సబ్ ఫీచర్
సినిమా చిన్నది.. కష్టం పెద్దది!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పటికీ ఉన్న వ్యవస్థను ఓన్ చేసుకుంటున్నారే తప్ప, చిన్న చిత్రాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమను విస్తృతపర్చే పరిస్థితి కనిపించడం లేదు.
తెలంగాణ మాండలికం (యాస, భాష) వల్ల కొంతమంది పెద్ద దర్శక నిర్మాతలు నేటివిటీకి సంబంధించిన చిత్రాలు తీయడానికి ముందుకొస్త్తున్నారు. తెలంగాణ భాషలో కాస్త మొరటు పదాలు, గమ్మత్తయిన డైలాగులు ఉండటమే కారణం. ఎక్కడి ప్రాంతంలోని భాషను, యాసను అక్కడి ప్రజలు ఆదరిస్తారు.
తెలంగాణలో పత్తి రైతుకు, సినీ నిర్మాతకు పెద్ద తేడా లేకుండా పోయింది. రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే, చేతికొచ్చే సమయానికి మద్దతు ధర లేక, పెట్టుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక, సమాజంలో తలదించుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తున్నాడు. అలాగే చిన్న సినిమా నిర్మాతలూ లక్ష ఆశలతో ఉన్న ఆస్తులమ్మి సినిమా నిర్మిస్తే, ప్రేక్షకుల ముందుకెళ్ళే సమయానికి డిస్ట్రిబ్యూటర్లు లేక, బయ్యర్లు దొరకక, థియేటర్లు అందక.. నిర్మాత అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయ. ఇక తెలంగాణ భాష, యాస, ప్రాంతీయ పరిస్థితులను చూపిస్తూ సినిమాలు తీస్తే, వాటి పరిస్థితి మరీ అగమ్యగోచరం. తెలంగాణ రాష్ట్రావిర్భావం తరువాత కూడా దర్శక నిర్మాతలు అలాంటి చిత్రాలు నిర్మించడానికి ముందుకు రాకపోవడానికి ముఖ్య కారణం తెలంగాణ డైరెక్టర్లు కమర్షియల్ హిట్లుపై పడటమే. తెలంగాణ వాతావరణం, పరిస్థితుల్ని తెరమీద చూపించాలంటే కూడా ఆంధ్రుల సహకారం, మద్దతు తప్పదు. ఎందుకంటే -చిన్న సినిమాల విడుదలకు థియేటర్లు దొరకడం కష్టం. ఎక్కువ థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు పెద్ద పెద్ద దర్శక నిర్మాతలకు సంబంధించినవారే.
పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్ల చిత్రాలకు ఉన్న థియేటర్లన్నీ రిజర్వ్ చేయబడతాయి. అదే సమయంలో చిన్న నిర్మాతలు, దర్శకులు క్రొత్తవారితో నిర్మించిన చిత్రాల విడుదలకు కనీసం పదుల సంఖ్యల్లో కూడా థియేటర్లు ఖాళీ ఉండవు. ఈ ఇబ్బందులు అధిగమించలేకే చిన్న దర్శక నిర్మాతలు ఒకట్రెండు చిత్రాలతో సరిపెపెట్టేస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలను అన్ని థియేటర్లలో విడుదల చేయకపోతే వారు నిర్మించిన చిత్రానికి, నటీనటులకు గిట్టుబాటు కాదు. సో, వాళ్ళ ఆలోచనలూ సబమే అయనప్పటికీ, చిన్న సినిమాలు నడిపించటానికి (ప్రదర్శించటానికి) థియేటర్లు లేకపోవడంతో దర్శక నిర్మాతలు ఇబ్బందుల పాలవుతున్నారు. కనీసం వారు నిర్మించిన చిత్రాల్లోని మెసేజ్ ఏమిటో కూడా ప్రేక్షకులకు అందేంత సమయం లేకుండాపోతోంది. దీంతో నిర్మాతలు అప్పుల పాలవుతున్నారు. దర్శకులు, టెక్నీషియన్లకు గుర్తింపులేకుండాపోతోంది.
ఒక ఉదాహరణ తీసుకుందాం. ‘పెళ్ళిచూపులు’ చిత్రానికి ఏ నిర్మాతా ముందుకు రాకపోవడంతో కాస్త ఆలస్యమయినా హీరో విజయ్ దేవరకొండ బంధువు యస్ రంగినేని ఆ సినిమాను నిర్మించాక సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇదొక్కటే కాదు, అలాంటి పరిస్థితులు దాటి రావడానికి దాదాపు అన్ని సినిమాలదీ ఇదే పరిస్థితి. తెలంగాణలో దర్శకులకు సత్తా ఉండి కూడా అవకాశాలు రాక, వచ్చినా సినిమాలు విడుదలలో జాప్యమై టాలెంట్‌ను నిరూపించుకోలేక పోతున్నారు. కేవలం ఇలాంటి పరిస్థితి ఒక్క దర్శకులదే కాదు, రచయితలు, గేయ రచయితలు, నటీనటులు, 24 ఫ్రేమ్స్‌లోని అన్ని రంగాల టెక్నిషియన్ల పరిస్థితీ అంతే.
తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పటికీ ఉన్న వ్యవస్థను ఓన్ చేసుకుంటున్నారే తప్ప, చిన్న చిత్రాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమను విస్తృతపర్చే పరిస్థితి కనిపించడం లేదు.
తెలంగాణ మాండలికం (యాస, భాష)వల్ల కొంతమంది పెద్ద దర్శక నిర్మాతలు నేటివిటీకి సంబంధించిన చిత్రాలు తీయడానికి ముందుకొస్త్తున్నారు. తెలంగాణ భాషలో కాస్త మొరటు పదాలు, గమ్మత్తయిన డైలాగులు ఉండటమే కారణం. ఎక్కడి ప్రాంతంలోని భాషను, యసను అక్కడి ప్రజలు ఆదరిస్తారు.
మద్రాసునుండి హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ వచ్చిన తర్వాత హైద్రాబాద్‌లో స్టూడియో, ల్యాబ్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఈ కార్పొరేషన్ సహాయ సహకారాలతో రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిల్మ్‌సిటి లాంటి నిర్మాణ సంస్థలు ఎదిగాయ. నూటికి 60నుంచి 70 శాతం వరకు చిత్రాలన్నీ ఈ సంస్థల్లో నిర్మాణం జరిగినవే. ఇలాంటి స్టూడియోలు, ల్యాబ్‌లు పెట్టుకోవడానికి ఈ కార్పొరేషన్ వాళ్ళు వాటికి కావలసిన స్థలాలు, రాయితీలు (పన్నులకు సంబంధించి), పెద్దఎత్తున సబ్సిడీలు, సినిమా థియేటర్లు కట్టుకోవడానికి పెద్దఎత్తున సహాయం అందించింది. ఆశించిన దానికంటె ఎక్కువగా ఊహించని రీతిలో మేలు జరిగిందని చెప్పాలి.
తెలంగాణ కవులకు, కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. ఎందరో మట్టిలో మాణిక్యాలు ఈ తెలుగు నేలలో ఉన్నారు. తెగువతో, కసితో, కృషితో, పట్టుదలతో, తమ శక్తిసామర్థ్యాలతో పైకి రావాలని పరితపించే వారెందరో ఉన్నారు. కానీ అవకాశాల్లేక నిరీక్షిస్తున్నారు. తెలంగాణ భాష వెండితెరపై కనిపించటం ఆంధ్రా ప్రేక్షకులకే కాదు తెలంగాణలోని ప్రేక్షకులకూ క్రొత్తే. తెలంగాణ యాసతో, హైదరాబాదీ పదాలు కలిసిపోతే ఆ కిక్కేవేరు. అలాంటి కలయికతో తీసినటువంటి ‘్ఫదా’ చిత్రం బాగా నడిచింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను అలరించింది. కాకపోతే తెలంగాణలోని దర్శక నిర్మాతల్లో కూడా ఇంకా తెలంగాణ నేటివిటీ అనేది కమర్షియల్ స్థాయికి ఎదగలేదనే భావన కాస్తఉంది. అయితే తెలంగాణలోని సంస్కృతీ, సంప్రదాయాలకు ఒక అస్థిత్వం, గుర్తింపు ఉంది. కానీ ఆ అస్థిత్వాన్ని సినిమాగాతీస్తే దాన్ని అర్థం చేసుకొని ఆ సినిమాలను పంపిణీచేసే వారుకానీ, పెట్టుబడి నిర్మాణం చేసేవారుగాని, బిజినెస్ చేసే వాళ్ళుగానీ లేరు. ఇదే ముఖ్య కారణం. ఈ కారణంతోనే దర్శకులు, నటీనటులు, రచయితలు, టెక్నీషియన్స్ బయటికి రావడంలేదు. వచ్చినప్పటికీ ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉండలేకపోతున్నారు. అయితే చిన్న దర్శకుల పరిస్థితి ఎలా ఉందంటే రోజుల తరబడి పెద్దపెద్ద నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగితే మొదటి చిత్రం సక్సెస్ అయినంక కలుద్దాం. అప్పుడు నీతో సినిమా చేయడం గురించి ఆలోచిస్తాననేవాళ్ళే ఇండస్ట్రీలో ఎక్కువమంది ఉన్నారు. దశాబ్దాలుగా స్క్రిప్టులు పట్టుకొని తిరిగినవారికి ఆ మాటలు వినగానే ఎంతగానో నిరుత్సాహమనిపిస్తుంది. అందుకే -రాయితీలుఇస్తే తెలంగాణ ప్రాంతంలో దర్శకులు, నిర్మాతలు అన్నిరకాల నటీనటులు, టెక్నీషియన్లూ తమ సత్తా ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇన్ని ఇబ్బందుల్లోనూ తెలంగాణ అస్థిత్వాన్ని తెలిపేటటువంటి చిత్రాలు వస్తూనే ఉన్నాయి. సినిమాలు తీసే శక్తి, ఆర్థికబలం ఉన్నప్పటికీ చిత్రం పూర్తయిన తర్వాత విడుదలలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి లేకపోలేదు. పెద్ద చిత్రాలకు ఎక్కువ థియేటర్లు రిజర్వుచేసినప్పటికీ, చిన్న చిత్రాలకు కనీసం అందులో సగం థియేటర్లయినా కేటాయిస్తే బాగుంటుంది. ప్రతీ సినిమా మల్టీస్టారర్ కాదు, ప్రతీది భారీ బడ్జెట్‌తో తీయలేరు, వంద కోట్లు పెట్టి నిర్మించిన సినిమాలు కూడా అట్టర్‌ఫ్లాప్ అయిన సందర్భాలు లేకపోలేదు. చిన్న సినిమాలు బాక్సాఫీస్ బ్రద్దలుకొట్టిన సందర్భాలూ లేకపోలేదు. హీరోలు, దర్శక నిర్మాతలు తెలుగువారే అయినప్పటికీ హీరోయిన్లు బాలీవుడ్, మోలీవుడ్, కోలీవుడ్‌ల నుండి ఎక్కువమంది వస్తున్నారు. పెద్దపెద్ద సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబాలనుండే హీరోలు వస్తున్నారు. వారు తీసిన సినిమాలు విడుదలయినపుడే చిన్న చిత్రాలకు థియేటర్లు దొరక్కపోవడంతో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి.