సబ్ ఫీచర్

సైన్స్ దైవత్వమే మానవాళికి శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్’, భారత ప్రభుత్వాన్ని, 1928 ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా గుర్తించవలసినదిగా సూచించింది. ఆసియాలో 1930లో ప్రప్రథమ నోబెల్ విజేత సర్.సి.వి.రామన్ వైజ్ఞానిక ప్రపంచాన్ని విస్మయపరిచిన అద్భుత శాస్ర్తియ పరిశోధన ‘రామన్ ఎఫెక్ట్’ వెలుగుచూసిన రోజును, 1986నుంచి భారత ప్రభుత్వం, యావద్భారత స్థాయిలో విద్యార్థి, యువజన శాస్ర్తియ మేధోవికాసానికి ఫిబ్రవరి 28 స్ఫూర్తివంతమైన రోజుగా సర్ రామన్‌కు స్మృత్యంజలి ఘటిస్తోంది. ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న ఆకలి, అనారోగ్యం, దారిద్య్రం వంటి వౌలిక అరిష్టాలను పారద్రోలగల అపారశక్తి, విజయవంతమైన జ్ఞానం, సైన్స్ పరిశోధనలు సాధించగలవు అన్నారు 1947లో సర్ సి.వి. రామన్. 2030 నాటికైనా ఇండియా ప్రపంచంలో సైన్స్ పవర్ హౌస్‌గా రూపొందించగలదనే ఆశాభావాన్ని మరొక నోబెల్ లారెట్ రాయల్ సొసైటీ ప్రెసిడెంట్ ప్రొ.వెంకటరామన్ రామకృష్ణన్ ఇటీవల వ్యక్తీకరించారు. డా.సి.వి.రామన్‌కు స్వయంగా మేనల్లుడు ఇండో-అమెరికన్ అస్ట్ఫ్రోజిస్ట్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌ను కూడా 1983లో ఫిజిక్స్‌లో నోబిల్ వరించింది. ఇద్దరికీ ఫిజిక్స్‌లో నోబిల్ రావటం భారతీయ శాస్ర్తియ మేధా సంపన్నతకు నిదర్శనంగా ప్రపంచాన్ని విస్మయపరిచింది. కాని వెంకటరామన్ రామకృష్ణన్, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ యు.ఎస్., యు.కె. విదేశీ పౌరసత్వంతో స్థిరపడటం కారణంగా సైన్స్‌లో భారతదేశానికి సంబంధించి సర్ సి.వి.రామన్ ఒక్కరే నోబెల్ సాధించి 88 సంవత్సరాలైనట్టు ఉదహరించబడుతోంది.
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులకు సంబంధించిన సెక్షన్ క్రింద, ఆర్టికిల్ 51ఎ (హెచ్)ప్రకారం ప్రతి భారతీయ పౌరుడు సైంటిఫిక్ దృక్పధాన్ని, అలవరించుకోవలసి వుంది. ప్రగాఢమైన మత విశ్వాసాలు, ప్రాచీన వేదకాలు ఖగోళ, గణితశాస్త్ర వైదుష్యంతో ప్రాచీన ఆర్ష మహర్షులు, మేధావులు ప్రపంచానికి మార్గదర్శకులైన పురాణ మహోన్నతను ఇటీవల ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వార్షిక మహాసభలలో ఉదహరించటం, ప్రపంచంలో సైంటిఫిక్ రివల్యూషన్ ఆవిర్భవింపచేసిన రెండు, మూడు శతాబ్దాల పాశ్చాత్య శాస్ర్తియ విజ్ఞాన శాస్తవ్రేత్తలను కించపరిచే ధోరణిగా వివాదాస్పదమైంది. 2010-2020 సృజనాత్మక దశాబ్దంగా దేశాధ్యక్షుడు ప్రకటించినప్పటికీ, ప్రస్తుత స్థితిగతులలో సైన్స్, రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ రంగం తీవ్రమైన నిధుల కొరతతో నిరాశా నిస్పృహలు ఎదుర్కొంటోంది. బడా కార్పొరేట్ పారిశ్రామిక సంస్థలు యువ శాస్తవ్రేత్తల పరిశోధనాభివృద్ధికి నిధులు వినియోగించి సహకరించటం లేదు. బేసిక్ సైన్స్ జ్ఞానవికాసంపై అప్లైడ్ సైన్స్ భవితవ్యం వుంటుంది. కాబట్టి బేసిక్ సైన్సుపై నిర్లక్ష్యం తగదు. అయినా అటామిక్ ఎనర్జీ, డిఫెన్స్, స్పేస్ రీసెర్చి మూడు రంగాలకు సంబంధించిన రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్‌కు 58శాతం నిధులు వినియోగిస్తున్న కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ రంగానికి మొండి చెయ్యి చూపిస్తోంది. స్వాతంత్య్రానంతరం యూనివర్సిటీలు, 30వేలకు పైగా కళాశాలలు రీసెర్చికి నిధులు కేటాయింపు సమృద్ధిగాలేకపోవటంతో కేవలం బోధనా సంస్థలుగా నిర్వీర్యం అవుతున్నాయి. అందువల్లనే 2016 జనవరిలో 103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మైసూర్ మహాసభలను నోబెల్ విజేత వెంకటరామన్ రామకృష్ణన్ సర్కస్‌గా విమర్శించారు. శాస్ర్తియ దృక్పధం లేకుండా, అసహనం, రీజన్ లేని వైషమ్యం ప్రబలుతుండటంవలన, ప్రొ.కల్‌బర్గి డా.దబోల్కర్, గోవింద్ పన్సారే వంటి మేధావుల హత్యలు జరిగాయని, దేశ విదేశాల 100 మంది సైంటిస్టులు 2015 అక్టోబర్‌నాటి దేశాధ్యక్షుడు ప్రణబ్‌ముఖర్జీకి ఆన్‌లైన్ ప్రకటనలో దేశంలో శాస్ర్తియ దృక్పధానికి జరుగుతున్న హానిని హెచ్చరించారు. ఆ పిటిషన్‌పై సంతకం చేసిన మేటి శాస్తజ్ఞ్రులలో ఒకరైన హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలిక్యులర్ బయొలజీ వ్యవస్థాపక డైరెక్టర్ డా.పుష్పమిత్రా భార్గవ, తన పద్మభూషణ్ అవార్డును కూడా ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ప్రణబ్‌కు తిరిగి పంపించి వేసారు. 2017 ఆగస్టులో డా.్భర్గవ 89వ ఏట స్వర్గస్థులయ్యారు.
డా.పి.ఎమ్.్భర్గవ.. రీజన్, లాజిక్, ప్రూఫ్, ఎవిడెన్స్ సైన్స్‌కు ప్రధాన లక్షణాలుగా జీవితాంతం సైన్స్‌ను ఆరాధించిన డా.్భర్గవ మరణానికి ముందు ఆధ్యాత్మికం, మూఢ నమ్మకాలు, జ్యోతిష్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయ నేతలు సైన్స్‌ను కించపరచటం పట్ల ఆవేదన వ్యక్తంచేసారు. ప్రఖ్యాత మోలిక్యులర్ బయొలజిస్ట్‌గా, జాతీయస్థాయిలో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలిక్యులర్ బయొలజీ (సిసిఎమ్‌బి) ప్రతిష్ఠాత్మక శాస్ర్తియ సంస్థ వ్యవస్థాపక డైరెక్టరుగా భారతీయ శాస్ర్తియ విజ్ఞాన పతాకను కీర్తివంతం చేసారు. 1928 ఫిబ్రవరిలో జన్మించిన డా.్భర్గవ, 1950నుండి సెంట్రల్ లేబొరేటరీల సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చిలో విధులు ఆరంభించారు. విస్కాన్మిన్ మేడిసన్ యూనివర్సిటీలో మెకార్డిల్ మెమోరియల్ కేన్సర్ పరిశోధనల పోస్ట్ డాక్టరల్ విధులు నిర్వర్తించారు. 1958లో హైదరాబాద్ సిఎస్‌ఐఆర్ ప్రయోగశాల శాస్తజ్ఞ్రునిగా సేవలందించి 1977లో సిసిఎమ్‌బి స్థాపించి 13 సంవత్సరాలు పైగా ఎల్, డిఎన్‌ఎ, మోలిక్యులర్ బయొలజీ రంగాలలో అంతర్జాతీయ శాస్తవ్రేత్తగా కీర్తిగడించారు. జన్యు విత్తన సంబంధిత పంటల ఉత్పత్తి అంశంపై బహుళజాతి విత్తన సంస్థలను అనుమతించటం వ్యతిరేకించారు. 2015లో భారత ప్రభుత్వం శాస్ర్తియ దృక్పధం పట్ల చూపించే, నిర్లక్ష్యవైఖరి నిరసిస్తూ అవార్డ్ వాపసీ కార్యక్రమం నిర్వహించి జాతీయస్థాయిలో సంచలనం సృష్టించారు. సైన్స్‌ను దైవత్వంగా ఆరాధిస్తూ ఆఖరి శ్వాసవరకు పోరాడిన డా.పుష్పమిత్రా భార్గవను జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంలో నివాళిగా స్మరించుకోవటం ఎంతైనా సముచితం.

- జయసూర్య