సబ్ ఫీచర్
వరుస పెట్టేస్తున్నారు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఎదురు చూస్తున్న సినిమా విడుదలైందని ప్రేక్షకులకు ఆనందం. చాలాకాలంగా తమ సినిమాల విడుదలకు అడ్డంకిగా మారిన సినిమా థియేటర్లకు వచ్చేసిందని నిర్మాతల ఆనందం. ఏదైతేనేం -గ్రేట్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్‌ల విజువల్ వండర్ 2.ఓ థియేటర్లను ఆక్రమించేసింది. హర్డిల్ తొలగిపోవడంతో వచ్చేవారం నుంచి పెండింగ్‌లో పడిన సినిమాలు థియేటర్ల వద్ద క్యూ కట్టనున్నాయ. చిన్నా పెద్ద చిత్రాలు కలిపి కొత్త ఏడాది ఆరంభమయ్యేలోపు 20 వరకూ రావొచ్చని ఓ అంచనా.
మొత్తానికి చాలా సినిమాలు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నాయి. ఎన్నో రోజులుగా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా 2.0 విడుదలవుతుందని తెలిసి చాలా సినిమాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. అంత భారీ సినిమా వస్తున్నపుడు అనవసర రిస్క్ ఎందుకంటూ ఆగిపోయిన సినిమాలు ఎన్నో. మొత్తానికి సూపర్‌స్టార్ రజని, శంకర్‌ల విజువల్ వండర్ 2.ఓ విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుని వసూళ్లు రాబడుతుంది. 2.ఓకు రూట్ క్లియర్ చేస్తూ ఆగిన సినిమాలు, వాయిదా పడిన సినిమాలు ఇప్పుడు థియేటర్లకు క్యూ కట్టనున్నాయి. ఒకరంగా చెప్పాలంటే డిసెంబర్ మాసం మొత్తం సినిమా అభిమానులకు పండగే. ఒక్క ఈనెలలోనే దాదాపు 20కి పైగా చిన్న, పెద్ద సినిమాలు విడుదలకానున్నాయి. సూపర్‌స్టార్ సినిమాకు పోటీ దిగితే తేలిపోవడం ఖాయమన్న సంకోచంతోనే చాలా సినిమాలు విడుదల తేదీలు ప్రకటించుకుని, తరువాత మార్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే 2.ఓ ఎప్పుడు థియేటర్లకు వస్తుందన్నది నెల క్రితం వరకూ కన్ఫ్యూజింగానే ఉండటంతో, అప్పటి నుంచీ చాలా సినిమాలు వెనక్కి జరుగుతూనే వచ్చాయి. ఇప్పుడు 2.ఓ థియేటర్లలో ఉంది కనుక, వచ్చే వారం నుంచి సినిమాలను థియేటర్లకు తెచ్చేందుకు నిర్మాతలు పరుగులు తీస్తున్నారు. డిసెంబర్ 1న శ్రీకాంత్ హీరోగా ‘ఆపరేషన్ 2019’ విడుదలైంది. తెలంగాణ ఎన్నికలను టార్గెట్ చేస్తూ తీసిన చిత్రం కనుక, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాను విడుదల చేసేశారు. డిసెంబర్ 7తో తెలంగాణలో ఎన్నికలు పూర్తవుతున్నాయి. ఈలోగానే సినిమా ప్రేక్షకుల ముందుకు తెస్తేనే ఫలితం. అందుకే 2.ఓ విడుదలైన రెండోరోజే ‘ఆపరేషన్..’ చిత్రాన్ని థియేటర్లకు తెచ్చేశారు. ఇదివరకే శ్రీకాంత్ ఆపరేషన్ దుర్యోధన అంటూ ఓ సంచలన చిత్రాన్ని చేసి ఉండటంతో, సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక వచ్చే శుక్రవారం అంటే 7న ఏకంగా అరడజను చిత్రాలు విడుదలకు క్యూలో ఉన్నాయి. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో రాయలసీమ నేపథ్యంలో సాగిన రియలిస్టిక్ సినిమాగా తెరకెక్కిన ‘్భరవగీత’ సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్‌తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం అర్జున్‌రెడ్డి ట్రెండ్‌ని ఫాలో అవుతున్న ఈ సినిమాపై జనాల ఫోకస్ బాగానే ఉంది. అదేరోజు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘కవచం’ విడుదలవుతోంది. గ్లామర్ క్వీన్ కాజల్, మెహరీన్‌లాంటి అందాల భామలను పెట్టుకొని బెల్లంకొండ శ్రీనివాస్ రంగంలోకి పోలీస్‌గా దిగుతున్నాడు. ఇక అక్కినేని మనవడు సుమంత్ ఇనె్వస్టిగేషన్, సస్పెన్స్ తరహా కథతో సుబ్రమణ్యపురం సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాపై క్రమంగా అంచనాలు రెట్టింపవుతున్నాయి. మళ్లీ సుమంత్‌కు ఇది మంచి కమ్‌బ్యాక్ సినిమాగా ఉంటుందన్న ఆశలు లేకపోలేదు. ఇక సందీప్ కిషన్, మిల్కీ బ్యూటీ తమన్నాతో నెక్స్ట్ ఏంటి? అంటూ అల్ట్రామోడరన్ లవ్ స్టోరీ వస్తోంది. ప్రేమ, సెక్స్ అనే అంశంపై తెరకెక్కిన ఈ సినిమా కూడా జనాల్లో కొత్త క్రేజ్ క్రియేట్ చేసింది. ఇక చిన్న సినిమాల నిర్మాతగా ఇమేజ్ తెచ్చుకున్న బెక్కం వేణుగోపాల్ ఇదివరకే ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో కలిసి నేను లోకల్ అంటూ ఓ సూపర్‌హిట్ కొట్టేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ ఉత్సాహంతో సొంతంగా కొత్తవాళ్ళతో ‘హుషారు’ అంటూ యూత్‌ఫుల్ సినిమా తెరకెక్కించాడు. ఇప్పటికే మ్యూజిక్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈసినిమా ఈనెల 7న విడుదలవుతోంది. దాంతోపాటు కొత్త నటీనటులతో తెరకెక్కిన శుభలేఖలు చిత్రమూ విడుదల కానుంది. ఈవారంలో ఏకంగా ఐదారు సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి వీటిలో ఎవరు నెగ్గుతారో.. ఎవరు పరాజయం పాలవుతారో చూడాలి. అలాగే ఆపై వచ్చే శుక్రవారం అంటే -డిసెంబర్ 21న మూడు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటికే ఆ మూడు సినిమాలు అటు జనాల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించడం తెలిసిందే. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మెగా హీరో వరుణ్‌తేజ్ అంతరిక్షం. ఘాజిలాంటి కొత్త చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి టాలీవుడ్ స్పేస్ బ్యాక్‌డ్రాప్ సినిమా ఇది. ఇప్పటికే యావత్ ప్రేక్షకుల్లో ఓ రేంజ్ ఆసక్తి రేపిందిది. అలాగే శర్వానంద్ -సాయిపల్లవి జంటగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘పడి పడి లేచే మనసు’. పూర్తి లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమాపై యూత్‌లో ఫాలోయింగ్ వుంది. వీటితోపాటు కన్నడ హీరో యష్ నటించిన కెజిఎఫ్ తెలుగు, తమిళం, కన్నడం, హిందీలో అత్యంత భారీగా రిలీజవుతోంది. తర్వాత ఈ ఏడాది ఎండింగ్‌లో అంటే డిసెంబర్ 28న నిఖిల్ జర్నలిస్టుగా నటించిన ముద్ర, దాంతోపాటు మరో మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. మొత్తానికి చిట్టి ఎంట్రీ ఇవ్వడంతో మిగతా సినిమాలన్నీ విడుదలకోసం క్యూకట్టాయి.
ఈ ఏడాది చివరిలో రికార్డుస్థాయిలో సినిమాలు విడుదల అవ్వడం విశేషం. ఇక డిసెంబర్ ముగిసిందంటే మళ్లీ సంక్రాంతి సీజన్ మొదలైనట్టే.