సబ్ ఫీచర్

విధిని అనుసరించడమే మేలు ( ఓషో నవజీవన మార్గదర్శకాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం భయం లేనంతమాత్రాన ధైర్యమున్నట్లు కాదు. ఎన్ని భయాలున్నప్పటికీ తెలియని దానిలోకి చొచ్చుకుపోవడమే ధైర్యమంటే. మీరు మరింత ధైర్యవంతులవుతున్నకొద్దీ నిర్భయత్వం మీలో చోటుచేసుకుంటుంది. అదే ధైర్యంయొక్క అంతిమ అనుభవం. అదే దాని సుగంధం. ధైర్యమున్న వ్యక్తికి, పిరికివాడికి మధ్య పెద్ద తేడా ఏమీలేదు. ఇద్దరికీ భయాలుంటాయి. కానీ, పిరికివాడు తన భయాలకు తగినట్లు ప్రవర్తిస్తాడు. ధైర్యమున్న వ్యక్తి తనకున్న భయాలన్నింటినీ పక్కనపెట్టి తనకు తెలియని వాటిలోకి కూడా దూసుకుపోతాడు. ఎందుకంటే, తనకున్న భయాలేమిటో అతనికి తెలుసు. ‘‘కొలంబస్’’ వెళ్ళినట్లుగా తెలియని సముద్రంలోకి వెళ్ళాలంటే మీకు చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే, సురక్షితమైన తీరాన్ని మీరు వదిలేస్తున్నారు. తరువాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి, ఒక రకంగా మీరు సరియైన దారిలో ఉన్నట్లే. కానీ, ఒకటి లోపించింది. అదే ‘‘సాహసం’’.
తెలియని దానిలోకి వెళ్ళడమనేది మీకు, మీ హృదయానికి చక్కని జలదరింపు కలిగిస్తుంది. అప్పుడు మీలోని అణువణువు మళ్ళీ పూర్తి జీవాన్ని సంతరించుకుంటుంది. ఎందుకంటే, ఏవో భయాలు మీలో ఎప్పుడూ ఉంటాయి. అయినా మీరు మీకు తెలియని దానితో సవాలుచేసేందుకు అంగీకరించారు. అలా పదే పదే మీరు సవాలుచేస్తూ ఉంటే మెల్లమెల్లగా మీలో ఉన్న భయాలు పూర్తిగా అదృశ్యమవుతాయి. అలా తెలియని దానిని తెలుసుకోవడం ద్వారా లభించే అద్భుతమైన ఆనందానుభూతి, పరవశాలు మీలో ఒక రకమైన చిత్తశుద్ధిని కలిగించడంతోపాటు, అవి మీ తెలివితేటలకు పదునుపెట్టి మిమ్మల్ని మరింత శక్తివంతునిగా చేస్తాయి. అప్పుడు మీరు తొలిసారిగా ‘‘జీవితం’’ ఏమాత్రం విసిగించేది కాదని, అది ఒక సాహసమని భావించడం ప్రారంభిస్తారు. అప్పుడు మెల్లమెల్లగా మీలో ఉన్న భయాలు అదృశ్యమవుతాయి. దానివల్ల మీరు ఎప్పుడూ ఏదో ఒక ‘‘సాహస కార్యం’’ చెయ్యాలనే తపనతో అనే్వషిస్తూ ఉంటారు.
ధైర్యం చెయ్యడమనేది ప్రమాదంతో కూడుకున్న పని. ఎందుకంటే, అది తెలిసిన దానిని తెలియని దానికోసం, పరిచితమైన దానిని అపరిచితమైన దానికోసం, సౌకర్యమైన దానిని అసౌకర్యమైన దానికోసం పణంగా పెట్టడమే. అది ఒక తెలియని గమ్యాన్ని చేరేందుకు చేసే అనేక ప్రమాదాలతో కూడిన ఉత్సాహాన్ని కలిగించే తీర్థయాత్ర లాంటిది. కాబట్టి, తాను గమ్యాన్ని చేరగలడో, చేరలేడో ఎవరికీ, ఎప్పటికీ తెలియదు. అది ఒక జూదం. కాబట్టి, జీవితమంటే ఏమిటో కేవలం జూదగాళ్ళకు మాత్రమే తెలుసు.
ధైర్య మార్గం:
జీవితం మీ తర్కాన్ని ఏమాత్రం పట్టించుకోదు. దాని తీరులో అది ఏమాత్రం గందరగోళానికి గురికాకుండా వెళ్తుంది. జీవితం చెప్పే దానిని మీరు వినాలి కానీ, అది మీ తర్కాన్ని ఎప్పుడూ వినదు, ఏమాత్రం పట్టించుకోదు.
పెనుతుఫానుకు మహావృక్షాలు కూలిపోవడం, చిన్న చిన్న గడ్డిమొక్కలు ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉండడం జీవితంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. నిజానికి, మహావృక్షాల వేళ్ళు భూమి లోతుల్లోకి బాగా విస్తరించి ఉంటాయి. డార్విన్ సిద్ధాంతం ప్రకారం అలాంటి అత్యంత శక్తివంతమైన మహావృక్షాలు ఎలాంటి తుఫానునైనా తట్టుకుని నిలబడాలే కానీ, కూలిపోకూడదు. నిజానికి, మహావృక్షాలు కూలిపోయేందుకు ఏమాత్రం ఇష్టపడవు. అందుకే అవి కూలిపోకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాయి. అయినా తుఫాను తాకిడికి అవి కూలిపోతాయి. ఎందుకంటే, పెద్ద సుడిగుండం నుంచి పుట్టే పెనుతుఫాను ముందు ఎంత మహావృక్షమైనా ఒంటరి పోరాటం చెయ్యక తప్పదు. కానీ, పెను తుఫాను చిన్న చిన్న గడ్డిమొక్కలకు ఎలాంటి హాని చెయ్యలేదు. ఎందుకంటే, అవి దానిముందు తల వంచుతాయి.

ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’
నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.