సబ్ ఫీచర్

పిల్లలు కోప్పడుతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో పది నుంచి పందొమ్మిది సంవత్సరాల వయసున్న టీనేజర్లు 120 కోట్ల మంది ఉన్నారని యునిసెఫ్ నివేదిక వెల్లడిస్తోంది. అదే భారతదేశం విషయానికి వస్తే.. 2011 జనాభా లెక్కల ప్రకారం వాళ్ల సంఖ్య 24 కోట్లు. ఇది భారతదేశ జనాభాలో పాతికశాతం. ప్రపంచంలో ఎక్కువ శాతం టీనేజర్లు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. పిల్లల్లో కోపం తెచ్చుకునే స్వభావం వాళ్ల వయసుపై ఆధారపడి ఉంటుంది. 2014లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం అమ్మాయిలకన్నా అబ్బాయిల్లో కోపం ఎక్కువగా ఉంటుందట. ఈ పరిశోధనను దేశంలోని ఆరు ప్రధాన ప్రాంతాల్లో మొత్తం 5467 మంది టీనేజ్, యవ్వన ప్రాయంలో ఉన్నవారిపై చేపట్టారు. దీనిలో 16-19 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఎక్కువ కోపం కనిపించగా, 20-26 ఏళ్ల మధ్య వయసున్న వారిలో తక్కువ కోపం కనిపించింది. దీన్ని బట్టి యవ్వన ప్రాయంలో కన్నా టీనేజీలోనే ఎక్కువ కోపం ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లో కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిశోధనలో పనె్నండు-పదిహేను ఏళ్ల వయసు బాలికల్లో పందొమ్మిది శాతం మంది పాఠశాల్లో ఏదో ఒక రకమైన వివాదంలో చిక్కుకున్నారని తేలింది. ఇంతకూ పిల్లలు ఇంత కోపం తెచ్చుకోవడానికి కారణం ఏమిటి? అని ఆలోచిస్తే..
ఓ ఆసుపత్రి సైకాలజిస్ట్ డాక్టర్ దీపాలి బాత్ర మాట్లాడుతూ.. ‘పిల్లలపై తల్లిదండ్రులు ఎంత దృష్టి పెడుతున్నారో తెలుసుకోవడం ముఖ్యం. పెద్ద పట్టణాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలపై పూర్తిగా దృష్టి పెట్టలేరు. ఏదో ఒక పని ఇవ్వడం అనే నెపంపై వాళ్లకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. అలాంటి సందర్భంలో పిల్లలు మొబైల్ ఫోన్లలో హింసాత్మక ధోరణి కలిగిన గేమ్స్ ఆడుతున్నారు’ అని తెలిపారు.
వీడియోగేమ్స్..
హింసాత్మక ప్రవృత్తి కలిగిన పిల్లలంతా రోజులో కనీసం మూడు, నాలుగు గంటలు వీడియోగేమ్స్ ఆడుతున్నారని పరిశోధనలో తేలిందట. ఈ ఆటల్లో ప్రత్యర్థిని అంతమొందించినప్పుడే పిల్లలు గెలుస్తారు. అలా మొబైల్ గేమ్స్ పిల్లల మనస్తత్వాన్ని మెల్లగా మార్చేస్తాయట. 2010లో అమెరికా సుప్రీంకోర్టు.. హత్యలు, లైంగిక హింస ఉన్న వీడియోగేమ్స్ ఆడటాన్ని అనుమతించరాదని సూచించింది. దీనికి ఐదేళ్ల ముందు కాలిఫోర్నియా గవర్నర్ 18 ఏళ్లలోపు పిల్లలు హింసాత్మక ప్రవృత్తి కలిగిన వీడియోగేమ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అమెరికా సైకాలజీ సంస్థ కూడా వీడియో గేమ్స్ మానవ ప్రవృత్తిని మార్చడంలో చెప్పుకోదగిన పాత్ర పోషిస్తాయని పేర్కొంది. ఒకసారి పిల్లల చేతికి మొబైల్ ఫోన్ అందితే దాంతో యూట్యూబ్ వీడియోల నుంచి పోర్న్ దృశ్యాల వరకు అందుబాటులోకి వస్తాయి.
మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేయడం.. ఇవన్నీ ఆధునిక జీవితం పర్యవసానాలు.. అయితే పిల్లల్లో హింసాప్రవృత్తికి మరో కోణం కూడా ఉంది. మొబైల్స్, ఇంటర్నెట్ లేని కాలంలోనూ పిల్లల్లో హింసాప్రవృత్తి ఉంది. దీనికి కారణం.. పిల్లల్లో వచ్చే హార్మోన్ మార్పులే.. ఆ సమయంలో వాళ్ల శరీరావయవాలు, మెదడు కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. పదకొండు నుంచి పదహారు ఏళ్ల వయసును కిశోరప్రాయం అంటారు. ఈ సమయంలో పిల్లలు ఎమోషనల్‌గానే ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు పాఠశాలలోని ఇతర పిల్లలతో గొడవపడుతూ, తిడుతూ, చదువుపై శ్రద్ధ చూపించలేదు అంటే.. మీరు పిల్లలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని అర్థం అని చెబుతారు పిల్లల మానసిక నిపుణులు. అలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లలకోసం సమయాన్ని కేటాయించాలి. వాళ్లతో పాటు బైటకు వెళ్లి వాళ్లతో రకరకాల ఆటలు ఆడాలి. వాళ్ళతో మాట్లాడాలి. వాళ్లు చేసే ప్రతి పనిలో తప్పులు వెదకడం మానేయాలి. ఎందుకంటే వారి వ్యక్తిత్వం రూపుదిద్దుకునే సమయం ఇదే.. *