సబ్ ఫీచర్
బేర్మన్న బాలీవుడ్-2018
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు రూపొందించేది మనమే. అందులో ఎలాంటి సందేహం లేదు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా దేశంలోని భాషల్లో కలుపుకుని భారీ సినిమాలు తెరకెక్కిస్తూ అటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తుండటం ఏటా సహజంగా జరిగేదే. అయితే ఈమధ్య బాలీవుడ్లో సినిమా మేకింగ్ విషయంలో మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయడంలేదు. కథను నమ్మారంటే చాలు.. కోట్లకు కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేస్తున్నారు. ఈ విషయంలో నిర్మాణ సంస్థలు, నిర్మాతలు ఏమాత్రం ఆలోచించడం లేదు. కారణం హిందీ సినిమాకు ప్రపంచస్థాయి మార్కెట్ వుంది కాబట్టి దర్శక నిర్మాతలు ఆ మాత్రం ధైర్యం చేస్తున్నారు. అయితే భారీ బడ్జెట్‌తో తీసే సినిమాలన్నీ సూపర్హిట్సేనని చెప్పడానికి ఆస్కారం ఉండదు. యావరేజ్‌గా నిలబడితే ఫరవాలేదని అనుకోవచ్చు. కానీ, ఈ ఏడాది కొన్ని సినిమాలు భారీ బడ్జెట్, అంతకంటే భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ మార్క్‌తో వెనక్కి వెళ్లిపోయాయి. భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లాపడ్డాయి. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాపైతే, నష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మళ్లీ కోలుకోడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయడం కష్టం. ఈ ఏడాది బాలీవుడ్లో ఈ పరిణామాలే ఎక్కువ చోటుచేసుకున్నాయి. బాలీవుడ్ సినిమాలు ఎక్కువ శాతం -నిర్మాతలకు కోట్లలోనే నష్టాలు మిగిల్చాయి.
ఇక్కడో విషయం ప్రస్తావించుకోవాలి. వర్సటైల్ యాక్టర్ అమీర్‌ఖాన్ గురించి. అమీర్‌కు చిత్రమైన క్యారెక్టర్ చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ క్యారెక్టర్‌పై ఆసక్తితో హాలీవుడ్ స్థాయి సినిమా తీయాలనుకున్నాడు. అమీర్ తలచుకుంటే -నిర్మాతలకు కొదువా. సో, భారీ బడ్జెట్ సిద్ధమైపోయింది. బాహుబలి రికార్డులను క్రాస్ చేయాలన్న ఆలోచన వరకూ సినిమా సాగింది. విడుదలైన తరువాత తేలిన విషయమేంటంటే -ఆ సినిమా డిజాస్టర్. అదే -్థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన చిత్రం కనీసం ప్రమోషన్ కోసం పెట్టిన ఖర్చులనూ రాబట్టలేకపోయిందని సోషల్ మీడియాలో సాగిన ప్రచారంలో కొంతైనా వాస్తవం లేకపోలేదు. గత కొనే్నళ్లలో అమీర్‌ఖాన్ నటించిన సినిమాల్లో ఇదే అతి పెద్ద డిజాస్టర్. ఇండియన్ సినీ చరిత్రలోనూ ఇదే పెద్ద ఫ్లాప్ అనుకోవాలి. హాలీవుడ్లో రూపొందిన కరేబియన్ నైట్స్ తరహా సినిమాలో నటించాలన్న అమీర్‌ఖాన్ ఆశ ఖరీదు 300 కోట్లు!?
దీని తరువాత బాలీవుడ్లో భారీ నష్టాన్ని మిగిల్చిన చిత్రం -రేస్ 3. గతంలో వచ్చిన రేస్ సిరీస్ సినిమాలు సంచలన విజయాలు అందుకోవడంతో భారీ అంచనాలతో రేస్-3ని తెరకెక్కించారు. దాదాపు 185 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. కాని ఈ సినిమా కనీసం 100 కోట్ల షేర్‌ను కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమాతో రేస్ సీక్వెల్‌ను తెరపడినట్టే అనుకోవాలి. తరువాత అర్జున్‌కపూర్, పరిణితి చోప్రా జంటగా తెరకెక్కిన ‘నమస్తే ఇంగ్లాండ్’ సైతం భారీ అంచనాలతోనే రూపొందింది. ఏకంగా 54 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం, విడుదలైన తరువాత 10 కోట్ల షేర్ కూడా తేలేకపోయింది. భారీ డిజాస్టర్స్‌లో ఇదొకటి అని చెప్పాలి. తరువాత షాహిద్‌కపూర్- శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ‘బట్టి గుల్ మీటర్ చాలు’ చిత్రం దాదాపు 50 కోట్లతో నిర్మించారు. ఇదీ అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచి కనీసం 20 కోట్లను కూడా రాబట్టలేదు. సిద్ధార్థ్ మల్హోత్రా కీలక పాత్రలో నటించిన అయ్యారీ చిత్రం 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కేవలం 15 కోట్లను మాత్రమే రాబట్టింది. ఈ లిస్ట్‌లో చేరిన మరో సినిమా ఫనే్నఖాన్. సీనియర్ నటుడు అనిల్‌కఫూర్ -ఐశ్వర్యరాయ్ కలిసి నటించిన చిత్రం 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఐశ్వర్యారాయ్ లాంటి అందాలరాశి వున్నా సినిమా మాత్రం కనీసం 10 కోట్లను కూడా రాబట్టలేదు. జాకీష్రాఫ్- అర్జున్ రాంఫాల్ నటించిన పల్టాన్ చిత్రం కేవలం 15 కోట్లతోనే రూపొందింది. టైటిల్‌కి తగ్గట్టే సినిమా పల్టీ కొట్టేసింది. కనీసం సినిమాలో ఐదు శాతం వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. సోనాక్షిసిన్హా నటించిన చిత్రం హ్యాపీ ఫిర్ బాగ్ జాయేది. ఫిమేల్ లీడ్ రోల్లో సోనాక్షి మెరిపించిన మెరుపులు జనాలకు నచ్చలేదు. దాదాపు 30 కోట్లతో తెరకెక్కిన సినిమా కేవలం 10 కోట్లను మాత్రమే వసూలు చేసి అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది.
ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన జీరో సినిమా బాక్సాఫీస్ వద్ద నిజంగానే జీరో అయిపోయింది. దాదాపు 50 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక అట్టర్‌ఫ్లాప్ లిస్ట్‌లో నిలిచింది కాలాకండి. సైఫ్ అలీఖాన్ వంటి స్టార్ నటించిన చిత్రం 20కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. భారీ అంచనాలమధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా నిలిచింది. లిస్ట్‌లో చేరిన మరో సినిమా ఒమెర్టా- టెర్రరిజం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. కానీ కేవలం 3 కోట్లు మాత్రమే రాబట్టింది. మొత్తానికి ఈ ఏడాది బాలీవుడ్లో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు ఇలా అట్టర్ఫ్లాప్లుగా నిలిచి దర్శక నిర్మాతల ఆశలను అడియాశలు చేశాయి.