్రూ కాశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందినవాడు. షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కారణంగా కాశ్మీరీ ఉగ్రవాదులపై ఎటువంటి చర్యలను తీసుకోలేదు. ఆనాటి భారత రక్షణమంత్రి వికె కృష్ణమీనన్ ఐరాసలో గంటల తరబడి మాట్లాడి సొమ్మసిల్లి పడిపోయాడు. ఐనా కాశ్మీరు సమస్య పరిష్కారంకాలేదు. ఎందుకంటే మతం ప్రాతిపదికగా భారతదేశ విభజన జరిగింది కాబట్టి ముస్లిం మతం మెజారిటీలో ఉన్న కాశ్మీరు లోయ పాకిస్తాన్‌లో అంతర్భాగం కావాలి అనేది పాకిస్తాన్ వాదం. ప్రపంచంలో రెండవ అతి పెద్ద ముస్లిం జనాభాగల దేశం ఇండియా. ఉదాహరణకు హైదరాబాదులో ముప్పది లక్షల మంది ముస్లిములు ఉన్నారు. కాబట్టి హైదరాబాదును పాకిస్తాన్‌కు అప్పగిస్తారా? స్వతంత్ర దేశంగా ప్రకటిస్తారా?
బెంగాల్‌లోని మాల్దా ప్రాంతంలో లక్షలాది ముస్లిములు బంగ్లాదేశ్‌నుండి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వీరి ఓట్లతో లోగడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఇప్పుడు మమతాబెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నాయి. ‘మా జోలికివస్తే సివిల్‌వార్ వస్తుంది’అని మమతాబెనర్జీ హెచ్చరిస్తున్నది. కాశ్మీరు సమస్యకు మూలం కాశ్మీరులో లేదు. పాకిస్తాన్‌లో కూడా లేదు. జిహాదీ ఇస్లామిక్ ఫండమెంటలిజంలో ఉంది. మొత్తం ప్రపంచాన్ని ఖడ్గశక్తితో ఇస్లామీకరణం చేయాలని వీరి లక్ష్యం.
భారతదేశంలో కమ్యూనిస్టు వర్గాలు ముస్లిం ఉగ్రవాదానికి మద్దతునిస్తున్నాయి. కమ్యూనిజానికి మతం మత్తు వంటిది. ఐనా వీరు ఇస్లామిక్ ఉగ్రవాదులను ఎందుకు సమర్థిస్తున్నారు? అంటే భారతదేశాన్ని బలహీనపరిచితే దీనిని తేలికగా చైనా ఆక్రమించుకుంటుంది. అందుకే లోగడ చత్తీస్‌గఢ్ 74 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను వీరు హతమార్చారు. సల్వాజుడుం నాయకుడు మహేంద్రకర్మ, కాంగ్రెస్ నాయకుడు విద్యాచరణ్‌శుక్లా వంటివారు చత్తీస్‌గఢ్‌లో ఉగ్రవాదుల చేతిలో హతులైనారు.
1) మయన్మార్‌నుండి వచ్చిన రోహింగ్యాలకు పౌరసత్వం కల్పించాలని వీరు వాదిస్తున్నారు. ఇది మానవతా దృక్పధంతో తీసుకోవలసిన చర్య అంటున్నారు. మరి 1990లో కాశ్మీరునుండి తరిమివేయబడిన 6 లక్షల మంది హిందూ పండిట్ల విషయంలో మానవతా దృక్పథం ఉండనక్కరలేదా?
ఔను. మానవ హక్కులు హిందువులకు ఉండవు- ఉగ్రవాదులకు మాత్రమే ఉంటాయి.
2) కాశ్మీరులోని ప్రత్యేకవాదులు హైస్కూలు పిల్లలచేత రాళ్లు వేయిస్తున్నారు. వీరంతా డ్రగ్ ఎడిక్టులు. మాదకద్రవ్యాలు ఆల్కహాలు కొనుక్కోవటం కోసం ఉగ్రవాదులనుండి దినబత్తెం(డైలీ వేజెస్) తీసుకుంటుంటారు. వీరిని లోగడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన ముఫ్తీ-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం కానీ అదుపులో పెట్టలేకపోయింది. వీరికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తే సమస్య కొంత పరిష్కారం అయి ఉండేది.
3) ఆర్టికల్ 35ఎ, ఆర్టికల్ 370వలన కాశ్మీరీయులు తాము భారతదేశంలో అంతర్భాగంగా భావించుకోలేక పోతున్నారు. కాశ్మీరులో త్రివర్ణపతాకం ఎగరడానికి వీలులేదు అని స్వయంగా ముఫ్తీమహబూబా (24-2-2019) ప్రకటించినప్పుడు ఆమెను ఎందుకు అరెస్టు చేయలేదు?
ఇండియాలో యుద్ధవాతావరణం ఏర్పడటం చైనాకు లాభకారి. ఎందుకంటే తమ చేతికి మట్టిఅంటకుండా తాము భారత్ విచ్ఛిన్నాన్ని సాధింపవచ్చు. అందుకు పాకిస్తాన్ వారికి ఉపకరణం (కాట్స్-పా.)
ఈ దశలో భారత్ కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆర్టికల్ 370 35ఎలను రద్దుచేయాలి. దేశంలో అంతర్గత భద్రతకు ముప్పుగామారిన సిమి, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, (కేరళ ఇత్తెహాదుల్ మజ్లీస్ (తెలంగాణా), ఐసిస్, జైషే మహమ్మద్, హిజుబుల్, తాలిబన్, లష్కరీ తోయిబా వంటి సంస్థలపై నిషేధం విధించాలి. చిన్నచిన్న పిల్లలను చేరదీసి మీరు ఫిదారుూలుగా మారి చనిపోండి. ఆత్మాహుతి దాడిలో మరణిస్తే నేరుగా జన్నత్ (స్వర్గం) చేరుతారు అని వీరు తమ ఉగ్రవాద శిక్షణా శిబిరాల్లో బోధిస్తున్నారు.
అమెరికా, రష్యా, ఫ్రాన్సు, ఇజ్రాయిల్, ఆఫ్ఘనిస్థాన్, బ్రిటన్ వంటి దేశాలు సహకారం తీసుకుని పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా యుఎన్‌ఓ చేత ఒప్పించాలి. తద్వారా పాకిస్తాన్‌ను ఏకాకిచేయాలి. ఎంతోకాలంగా జరుగుతున్న బెలూచిస్థాన్ సింధ్ స్వతంత్ర పోరాటాలకు వెంటనే అంతర్జాతీయ మద్దతును కూడగట్టాలి. ఆ విధంగా పాకిస్తాన్ మూడుముక్కలవుతుంది. దేశాలలో వివిధ ప్రాంతాల్లో చైనా-పాకిస్తాన్‌లు కల్లోలం సృష్టించే అవకాశం ఉంది. అందుకని మొత్తం భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే ఎన్నికలను నిరవధికంగా వాయిదావేయాలి. మమతాబెనర్జీ, మణిశంకర్ అయ్యర్, జాన్‌దయాల్, సునిల్‌చోప్రా, మహబూబా ముఫ్తి, శశిధరూర్, కన్నయకుమార్, రొమిల్లాథాపర్, స్వామి అగ్నివేశ్, అజంఖాన్ వంటి వారిని భారత ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదు?
కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజగ్‌ఝా మాట్లాడుతూ.. ఒకటి రెండు ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించినంతమాత్రాన పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మొత్తం ఉగ్రవాదం నిర్మూలించబడినట్లు అర్ధంకాదు అన్నారు. బి.జె..పి. నాయకుడి సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్, మా భూభాగమే మా నేలపై మేమూ ఉగ్రవాదులను నిర్మూలిస్తే పాక్‌కు ఎందుకు కోపం? అని ప్రశ్నించారు. ఇప్పుడు చైనా చాలా సంతోషంగా ఉంది. యుద్ధం ఇండోపాక్ సరిహద్దులల్లో జరుగుతున్నదే కానీ చైనా- తైవాన్ సరిహద్దులల్లో కాదు- నిజమే కదా!
భారత్ సంయమనం పాటించాలి ట్రంప్ అమెరికా (27-2-2019) కోరారు. ‘‘ఒసామాబిన్ లాడెన్ మీ దేశంమీద దాడి చేసినప్పుడు మీరెందుకు చంపారో చెప్పండి’’ అని భారత కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ సూటిగా ప్రశ్నించారు. దాదాపు డెబ్బది సంవత్సరాలుగా ఈ హత్యాకాండ జరుగుతూనే ఉంది. దాదాపు 25వేల మంది భారత సైనికులు వివిధ యుద్ధాల్లో బలిదానం చేసినందుకు మొన్న న్యూఢిల్లీలో అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మించటం మనకు తెలిసిన విషయమే!
భారత వైమానిక సైనికుడు అభినందన్ 27 ఫిబ్రవరినాడు పాకిస్తాన్ ఎఫ్-16్ఫల్కన్ విమానాన్ని కూల్చి పాక్ సేనలకు పట్టుపట్టాడు. జెనీవా ఒప్పందం ప్రకారం పట్టుబడ్డ సైనికులను హింసించకూడదు. వారితో ఊడిగం చేయించకూడదు. ఆ జ్ఞానం పాకిస్తాన్‌కు లేదు. అభినందన్‌ను రక్తంకారేటట్లు కొడుతున్నారు. లోగడ కార్గిల్ యుద్ధం సందర్భంలో కాలియావంటి భారత సైనికులను హింసించి చంపారు.
పాకిస్తాన్ అనే ఉగ్రవాద దేశం భారత సరిహద్దులలో ఉన్నంతవరకు ప్రపంచశాంతి అసాధ్యం. ఇమ్రాన్‌ఖాన్ (పాక్ ప్రధాని) పాక్ సైన్యం చేతిలో కీలుబొమ్మ. ఇతని శాంతి మంత్రాలు వ్యూహాత్మకమే. నిజంగా పాకిస్తాన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఉగ్రవాదులైన దావూద్ ఇబ్రహీం, హఫీద్ సయ్యద్, మసూద్ అజర్‌లను ఇండియాకు అప్పగించాలి. ఆక్రమిత కాశ్మీరులో 200 ఉగ్రవాద స్థావరాలున్నాయి. వాటిని పాకిస్తాన్ స్వయంగా ధ్వంసంచేయాలి.
***
క్రైస్తవ ప్రపంచంలో ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. కేరళలోని ఫ్రాంకో ములక్కల్ నన్స్ (క్రైస్తవ సన్యాసినుల) మీద చేసిన అత్యాచారం ఆ మతస్థుల పునాదులను కేరళలో కదిలించాయి. ఇతనిని అరెస్టుచేశారు. ఇలాంటి సంఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండగా ఇప్పుడో మరో దారుణ సంఘటన ఆస్ట్రేలియా లో వెలుగుచూసింది.
జార్జిపెల్ ఆస్ట్రేలియాకు చెందిన క్రైస్తవ మతాధికారి. ఇతడు స్వలింగ సంపర్కం కేసులో మెల్‌బోరన్ కోర్టులో నిందితుడుగా నిర్థారింపబడ్డాడు. 1990లో ఇద్దరు మగపిల్లలతో ఇతనికిగల సంపర్కం నిరూపణ కావటంతో కోర్టు శిక్షవిధించింది. (27-2-2019).
ఇక్కడ గమనింపవలసిన ప్రధానాంశం ఏమిటంటే ఈ జార్జిపెల్, వాటికన్‌లోని పోపు ఫ్రాన్సిస్‌కు కుడిభుజం లాంటివాడు, ఇతడు శిక్షింపబడటం క్రైస్తవ సమాజం నైతికంగా పతనమయిందనే అంశానికి నిదర్శనంగా పాశ్చాత్య ప్రపంచం గుర్తించింది. క్రైస్తవ మతానికి రూపశిల్పి సెయింట్ పాల్. ఇతడు క్రీ.శ.మొదటి శతాబ్దంవాడు. ఈయన బోధనలు క్రీస్తు బోధనలకు భిన్నంగా ఉన్నాయి. ‘మీరు ఎన్ని పాపాలైనా చేయండి. క్రీస్తును విశ్వసిస్తే చాలు మోక్షం లభిస్తుంది’ అని. సెయింట్ పాల్ నైతిక సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, ‘‘విశ్వాస’’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇదే ఫ్రాంకో ములక్కల్. జార్జిపెల్ వంటి వారి దారుణాలకు కారణమయింది.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్