సబ్ ఫీచర్

వంటగదిలో బొద్దింకలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో మనతో పాటుగా ఎన్నో క్రిమి, కీటకాలు నివాసం ఉంటాయన్నది యథార్థం. ఒక సర్వే ప్రకారం దాదాపుగా 90 శాతం గృహాల్లో ప్రమాదకర స్థాయిలో క్రిమికీటకాలు ఉంటాయని తేలింది. వీటన్నింటిలో బొద్దింకలు చాలా ప్రముఖమైనవి. ఇవి అన్ని గృహాల్లో, అన్ని కాలాల్లో దర్శనమిస్తాయి. చిన్న క్రిమి, కీటకాలను కొద్దిపాటి శుభ్రంతో దూరం చేసుకోవచ్చు. కానీ బొద్దింకలను నివారించడానికి చాలా జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. బొద్దింకలు ఒకసారి ఇంట్లోకి వస్తే అనేక రకాల క్రిములను ఇంట్లోకి ఆహ్వానించినట్లే.. సుమారుగా ఏడు రకాల పారసిటిక్ వారంకి, 301 రకాల బాక్టీరియా, ఇంకొక్క పది వరకు పాతోజేంస్ వరకు బొద్దింకలతో తయారవుతాయి. ఇవి అలర్జీలను కలిగించడమే కాదు, అనేక రకాలైన వ్యాధులను కొని తెస్తాయి. అందుకే వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు.. ఇవి మగతగా, చీకటిగా ఉండే ప్రదేశాల్లో సులువుగా ప్రజ్వరిల్లుతాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తే ఇంట్లో బొద్దింకలు పెరగకుండా చూసుకోవచ్చు.
* పరిసరాల శుభ్రతే మొదటి నియమం. ఏ రకమైన క్రిమి, కీటకాల నుండి ఇంటిల్లిపాదిని కాపాడాలంటే.. ముఖ్యంగా ఎక్కడైతే వంట, భోజనాలు చేస్తారో అక్కడ శుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే మిగిలిపోయిన ఆహార పదార్థాల పైన ఇవి ఎక్కువగా తిరుగుతుంటాయి. అభివృద్ధి చెందుతాయి. అందుకని భోజనం చేసే ప్రదేశాల్లో, వంట చేసిన తర్వాత స్టవ్ దగ్గర వెంటనే శుభ్రం చేయడం తప్పనిసరి.
* చాలావరకు పొద్దున్న వంట చేసిన పాత్రలను సాయంత్రం, రాత్రిళ్ళు వంట, భోజనం చేసినవి మరునాటి ఉదయం కడగడం చాలామందికి అలవాటు. కానీ ఈ పాత్రలను ఇలా సింక్‌లో వేశారంటే.. మీరు బొద్దింకలకు, ఇతర క్రిమి కీటకాలకు కావలసిన ఆహారాన్ని సమకూరుస్తున్నారన్నమాట. అలాకాకుండా వంట అయిన వెంటనే, పదార్థాలు తిన్న వెంటనే గినె్నలను కడిగేయడం అలవాటు చేసుకుంటే.. బొద్దింకలు వాటిపై తిరగకుండా ఉంటాయి. సమయంలేక గినె్నలను సింక్‌లో అలాగే ఉంచాల్సి వస్తే వాటిపై కొంచెం సబ్బు నీళ్లు చిలకరిస్తే బొద్దింకలు వాటిపై తిరగలేవు.
* కూరగాయలను తరిగిన చెత్త, పండ్ల నుంచి వచ్చిన చెత్త క్రిమికీటకాలకు అడ్డాగా మారుతుంది. అందుకే దీన్ని వెంటవెంటనే తీసివేయాలి. వంటగదిలో ఉండే గార్బేజ్ డబ్బా కూడా మూత ఉన్న దాన్ని వాడాలి. చెత్త డబ్బాను కూడా ఏ రోజుకారోజు శుభ్రం చేయాలి. ముఖ్యంగా వంటగదిలో మిగిలిపోయిన ఆహారపదార్థాలు లేకుండా చూడాలి.
* ఆహార పదార్థాలు బయట నేరుగా వదిలెయ్యకుండా కంటైనర్‌లోగానీ, వేరేరకంగాగానీ సీల్ చేయడం తప్పనిసరి. పప్పు్ధన్యాలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్.. ఇలా ఏవైనా కంటైనర్లలో దాచి పెట్టడం సరైన పద్ధతి. మిగిలిపోయిన ఆహారపదార్థాలను ఎయిర్‌టైట్ కంటైనర్లలో దాయడం మంచిది.
* వంటగదిలో ఎప్పుడూ గాలి, వెలుతురు సరిగా పడేలా చూడాలి. సింక్ కింద, వంటగది మారుమూలల్లో తరచూ శుభ్రపరచడం వల్ల వీటి నుండి దూరంగా ఉంచవచ్చు.
* ఎప్పుడైనా క్రిమిసంహారకాలు వాడాల్సి వస్తే ఆహారపదార్థాలను దూరంగా ఉంచాలి. సాధ్యమైనంతవరకూ వంటగదిలో క్రిమిసంహారకాలను వాడకుండా ఉండటానికి ప్రయత్నించాలి.